Begin typing your search above and press return to search.

క‌డ‌ప రెడ్డెమ్మ‌ మ‌రో ర‌చ్చ‌.. ఇలా అయితే క‌ష్ట‌మే..!

రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వీ రెడ్డి. అత్యంత కీల‌క‌మైన క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకున్నారు.

By:  Tupaki Desk   |   24 Dec 2024 4:39 AM GMT
క‌డ‌ప రెడ్డెమ్మ‌ మ‌రో ర‌చ్చ‌.. ఇలా అయితే క‌ష్ట‌మే..!
X


రెడ్డ‌ప్ప‌గారి మాధ‌వీ రెడ్డి. అత్యంత కీల‌క‌మైన క‌డ‌ప నియోజ‌క‌వ‌ర్గంలో విజ‌యం ద‌క్కించుకున్నారు. వైసీపీ కి కంచుకోట‌... ముఖ్యంగా ఆ పార్టీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌కు కంచుకోట వంటి జిల్లాలో మాధ‌వీ రెడ్డి గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. ఈ నియోజ‌క‌వ‌ర్గం ఆమెకు శాశ్వ‌తంగా నిలుస్తుందా? అనేది పెద్ద సందేహం. ఎందుకంటే.. ఎవ‌రైనా ఒక నియోజ‌క‌వ‌ర్గంలో గెలిస్తే.. శాశ్వ‌తంగా ఆ నియోజ‌క‌వ‌ర్గానికి ప‌రిమితం కావాల‌ని భావిస్తారు.

ఇది త‌ప్పు కూడా కాదు. ఎక్క‌డో చంద్ర‌గిరి నుంచి వ‌చ్చి కుప్పంలో చంద్ర‌బాబు పాగా వేయ‌లేదా? 40 ఏళ్లు గా ఆయ‌న గెలుపు గుర్రం ఎక్క‌ట్లేదా? అలానే.. నాయ‌కులు కూడా.. త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల‌ను శాశ్వ‌త చిరునామాలుగా మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. దీనికి కావాల్సింది.. కొంత దూర‌దృష్టి.. ప్ర‌జ‌ల మ‌న‌సు లు గెలుచుకునే మంత్రంగా.. రాజ‌కీయ వ్యూహం. ఈ విష‌యంలో ఏ చిన్న తేడా వ‌చ్చినా.. నాయ‌కులు డ‌మ్మీల‌వుతారు. ఏమాత్రం కొర‌గాకుండా పోతారు.

ఇలాంటి ప‌రిస్థితే మాధ‌వీ రెడ్డివిష‌యంలో పెద్ద ఎత్తున చ‌ర్చగా మారింది. ఆమె దూకుడు పార్టీకి.. వ్య‌క్తిగ తంగా ఆమెకు కూడా మైనస్ అవుతోంద‌ని సొంత పార్టీ సీనియ‌ర్‌లు చెబుతున్నారు. ``దూకుడు మంచిదే. కానీ, అది ప్ర‌జ‌ల‌కు మేలు చేసేలా ఉండాలి. ఇలా యాగీ చేసేలా కాదు`` అని ఓ సీనియ‌ర్ నాయ‌కుడు వ్యాఖ్యానించారు. అంటే.. మాధ‌వీ రెడ్డి దూకుడు ఎలా ఉందో తెలుసుకోవ‌చ్చు. ఆరు మాసాల కింద‌ట ఎన్నికైన తొలి రోజుల్లో ప్ర‌త్య‌ర్థుల ఇళ్ల ముందు కూర్చుని.. వాటిని అనుమ‌తులు లేకుండా నిర్మించార‌ని.. కూల్చేయాల‌ని పెద్ద యాగీ చేశారు.

ఇక‌, ఆధిప‌త్య రాజ‌కీయ జోరులో సొంత పార్టీ నేత‌లపైనే కేసులు పెట్టించార‌న్న వాదన కూడా మాద‌వి పై ఉంది. ఇక‌, ఇప్పుడు కార్పొరేష‌న్‌లో జ‌రిగిన ర‌చ్చ మామూలుగా లేదు. మేయ‌ర్ ప‌క్క‌న త‌న‌కు కూడాసీటు వేయాల‌ని డిమాండ్ చేస్తూ.. రోజు రోజంతా మాధ‌వి కౌన్సిల్‌లో ర‌చ్చ చేశారు. ఇది సీఎం చంద్ర‌బాబు వ‌ర‌కు వ‌చ్చింది. దీంతో త‌న‌ను క‌ల‌వాలంటూ.. ఆయ‌న క‌బురు పెట్టిన‌ట్టు క‌డ‌ప వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక్క‌డ కావాల్సింది.. సీటు కోసం పంతం కాదు. కార్పొరేష‌న్ ద్వారా.. అధికార పార్టీగా ప్ర‌జ‌లకు మేలు జ‌రిగేలా నిర్ణ‌యాలు తీసుకుంటే.. ఆటోమేటిక్‌గా ప్ర‌జ‌లే సీట్లు వేస్తార‌న్న ఆలోచ‌న మాధ‌వి లేక‌పోవ‌డంపైనా విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. మ‌రి ఆమె ఇలానే ఉంటే.. క‌డ‌ప శాశ్వ‌తం కాక‌పోవ‌చ్చు..!