పులివెందుల టీడీపీలో డిష్యూం.. డిష్యూం.. నడిరోడ్డుపై కొట్టుకున్న కార్యకర్తలు
పులివెందుల తెలుగుదేశంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
By: Tupaki Desk | 17 Jan 2025 11:30 AM GMTపులివిందుల తెలుగుదేశంలో వర్గవిభేదాలు బహిర్గతమయ్యాయి. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ప్రస్తుత ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి వర్గీయులు నడి రోడ్డుపై కొట్లాటకు దిగారు. బీటెక్ రవి అనుచరుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి సతీమణి ఉమాదేవి ధర్నా చేయడం హాట్ టాపిక్ గా మారింది.
పులివెందుల తెలుగుదేశంలో టీడీపీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. గురువారం కడప కలెక్టరేటులో ఇసుక టెండర్ల వ్యవహారంలో బీటెక్ రవి అనుచరులు హంగామా చేశారు. దీనిపై పార్టీలో తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. ఈ ఎపిసోడుపై పార్టీలో వాడివేడి చర్చ జరుగుతుండగా, శుక్రవారం ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి అనుచరులపై బీటెక్ రవి వర్గీయుుల దాడి చేశారు. దీనిపై ఎమ్మెల్సీ అనుచరులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
వేంపల్లెకు చెందిన ప్రకాశ్ ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి అనుచరుడు. రేషన్ డిపో డీలర్ షిప్ ఆశిస్తున్న ప్రకాశ్ శుక్రవారం పులివెందులలో పరీక్ష రాసేందుకు వచ్చాడు. పరీక్ష కేంద్రంలోనికి వెళుతుండగా, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి అనుచరులు ప్రకాశ్ ను అడ్డుకుని చితకబాదారు. పరీక్ష రాయకుండా ప్రకాశును నిలవరించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి భార్య ఉమాదేవి ధర్నాకు దిగారు. ప్రకాశ్ ను విడిచిపెట్టాలని బీటెక్ రవి అనుచరులను హెచ్చరించారు.
పులివెందులలో ఇరువర్గాల ఘర్షణ పార్టీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. అసలేం జరిగిందో తెలుసుకోవాలంటూ కడపలోని పార్టీ నాయకులకు ఆదేశించినట్లు సమాచారం.