ఏపీ తగలబడి పోయింది: అయ్యన్న హాట్ కామెంట్స్!
Ayyanna Patrudu Comments On Roja
By: Tupaki Desk | 19 July 2023 2:18 PM GMTటీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ తగలబడి పోయిందని అన్నారు. అదేసమయంలో మంత్రి రోజాపైనా ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తనదైన శైలిలో మాట్లాడారు. ``మనకి ఒక మహిళా మంత్రి.. ఆమె మహిళో ఇంకేమన్నానో.. రంగుల రాణి మాత్రం అంటున్నారు. ఆమెను ఏదైనా సమస్య గురించి అడిగితే.. నా సొగసు చూడు మాయా అంటాది`` అని అయ్యన్న వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇలాంటోళ్లు మనకు మంత్రులుగా ఉన్నారు మన ఖర్మ అని వ్యాఖ్యానించారు.
ఇక, అప్పులపై మాట్లాడుతూ.. ``రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల రూపాయల అప్పలు చేసింది. ఇక, చాలు. ఇప్పటికే ఏపీ తగలబడిపోయింది`` అని అయ్యన్న దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు తాగి ఊగితే తప్ప.. ప్రభుత్వం నిలబడి పాలన చేసే పరిస్థితి లేకుండా పోయిందని దుయ్యబట్టారు. వేల కోట్ల రూపాయలను మద్యంపై దోచుకుంటున్నారని ఈ లెక్కలన్నీ తన వద్ద ఉన్నాయని చెప్పిన అయ్యన్న సమయం వచ్చినప్పుడు బయట పెడతానని చెప్పారు.
``నేనేవరినో రేప్ చేశానని నా మీద పోలీసులు కేసు పెట్టారు. నా వయసు
తనపై లైంగిక దాడి కేసు పెట్టారని, ఈ వయస్సులో తాను లైంగిక దాడి చేయగలనా? అని అన్నారు. ``ఈ వయసులో నేను రేప్ చేసే పరిస్థితిలో ఉన్నానా? కనీసం మనిషిని చూసైనా కేసు పెట్టాలి కదా!. మన మన మంత్రులు ఉన్నారే.. వాళ్లకి కేసులు పెట్టడం ఒక్కటే తెలుసు. పాలన చేయండ్రా బాబూ అని ప్రజలుఅధికారం ఇస్తే.. కేసులు పెడతాం మొర్రో పెట్టించుకోండి అని మంత్రులు అంటున్నారు. ఇదీ.. మన రాష్ట్ర దౌర్భాగ్యం.`` అని అయ్యన్న వ్యాఖ్యానించారు.
``నిన్న జనేసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లాడు. ఆయన లోపల ఏం చేశాడో అందరం చూశాం. ప్రధానిని పలకరించాడు. ఆయనతో సెల్ఫీతీసుకున్నాడు. గౌరవంగా నిలబడ్డాడు. మరి మన సీఎం జగన్ కూడా ఢిల్లీ వెళ్తాడు. మోడీని కలుస్తాడు. కానీ, లోపలకు వెళ్ళిపోగానే తలుపేసుకుంటాడు మరి.. జగన్ లోపలకు వెళ్లి ఏం చేస్తాడో ఏమో.. కాళ్లు నొక్కుతాడా! అనేది నా అనుమానం.`` అని అయ్యన్న తనదైన శైలిలో నిప్పులు చెరిగారు.