ఆ మంత్రికి అన్యాయం జరిగిందా.. పర్సనల్ టాక్..!
ఏపీ సీఎం చంద్రబాబు.. తన మంత్రి వర్గ బృందానికి ఇచ్చిన ర్యాంకులు రాష్ట్రంలో చర్చనీయాంశం అ య్యాయి.
By: Tupaki Desk | 7 Feb 2025 1:30 PM GMTఏపీ సీఎం చంద్రబాబు.. తన మంత్రి వర్గ బృందానికి ఇచ్చిన ర్యాంకులు రాష్ట్రంలో చర్చనీయాంశం అ య్యాయి. ఒకరిద్దరి విషయంలో వచ్చి న ర్యాంకులు చూసి టీడీపీ నేతలు, వ్యక్తిగతంగా ఆయా మంత్రుల అనుచరులు కూడా ఆశ్చర్యపోయారు. మరీ ముఖ్యంగా సీనియర్ నాయకుడు.. ఇప్పటి వరకు పరాజయం అంటే ఎలా ఉంటుందో కూడా తెలియన నేత.. నిమ్మల రామానాయుడు. ఈయనకు వచ్చిన ర్యాంకు ఆయన వర్గంలో అసంతృప్తిని కనిపించేలా చేసింది.
మా నాయకుడికి అన్యాయం జరిగిందంటూ.. ఆయన అనుచరులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం గమనార్హం. అటు రాజకీయంగా చూసుకున్నా.. ఇటు పాలన పరంగా చూసుకున్నా .. నిమ్మల శక్తి వంచన లేకుండా చేస్తున్నారు. జలవనరుల శాఖ మంత్రి గా ఉన్న ఆయన.. విజయవాడకు గత ఏడాది సెప్టెంబ రులో వరద వచ్చినప్పుడు.. అహోరాత్రులు శ్రమించారు. వరద బాధితులను ఆదుకునేందుకు ఆయన చేసిన కృషిని అప్పట్లో చంద్రబాబు కూడా మెచ్చుకున్నారు.
అంతేకాదు.. బుడమేరు గండిని పూడ్చే ప్రయత్నంలో మూడు రోజుల పాటు.. స్పాట్‌లోనే ఉండి.. కనీసం తిన్నామా.. తాగామా.. అన్న విషయాన్ని కూడా మరిచిపోయి.. ఆయన బుడమేరు గండిని పూడ్చేందుకు నిరంతరం శ్రమించారు. ఈ విషయంలోనూ .. చంద్రబాబు వద్ద ఆయనకు మంచి మార్కులు పడ్డాయి. ఇక, పోలవరం ప్రాజెక్టు విషయంలో పనుల పరిశీలన.. స్థానికంగా విజిట్‌లు వంటివాటికి లెక్కలేదు. ఇలా.. తన శాఖకు సంబంధించిన వ్యవహారాల్లో దూకుడుగా ఉన్న నిమ్మలకు.. తాజాగా ర్యాంకుల్లో చివరి నుంచి 4వ ర్యాంకు వచ్చింది.
అంటే.. నిమ్మల 22వ ర్యాంకులో ఉన్నారు. దీనిని ఆయన అనుచరులు జీర్ణించుకోలేక పోతున్నారు. వాస్తవానికి సర్కారు చెప్పేది ఏంటంటే.. పనితీరు ఎలా ఉన్నా.. ఆఫీసులో కూర్చుని ఫైళ్లను పరిష్కరించే వారిలో ఎవరు ముందున్నారన్న విషయాన్ని మాత్రమే ప్రస్తుత ర్యాంకులకు కొలమానంగా తీసుకున్నట్టు చెబుతోంది. వాస్తవానికి జలవనరుల శాఖ విషయానికి వస్తే.. ఫైళ్ల గురించి పెద్దగా చింతించాల్సిన వ్యవహారం కాదు. పనంతా ఫీల్డ్‌లోనే ఉంటుంది. కాబట్టి.. ఈ రకంగా చూసుకుంటే.. నిమ్మల కృషి అద్భుత మని ఆయన అనుచరులు వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. పార్టీకి, ప్రభుత్వానికి, అధినేతకు అత్యంత విధేయుడు కావడంతో నిమ్మల ఈ ర్యాంకు విషయంలో సంతృప్తిగానే ఉండడం గమనార్హం.