టీడీపీకి ఆ అమ్మా..కొడుకు గుడ్ బై...!
అదేంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.. పైగా ఐదు నెలల క్రితమే ఆ పార్టీ అప్రతిహత విజయంతో అధికారంలోకి వచ్చింది.
By: Tupaki Desk | 4 Dec 2024 3:50 AM GMTఅదేంటి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది.. పైగా ఐదు నెలల క్రితమే ఆ పార్టీ అప్రతిహత విజయంతో అధికారంలోకి వచ్చింది. మరో నాలుగున్నర సంవత్సరాల పాటు ఎంచక్కా అధికారాన్ని ఎంజాయ్ చేయవచ్చు.. ఇలాంటి అద్భుతమైన అవకాశం వదులుకొని ఈ టైంలో పార్టీ నుంచి ఎవరు ? బయటకు వెళ్తారు.. అలాంటి దురదృష్టవంతులు ఎవరు అనుకుంటున్నారా ? అయితే ఈ స్టోరీ తెలుసుకోవాల్సిందే. ఆ దురదృష్టవంతులు ఎవరో ? కాదు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపకు చెందినవారు కావటం విచిత్రం. వారే బద్వేలు మాజీ ఎమ్మెల్యే కునిరెడ్డి విజయమ్మ.. ఆయన కుమారుడు రితేష్ రెడ్డి. పార్టీ అధికారంలో ఉన్నా కూడా వీరు ఎందుకు బయటకు రావాలని అనుకుంటున్నారు ? ఆ కథ ఏంటో చూద్దాం.
ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు తెలుగుదేశం పార్టీ రాజకీయాలు అంటేనే దివంగత మాజీ ఎమ్మెల్యే కొనిరెడ్డి వీరారెడ్డి పేరు ముందుగా గుర్తుకువస్తుంది. ఆయన ఎమ్మెల్యేగా ఉండగానే మృతి చెందడంతో ఆయన రాజకీయ వారసురాలిగా ఆయన కుమార్తె విజయమ్మ పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 2004లో ఆమె ఓడిపోయారు. ఆ తర్వాత బద్వేలు ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఎస్సీ వర్గాలకు చెందిన వారు టీడీపీ నుంచి పోటీ చేసినా కూడా పార్టీ ఇన్‌చార్జ్‌గాను... పెత్తనం అంతా విజయమ్మే చేసుకుంటూ వస్తున్నారు.
2004 - 2009 - 2014, 2019తో పాటు 2024 ఎన్నికల్లోనూ వరుసగా ఐదుసార్లు ఇక్కడ టీడీపీ ఓడిపోతూ వస్తోంది. ఈ ఐదుసార్లు కూడా విజయమ్మ కంట్రల్లోనే టీడీపీ ఉంటోంది.. వారు చెప్పిన వాళ్లకే చంద్రబాబు సీట్లు ఇస్తూ వస్తున్నారు. ఇక ఈ యేడాది ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసిన బొజ్జా రోశన్న ఓడిపోయారు. కడప జిల్లాలో పులివెందులతో పాటు బద్వేలులో మాత్రమే టీడీపీ ఓడిపోయింది.. ఖచ్చితంగా గెలవాల్సిన చోట.. పార్టీ ఓడిపోవడంతో చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
బద్వేలులో పార్టీ కాస్త బలంగా ఉంది. పార్టీ చాలా వీక్‌గా ఉన్న రాయచోటి, జమ్మలమడుగు, కమలాపురం లాంటి చోట్లే కూటమి గెలిచి.. బలంగా ఉన్న బద్వేలులో ఓడిపోవడం చంద్రబాబుకు అస్సలు నచ్చడం లేదు. అందుకే ప్రభుత్వ పెద్దల నుంచి బద్వేలులో పార్టీ ఇన్‌చార్జ్‌గా ఉన్న రితేష్‌రెడ్డితో పాటు విజయమ్మ చెప్పిన పనులు అధికారులు చేయవద్దని ఆదేశాలు అందాయట. దీంతో వాళ్లు ఇదేం కర్మరా బాబు అని తలలు పట్టుకుంటున్నారట.
చంద్రబాబు మాత్రం రితేష్‌రెడ్డిని త్వరలో ఇన్‌చార్జ్ పగ్గాల నుంచి కూడా తప్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఇవన్నీ తెలియడంతో పాటు పార్టీ అధికారంలో ఉండి కూడా పనులు కాకపోవడంతో రితేష్ రెడ్డి టీడీపీ నుంచి బయటకు వస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో ఉన్నట్టు టాక్ ? టీడీపీ నుంచి బయటకు వచ్చి వైసీపీలోకి వెళదామా ? అన్న ఆలోచనలు కూడా చేస్తున్నారట. ఏదేమైనా రితేష్‌రెడ్డి చంద్రబాబును పట్టించుకోకపోతో పార్టీ మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.