Begin typing your search above and press return to search.

కూటమి ఆరు నెలల ప్రొగ్రెస్ రిపోర్టు...మంత్రులకు టెన్షన్!

ఇక తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ మంత్రులకు బాబు దిశా నిర్దేశం చేసినట్లుగా చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   4 Dec 2024 2:34 AM GMT
కూటమి ఆరు నెలల ప్రొగ్రెస్ రిపోర్టు...మంత్రులకు టెన్షన్!
X

ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఈ నెల 12తో ఆరు నెలలు నిండుతున్నాయి. అంటే హానీమూన్ కంప్లీటెడ్ అన్న మాట. ఏ ప్రభుత్వం మీద అయినా జనాలకు ఆశలు అన్నీ తొలి ఆరు నెలలలో మబ్బులలా కమ్ముకుంటాయి. దాంతో ప్రభుత్వం గురించి ప్రజలు సానుకూల ధోరణిలోనే చూస్తూంటారు. ఆ మబ్బులు మెల్లగా విడిపోయే కాలం ఆ తరువాత మొదలవుతుంది.

అపుడు పాలన ఎలా సాగుతుంది అన్నది ప్రజలు కూడా రివ్యూస్ చేస్తారు. ప్రజల రివ్యూస్ ఎలా ఉన్నా ప్రభుత్వం కూడా తన వంతు రివ్యూస్ ఎప్పటికపుడు చేసుకుంటూ ఉండాలి. ఆ విషయంలో రాజకీయంగా ఢక్కామెక్కీలు తిన్న చంద్రబాబుకు ఎవరూ చెప్పాల్సిన అవసరం అయితే లేనే లేదు అని అంటున్నారు. ఆయన ప్రజల నాడిని ఎప్పటికపుడు పట్టుకోవడానికే చూస్తూంటారు అని అంటున్నారు.

ఇదిలా ఉంటే బాబు కేబినెట్ లో 24 మంది మంత్రులు ఉన్నారు. వీరిలో అరడజను మంది తప్ప అంతా కొత్త ముఖాలే ఉన్నారు. అదే సమయంలో బాబు మంత్రుల పనితీరు మీద ఎప్పటికపుడు అధ్యయనం చేస్తున్నారు. తనదైన నివేదికలను ఆయన దగ్గర పెట్టుకుని వారికి తగిన సూచనలు చేస్తూ వస్తున్నారు.

ఇక తాజాగా నిర్వహించిన కేబినెట్ సమావేశంలోనూ మంత్రులకు బాబు దిశా నిర్దేశం చేసినట్లుగా చెబుతున్నారు. ఆరు నెలల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రతీ మంత్రి తన శాఖ పరిధిలో పనితీరు మీద నివేదికలను చంద్రబాబు కోరారు. అంటే మంత్రులు తమ శాఖల పనితీరుని ఈ విధంగా బాబు మధింపు చేస్తారు అని అంటున్నారు.

అంతే కాదు బాబు వద్ద కూడా మంత్రుల పనితీరు మీద నివేదికలు ఉన్నాయని అంటున్నారు. దాంతో వీటిని అన్నింటికీ క్రోడీకరించి మంత్రులకు రానున్న రోజులలలో పనితీరుని మెరుగుపరచుకోవడానికి సూచనలు ఇస్తారని అంటున్నారు. ఒక విధంగా మంత్రుల పనితీరుకు ప్రోగ్రెస్ రిపోర్టులు గా వీటిని చూస్తున్నారు.

మొత్తం మంత్రులలో కొందరు మాత్రమే తమ శాఖలలో పట్టు సాధిస్తున్నారు అని అంటున్నారు. మరి కొందరు నెమ్మదిగా గాడిలో పడుతున్నారని కూడా చెబుతున్నారు. కొందరు మంత్రులు మాత్రం ఇంకా పట్టు సాధించే పనిలోనే ఉన్నారని అంటున్నారు. దీంతో ఆరు నెలల పాలన పూర్తి అవుతున్న నేపథ్యంలో చంద్రబాబు మంత్రుల విషయంలో కాస్తా సీరియస్ గానే వ్యవహరిస్తారు అని ప్రచారం అయితే సాగుతోంది.

ప్రభుత్వం పనితీరు అన్నది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీదనే ఎక్కువగా ఆధారపడుతుంది. అందుకే బాబు పదే పదే మంత్రులను తమ పనితీరుని వీలైనంత మెరుగ్గా చేసుకోవాలని కోరుతున్నారు. అంతే కాదు వారు బాగా రాణించాలని ఆశిస్తున్నారు. ఏ మాత్రం ప్రభావం చూపించకపోయినా ఇబ్బందులు వస్తాయన్నది కూడా కూటమి పెద్దల ఆలోచనగా ఉంది. దీంతో మంత్రులు తమ శాఖలలో పనితీరు మీద ఈ విధమైన నివేదికలు ఇస్తారు అన్నది ఇపుడు చర్చనీయాశం అయింది.

అదే సమయంలో చంద్రబాబు వద్ద కూడా ఉంటాయని భావిస్తున్న ప్రోగ్రస్ నివేదికలు ఏమి చెప్పబోతున్నాయన్నది కూడా చూడాలని అంటున్నారు. మొత్తం మీద చూస్తే గతంలో ఎలా ఉన్నా ఇక హానీమూన్ పీరియడ్ ముగుసినందువల్ల అంతా పూర్తిగా తమ శాఖల విషయంలో పట్టు సాధించి ముందుకు సాగాలని చంద్రబాబు కోరుతున్నారని అంటున్నారు.