Begin typing your search above and press return to search.

టీడీపీ కూటమిలో మధ్యంతర గుబులు !?

ఏపీలో అయిదేళ్ల పాటు నిండుగా అధికారంలో ఉంటామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నెమ్మదిగా తన యాక్షన్ ప్లాన్ ని అమలు చేస్తోంది.

By:  Tupaki Desk   |   17 Sep 2024 1:51 PM GMT
టీడీపీ కూటమిలో మధ్యంతర గుబులు !?
X

ఏపీలో అయిదేళ్ళ తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆ పార్టీతో జత కట్టి పవర్ షేర్ చేసుకున్న జనసేనలకు ఇపుడు బీజేపీ పేల్చిన మధ్యంతర బాంబు షాక్ ఇచ్చేదే అని అంటున్నారు. ఏపీలో అయిదేళ్ల పాటు నిండుగా అధికారంలో ఉంటామని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నెమ్మదిగా తన యాక్షన్ ప్లాన్ ని అమలు చేస్తోంది.

టీడీపీ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను కూడా వాయిదా వేసుకుంటోంది. ఇంకా అయిదేళ్ల టైం ఉంటుంది అని ధీమా చేస్తోంది. అయితే కేంద్రంలో బీజేపీ పెద్దలు మాత్రం వడివడిగా మధ్యంతరం వైపుగా అడుగులు వేస్తున్నారు. కేంద్రంలోనూ బీజేపీలోనూ బలమైన నాయకుడిగా ఉన్న హోం మంత్రి అమిత్ షా మధ్యంతర ఎన్నికల మీద సంచలన ప్రకటన చేశాక అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని అంటున్నారు.

ఇక్కడ బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే జమిలి ఎన్నికలతో మధ్యంతరం తీసుకుని రావాలని బీజేపీ చూస్తోంది అంటున్నారు. నిజానికి బీజేపీకి జమిలి ఎన్నికలు అన్న కల ఈనాటిది కాదు, ఇప్పటికి పదేళ్ళ క్రితం నాటిది. అలా 2019లోనూ జమిలి అన్న మాట వినిపించింది. ఆ తరువాత 2024లో మరోసారి అదే మాట అన్నారు.

కానీ అది అమలుకు నోచుకోలేదు. ఇపుడు మాత్రం కచ్చితంగా జరిపేట్లుగానే ఉంది. బీజేపీకి మూడవసారి అధికారం దక్కింది. ఆ పార్టీ అజెండాలో ఉన్న ఒక్కో అంశం నెమ్మదిగా అమలు చేసుకుంటూ వస్తున్న బీజేపీ ఒకే దేశం ఒకే ఎన్నికలు అన్న దాన్ని కూడా కన్ ఫర్మ్ గా చేసి తీరుతుంది అని అంటున్నారు. దానికి కారణాలు అనేకం అని చెబుతున్నారు.

లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీలకు ఎన్నికలు ఒకేసారి జరిగితే మోడీ ప్రభావం ఆయా రాష్ట్రాల మీద పడి బీజేపీకి లబ్ది కలుగుతుంది. లేకపోతే అసెంబ్లీలలో ప్రాంతీయ పార్టీలకు ఇతర పార్టీలకు జనాలు మొగ్గు చూపుతారు అని అంటున్నారు. దానికి ఉదాహరణ కర్నాటక తెలంగాణలో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల మధ్య తేడాను చూడొచ్చు. అసెంబ్లీలో ఓడిన బీజేపీ పార్లమెంట్ లో మాత్రం ఎక్కువగా ఎంపీ సీట్లు గెలుచుకుంది.

దాంతో పాటు ప్రాంతీయ పార్టీలను దెబ్బ తీసే వ్యూహం కూడా ఉంది అని అంటున్నారు. ఇంకో విషయం ఏంటి అంటే ఈసారి బీజేపీ పూర్తి మద్దతుతో కేంద్రంలో అధికారంలోకి రాలేదు. జేడీయూ టీడీపీల మద్దతుతో అయిదేళ్ళు నెట్టుకుని రావడం అంటే కష్ట సాధ్యమే అని అంటున్నారు. పైగా ఆ పార్టీల ఒత్తిళ్లకు తలొగ్గి పాలించడం కూడా బీజేపీకి అంతగా నచ్చదు అని అంటున్నారు.

అందుకే ఇండియా కూటమి కూడా కేంద్రంలో బీజేపీ అయిదేళ్ళూ పాలించదు అని చెబుతూ వస్తోంది. అయితే మిత్రులు హ్యాండ్ ఇచ్చి ప్రభుత్వం పడిపోవడం కంటే తామే మధ్యంతర ఎన్నికలకు వెళ్ళడం ద్వారా మరోసారి ప్రజల తీర్పుని కోరి పూర్తి మద్దతుతో అధికారంలోకి రావాలన్నదే బీజేపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు.

దాంతో బీజేపీకి కేంద్రంలో ఉన్న రాజకీయ అనివార్యతల రిత్యా మధ్యంతరానికి వెళ్ళడం ఖాయమని అంటున్నారు. దాంతో బీజేపీ కనుక మధ్యంతర ఎన్నికలకు వెళ్తే ఎపుడు ఆ ముహూర్తం అన్న చర్చ వస్తోంది. దేశంలో అసెంబ్లీ ఎన్నికలు అన్నీ కూడా 2026 దాకా వరసబెట్టి జరుగుతాయి. ఈ ఏడాది చివరిలో కొన్ని 2025లో బీహార్ వంటి చోట్ల 2026లో ఉత్తర ప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ వంటి చోట్ల అసెంబ్లీలకు ఎన్నికలు ఉన్నాయి.

దాంతో యూపీ అసెంబ్లీ ఎన్నికలతోనే మధ్యంతరనికి కేంద్రం ముహూర్తంగా పెట్టుకుంటుంది అని అంటున్నారు. ఎందుకంటే యూపీలోనే ఎక్కువ ఎంపీ సీట్లు ఉన్నాయి. అంటే 2026లో కేంద్రం ఎన్నికలకు వెళ్ళే చాన్స్ ఉందని ఒక ప్రచారం అయితే సాగుతోంది. అలా కనుక బీజేపీ ఎన్నికలకు వెళ్ళకపోతే ప్రభుత్వాన్ని మిత్రుల ఒత్తిడి నుంచి కాపాడుకోవడం కష్టం అవుతుంది అన్న చర్చ ఉంది.

సో బీజేపీ మనసులో మాట అన్నది బయటకు వచ్చింది. మరి ఏపీ సంగతి ఏంటి అన్నదే ఇక్కడ మ్యాటర్. ఏపీలో రెండేళ్లలో మళ్లీ ఎన్నికలు అంటే అప్పటికి కూటమి ప్రభుత్వం సర్దుకుంటుందా అన్నది కూడా చూడాల్సి ఉంది అని అంటున్నారు. హామీలు అన్నీ అమలు చేస్తే ఏమో కానీ అటు సంక్షేమం లేక ఇటు అభివృద్ధిని చూపించకపోతే మాత్రం ఏపీలో కూటమికి ఇబ్బందులు వస్తాయా అన్న చర్చ సాగుతోంది.