Begin typing your search above and press return to search.

రేప‌టి నుంచే బ‌డ్జెట్ భేటీ.. బాబు 'విజ‌న్' క‌నిపిస్తుందా?

ఈ నేప‌థ్యంలో 2025-26 వార్షిక బ‌డ్జెట్‌లో చంద్ర‌బాబు విజ‌న్ క‌నిపిస్తుంద‌ని టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. తాజాగా ఒక‌రిద్ద‌రు ఎంపీలు ఆఫ్ దిరికార్డుగా మాట్లాడుతూ..

By:  Tupaki Desk   |   30 Jan 2025 4:47 AM GMT
రేప‌టి నుంచే బ‌డ్జెట్ భేటీ.. బాబు విజ‌న్ క‌నిపిస్తుందా?
X

పార్ల‌మెంటు బ‌డ్జెట్ స‌మావేశాలు.. శుక్ర‌వారం(జ‌న‌వ‌రి 31) నుంచి ప్రారంభం అవుతున్నాయి. తొలిరోజు ఉభ‌య స‌భ‌ల‌ను ఉద్దేశించి రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము ప్ర‌సంగించ‌నున్నారు. అనంత‌రం ఫిబ్ర‌వ‌రి 1న కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ 2025-26 వార్షిక బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ రోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. రక్షణ శాఖ‌ మంత్రి రాజనాథ్ సింగ్ నేతృత్వంలో ఈ స‌మావేశం జరగనుంది.

పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టే పలు బిల్లులు, ప్రభుత్వ కార్యక‌లాపాల‌ను అఖిలపక్షానికి కేంద్ర ప్ర‌భుత్వం తరఫున రాజనాథ్ సింగ్ వివరించనున్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని కొరనున్నారు. అఖిల ప‌క్ష స‌మావేశానికి పార్ల‌మెంటులో ప్రాతినిధ్యం ఉన్న అన్ని పార్టీల పార్ల‌మెంట‌రీ ప‌క్ష నాయ‌కుల‌ను ఆహ్వానించారు. దీనిలో టీడీపీ కీల‌క‌మైంది. పైగా ఎన్డీయే కూట‌మి స‌ర్కారులో బ‌ల‌మైన మిత్ర‌ప‌క్షంగా కూడా ఉంది.

ఈ నేప‌థ్యంలో 2025-26 వార్షిక బ‌డ్జెట్‌లో చంద్ర‌బాబు విజ‌న్ క‌నిపిస్తుంద‌ని టీడీపీ ఎంపీలు భావిస్తున్నారు. తాజాగా ఒక‌రిద్ద‌రు ఎంపీలు ఆఫ్ దిరికార్డుగా మాట్లాడుతూ.. కూట‌మి స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత పూర్తిస్థా యి బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడుతున్నార‌ని.. దీనిలో ఏపీకి సంబంధించి చంద్ర‌బాబు విజ‌న్‌కు అనుగుణంగా కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. దీనిలో పాత ప్రాజెక్టుల‌తో పాటు.. న‌దుల అను సంధానానికి సంబంధించిన ప్రాజెక్టుల‌కు కూడా నిధులు కేటాయించే అవ‌కాశం ఉంద‌న్నారు.

రాష్ట్ర ప్ర‌భుత్వం గోదావ‌రి, కృష్ణ‌, పెన్నా న‌దుల‌ను క‌లుపుతూ.. క‌ర్నూలు జిల్లా బ‌న‌కచ‌ర్ల వ‌ద్ద ప్రాజెక్టును క‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. దీనికి కేంద్రం నుంచి సాయం అవ‌స‌రం. 6500 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఈ ప్రాజెక్టుకు ఖ‌ర్చు చేయాల్సి ఉంది. దీంతో సీఎం చంద్ర‌బాబు నేరుగా కేంద్రానికి లేఖ రాయ‌డంతోపాటు.. ఇటీవ‌ల దావోస్ నుంచి నేరుగా ఢిల్లీ వెళ్లి.. ఈ ప్రాజెక్టుకు నిధులు కేటాయించాల‌ని కోరారు.

ఇక‌, రాష్ట్రంలో చేప‌ట్ట‌బోయే.. బుడ‌మేరు శాస్వ‌త ప‌రిష్కారం, అమ‌రావ‌తి రింగు రోడ్డు ప‌రిధిలో కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిశ్ర‌మ‌లు.. వంటివాటిని కూడా చంద్ర‌బాబు ప్ర‌స్తావించారు. అంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న పోల‌వరం, అమ‌రావ‌తి నిధులు మాత్ర‌మే కాకుండా.. ఇవ‌న్నీ ప్ర‌త్యేక ప్రాజెక్టులు. దీంతో చంద్ర‌బాబు విజ‌న్ కేంద్ర బ‌డ్జెట్‌లో క‌నిపిస్తుంద‌న్న కూట‌మి ఎంపీలు చెబుతున్న మాట‌. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.