చంద్రబాబుకు 'సొంత' కుంపటి... !
కట్ చేస్తే.. ఆయా నేతల అసంతృప్తికి అనేక కారణాలు ఉన్నాయని తేల్చారు.
By: Tupaki Desk | 12 Oct 2024 12:30 PM GMTప్రతిపక్షం విమర్శలు చేస్తే.. సమాధానం చెప్పుకోవచ్చు. ప్రత్యర్థి దూకుడు వ్యాఖ్యలు చేస్తే.. అడ్డుకట్ట కూడా వేసుకోవచ్చు. కానీ, సొంత పార్టీలోనే ఉంటూ.. విమర్శలు చేస్తే.. ? సొంత పార్టీ కండువాకప్పుకొనే విపక్షం కంటే ఎక్కువగా రెచ్చిపోతే..? ఇలాంటి పరిస్థితి.. గత ఐదేళ్లలో వైసీపీ అధినేత జగన్ ఎదుర్కొన్నారు. అప్పటి ఎంపీ రఘురామకృష్ణ రాజు సహా.. ప్రస్తుత మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వంటివారి నుంచి ఆయనకు తీవ్ర సెగ తగిలింది. దీనికి జగన్‌సమాధానం కూడా చెప్పుకోలేక పోయారు.
కట్ చేస్తే.. ఆయా నేతల అసంతృప్తికి అనేక కారణాలు ఉన్నాయని తేల్చారు. కానీ, వాటిని పరిష్కరించే అవకాశం లేక. జగన్ భరించారు. ఇక, ఇప్పుడు కూడా టీడీపీలో ఉన్న వారి నుంచే చంద్రబాబు సెగలు పొగలు పుడుతున్నాయి. కొందరు మేధావులైన టీడీపీ నాయకులు.. పార్టీ, ప్రభుత్వ అంతర్గత వ్యవహారా లను రచ్చ చేస్తున్నారన్నది చంద్రబాబుకు ఇబ్బంది గా మారింది. ఇటీవల వరదలకు సంబంధించి.. చేసిన ఖర్చుపై రచ్చ జరిగింది.
అగ్గిపెట్టెలు, కొవ్వొత్తులకు 23 కోట్లు ఖర్చు చేశారని.. అంటే.. ప్రజలకు సాయం చేయాల్సిన సొమ్మును కొట్టేశారని వైసీపీ యాగీ చేసింది. ఇది ఎంత రచ్చ అయిందంటే.. ఆ 23 కోట్ల సంగతి ఎలా ఉన్నా.. ప్రభు త్వం మాత్రం 23 సార్లు దానిపై వివరణ ఇచ్చే పరిస్థితి వచ్చింది. చివరకు ఆ 23 కోట్లను వివిధ పద్దుల్లో చూపించి చేతులు దులుపుకొంది. కానీ, అసలు ఈ విషయం ఎలా వెలుగు చూసిందనే దానిపై నాయకు లు ఆరా తీశారు. ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన ఒక కీలక నాయకుడే ఉప్పందించారన్నది తాజా సారాంశం.
ఈయనొక్కడే కాదు.. అనంతపురం, కర్నూలులోనూ మేధావి వర్గంగా పేర్కొనే కొందరు టీడీపీ నేతలు.. తమతమ సోషల్ మీడియా హ్యాండిళ్లలో సర్కారుపై అంటీముట్టనట్టుగా కొరడా ఝళిపిస్తున్నారు. పైకి అంతా బాగానే ఉంటుంది. కానీ, ఆ వ్యాఖ్యల అంతరార్థం గమనిస్తే మాత్రం.. ఎంత వివాదమో తెలుస్తుం ది.
``మా ప్రభుత్వం వరదల సమయంలో ఎంతో బాగా పనిచేసింది. అనేక కోట్ల రూపాయలను విరాళాలుగా సేకరించి బాధితులకు కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు సైతం పంచిపెట్టాం. దీనికిగాను 23 కోట్ల రూపాయలు ఖర్చయినా వెనక్కి తగ్గలేదు`` ఇదీ.. సదరు నేత చేసిన పోస్టు.
దీనిలో తప్పుపట్టడానికి ఏమీ కనిపించదు. కానీ, అంతర్లీనంగా ఎలా ఇరికించేశారో తర్వాత జరిగిన యాగీని బట్టి అర్థమవుతుంది. మరిఇలా సొంతింటి వారే సెగ పెడుతుండడానికి కారణం.. ఏంటి అంటే.. వారంతా అసంతృప్తితో ఉండబట్టేనని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు పదవులు ఇచ్చేస్తే.. గోల తగ్గుతుందని చెబుతున్నారు.