Begin typing your search above and press return to search.

వైసీపీ నంబర్ 9 అవుతుందా...టీడీపీ స్ట్రాంగ్ డోస్ ?

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దాంతో ఎలెవెన్ పార్టీ అని సోషల్ మీడియా తెగ ర్యాంగింగ్ చేసి పారేస్తోంది.

By:  Tupaki Desk   |   6 Nov 2024 3:38 AM GMT
వైసీపీ నంబర్ 9 అవుతుందా...టీడీపీ స్ట్రాంగ్ డోస్ ?
X

ఏపీ అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. దాంతో ఎలెవెన్ పార్టీ అని సోషల్ మీడియా తెగ ర్యాంగింగ్ చేసి పారేస్తోంది. అంతే కాదు ఈ నెల 11న ఉదయం 11 గంటలకు ఏపీ అసెంబ్లీ సమావేశం జరగనుంది. దాంతో 11 మంది ఎమ్మెల్యేలతో ఉన్న వైసీపీ హాజరవుతున్నా అని 11 నంబర్ ని గట్టిగా చెబుతూ టీడీపీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్ చేస్తున్నారు.

వీటి సంగతి పక్కన పెడితే ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి అయిదు నెలలు అయింది. ఇది పూర్తి స్థాయి అసెంబ్లీ సమవేశం. మరి గత రెండు సార్లూ 11 మంది ఎమ్మెల్యేలతో హాజరై కొద్ది సేపు మాత్రమే సభలో కూర్చుని వెళ్ళిపోయిన జగన్ ఈసారి తన వెంట పది మంది ఎమ్మెల్యేలను తెచ్చుకుని వస్తారా అన్నది కూడా రాజకీయంగా చర్చగా ఉంది.

ఎందుకంటే వైసీపీ ఎమ్మెల్యేలను తగ్గించడం ద్వారా వైసీపీకి గట్టి ఝలక్ ఇవ్వాలని టీడీపీ భారీ స్కెచ్ వేసిందని అంటున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఇద్దరు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుని జగన్ కి షాక్ ఇస్తే ఇక అసెంబ్లీలో వైసీపీ హాజరైనా కూడా ఆ వేడీ వాడి ఉండదని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.

నిజానికి బడ్జెట్ మీట్ కి వైసీపీ హాజరు అవుతుందా లేదా అన్నది ఒక ఎత్తు అయితే హాజరైతే కొన్ని ఇష్యూస్ కూడా రైజ్ చేసే చాన్స్ ఉంది. పవన్ ఇటీవలే చేసిన లా అండ్ ఆర్డర్ ఏపీలో సరిగ్గా లేదన్న దాని మీద కూడా వైసీపీ ఆయుధంగా మార్చుకుని కూటమి ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేసే అవకాశం ఉంది అని అంటున్నారు.

ఈ నేపథ్యంలో వైసీపీ ఉత్సాహాన్ని ఆవేశాన్న్ పాలపొంగుని చల్లార్చినట్లుగా చేసేందుకు టీడీపీ భారీ ప్లాన్ వేసిందని అంటున్నారు. అందులో భాగమే ఇద్దరు ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకోవడం అని అంటున్నారు. ఉత్తరాంధ్రాలో వైసీపీకి కేవలం విశాఖ ఏజెన్సీలోనే ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు.

వారిలో ఒకరు పాడేరు, మరొకరు అరకు ఎమ్మెల్యేలు. ఈ ఇద్దరిలో ఒకరు టీడీపీలో కచ్చితంగా చేరుతారు అని ప్రచారం సాగుతోంది. అలాగే రాయలసీమలో వైసీపీకి ఉన్న ఎమ్మెల్యేలలో ఒకరు టీడీపీ తీర్ధం పుచ్చుకుంటారు అని అంటున్నారు. అలా ఇద్దరు ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా గట్టి ఝలక్ ఇవ్వాలని టీడీపీ భావిస్తోందిట. మరి ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో కొద్ది రోజులలోనే తెలుస్తుంది అని అంటున్నారు.