Begin typing your search above and press return to search.

టీడీపీ నేత ఆత్మహత్య... హాట్ టాపిక్ గా స్నేహితులు పెట్టిన బ్యానర్!

అవును... విజయవాడకు చెందినవారిగా చెబుతున్న కారంపూడి రవీంద్ర అనే వ్యక్తి.. టీడీపీలో చాలా యాక్టివ్ గా ఉండేవారంట.

By:  Tupaki Desk   |   20 Nov 2024 8:26 AM GMT
టీడీపీ నేత ఆత్మహత్య... హాట్  టాపిక్  గా స్నేహితులు పెట్టిన బ్యానర్!
X

ఈ నెల 17న విజయవాడకు చెందిన ఓ టీడీపీ నేత ఆత్మహత్య చేసుకున్నారు! దీనికి కారణం తనకున్న అప్పు, దీని కోసం వైసీపీ నేతలు తీసుకున్న భూమి, మిగిలిన డబ్బులు తిరిగి ఇవ్వని వైనం కారణం అని అంటున్నారు! మరోపక్క... మరణించిన నేతకు కన్నీటి విడ్కోలు పలుకుతూ స్నేహితులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలోని కంటెంట్ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


అవును... విజయవాడకు చెందినవారిగా చెబుతున్న కారంపూడి రవీంద్ర అనే వ్యక్తి.. టీడీపీలో చాలా యాక్టివ్ గా ఉండేవారంట. అయితే అతనికి చాలా కలంగా రూ.20 లక్షల రుణం ఉన్నట్లు చెబుతున్నారు. దీనికోసం పలువురు వైసీపీ నాయకులు ఈ విషయంలో ఇతనిని ఇబ్బంది పెట్టేవారని అంటున్నారు. ఈ సమయంలో అప్పు కోసం రూ.20 లక్షలు సమకూర్చడానికి ఓ ఆలోచన చేశారని అంటున్నారు.

ఇందులో భాగంగా... రవీంద్రకు రూ.20 లక్షల అప్పును దృష్టిలో పెట్టుకున పలువురు వైసీపీ నేతలు అతనికి చెందిన రూ.2 కోట్ల విలువైనదిగా చెబుతున్న అస్తిని ఆధీనంలోకి తీసుకున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో రూ.20 లక్షల రుణం సర్దుబాటు చేసి.. మిగిలిన డబ్బు తర్వాత ఇస్తామని హామీ ఇచ్చారట.

అయితే... రూ.2 కోట్ల ఆస్తిని స్వాధీనం చేసుకున్నారు కానీ.. టీడీపీ నేత రవీంద్రకు డబ్బులు తిరిగి ఇవ్వలేదంట. దీంతో... ఆస్తిని కోల్పోయిన బాధలో జీవితంపై విరక్తి చెందిన రవీంద్ర ఆత్మహత్య చేసుకున్నాడని అంటున్నారు. దీంతో... కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమకు న్యాయం జరగలేదని ఆరోపిస్తూ రవీంద్ర కుటుంబ సభ్యులు ఫైరవుతున్నారని చెబుతున్నారు.

ఆ సంగతి అలా ఉంటే... కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. అప్పటి వరకూ పార్టీ కోసం ఎంతో కష్టపడిన రవీంద్ర ఇప్పుడు వెనక్కి నెట్టబడ్డాడని.. ఇతర పార్టీల నుంచి టీడీపీలోకి వచ్చిన వారి ప్రాభల్యం పెరిగిందని.. ఇది కూడా ఓ రకంగా రవీంద్ర ఆత్మహత్యకు కారణం అనే అర్ధం వచ్చేలా అతని స్నేహితులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతోంది.

"నాయకులారా... వ్యక్తిగత అవసరాల కోసం పార్టీలు మారే జనాలతో లాలూచీపడి, ఆర్థికంగా చితికిపోతున్నా పార్టీనే నమ్ముకున్నవారిని బలి పశువులను చేయ్యవద్దు. నిన్ను ఎన్ని కష్టాలు పెట్టినా పార్టీ మారకుండా, అధికారం వస్తే మా పార్టీ నాయకులు న్యాయపరంగా న్యాయం చేస్తారని నమ్మి మోసపోయిన మిత్రమా.. నీకు ఇవే మా కన్నీటి నివాళులు" అంటూ రవీంద్ర స్నేహితులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.