టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వంశీ ప్రధాన అనుచరుడు ఏం చెప్పాడంటే?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసు విచారణ వడివడిగా సాగుతోంది.
By: Tupaki Desk | 4 April 2025 4:18 AMఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడికి సంబంధించిన కేసు విచారణ వడివడిగా సాగుతోంది. తాజాగా ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే వంశీ ప్రధాన అనురుడు ఓలుపల్లి రంగాను సీఐడీ అధికారులు రెండో రోజూ విచారించారు. ఈ సందర్భంగా అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేవారు. విజయవాడ సీఐడీ రీజనల్ ఆఫీసులు సుదీర్ఘ విచారణ సాగింది.
టీడీపీ ఆఫీసుపై జరిగిన దాడి ఘటన గురించి పలు ప్రశ్నలు సంధించగా.. తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. విచారణ వేళలో.. అతడి తరఫు న్యాయవాదిని విచారణకు అనుమతించారు. దాడి ఉదంతంలో వైసీపీ నేత వంశీ పాత్ర గురించి ప్రశ్నలు వేయటంతోపాటు.. టీడీపీ ఆఫీసుపై దాడి చేయాలని వంశీ ఆదేశించారా? అని ప్రశ్నించగా.. సంబంధం లేదని సమాధానం ఇచ్చారు.
అంతేకాదు.. టీడీపీ ప్రధాన కార్యాలయం మీద దాడి జరిగిన సమయంలో తాను ఘటనా స్థలంలో లేనని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో తాను బాపులపాడు మండలంలో ప్రభుత్వ కార్యక్రమంలో ఉన్నానని రంగాచెప్పినట్లుగా తెలుస్తోంది. పార్టీ పరంగా మీకు ఏమైనా ఆదేశాలు వచ్చాయా? అని ప్రశ్నించగా.. తనకు అలాంటివేమీ రాలేదని బదులిచ్చాడు. దాడి గురించి తనకు తెలీదని.. ఘటన జరిగిన తర్వాత సమాచారం అందితే.. తాను అక్కడికి వెళ్లినట్లుగా చెప్పారు. రెండు రోజుల పాటు సాగిన విచారణలో పలు అంశాల్ని అధికారులు రికార్డు చేశారు.