Begin typing your search above and press return to search.

బాబు స్టీరింగ్ మిత్రుల చేతిలోనా ?

దీని వల్ల తెలుగుదేశంలోని ఆశావహులకు అన్యాయం జరుగుతోంది.

By:  Tupaki Desk   |   10 March 2025 6:00 PM IST
బాబు స్టీరింగ్ మిత్రుల చేతిలోనా ?
X

తెలుగుదేశం పార్టీకి ఎదురులేని నాయకత్వం వహించిన చంద్రబాబు ఈ రోజు పొత్తు ధర్మం పేతుతో మిత్రుల కోసం త్యాగాలు చేయాల్సి వస్తోంది అని అంటున్నారు. దీని వల్ల తెలుగుదేశంలోని ఆశావహులకు అన్యాయం జరుగుతోంది. కానీ ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి ఉందని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీల పదవీ విరమణ సందర్భంగా ఎమ్మెల్సీ పోస్టులకు ఖాళీ ఏర్పడింది. న్యాయంగా ఈ అయిదు సీట్లూ తిరిగి టీడీపీకే వెళ్ళాలి. కానీ తెలుగుదేశం పార్టీ తీసుకున్నది కేవలం మూడు సీట్లు మాత్రమే. అంటే టీడీపీ తన వాటా నుంచి రెండు సీట్లు ఇచ్చేయాల్సి వచ్చింది. గత ఏడాది రెండు ఖాళీలు ఏర్పడినపుడు కూడా జనసేనకు ఒకటి ఇవ్వాల్సి వచ్చింది.

ఇక రాజ్యసభ సీట్లు ఇప్పటికి మూడు ఖాళీ అయితే అందులో రెండు టీడీపీ ఉంచుకుని ఒకటి బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది. విజయసాయిరెడ్డి రాజీనామా వల్ల మరో సీటు ఖాళీ ఏర్పడింది. ఆ సీటుని కూడా బీజేపీ కోరుతోంది అని అంటున్నారు. నిజానికి బీజేపీ ఒత్తిళ్ళ మీదనే ఎమ్మెల్సీ సీటు ఒకటి చివరి నిముషంలో ఇవ్వాల్సి వచ్చిందని అంటున్నారు.

దీంతో పదుల సంఖ్యలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆశావహులు అంతా షాక్ తినాల్సి వచ్చింది. మరా వైపు చూస్తే వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు చైర్మన్ ఆమోదించకపోవడంతో అవి అలాగే ఉన్నాయి. ఇప్పట్లో ఆ రాజీనామాలు ఆమోదించక పోవచ్చు అని అంటున్నారు.

2027లో మరో ఏడు ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అవుతాయి. అపుడు కూడా పోటీ చాలా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. తెలుగుదేశం పార్టీ మళ్లీ మిత్రులకు సీట్లు ఇవ్వాల్సి రావచ్చు అని అంటున్నారు. కూటమి బలంగా ఉండాలని కలసికట్టుగా ముందుకు సాగాలని భావించి పెద్దన్నగా టీడీపీ చేస్తున్న ఈ రకమైన త్యాగాల వల్ల తమ్ముళ్ళకే ఇబ్బందులు ఎదురవుతున్నాయని అంటున్నారు.

అదే సమయంలో మిత్రులుగా ఉన్న జనసేన బీజేపీ బలపడుతున్నాయి. ఇక తాజాగా బీజేపీకి ఒక సీటు రావడంతో 2022 తరువాత బీజేపీ మరోసారి మండలిలో ప్రవేశించినట్లు అయింది. జనసేనకు ఈ దఫాతో కలిపి రెండు ఎమ్మెల్సీలుగా నంబర్ పెరిగింది. తెలుగుదేశం పార్టీకి అయితే 10 దాకానే తన నంబర్ ఉంది. పెరగలేదు అని అంటున్నారు.

ఇక టీడీపీ కూటమి ప్రభుత్వంలో ఎన్నో అవకాశాలు అనుకుంటే నామినేటెడ్ పోస్టుల దగ్గర నుంచి అన్నీ మిత్రులతో షేర్ చేసుకోవాల్సి రావడం తమ్ముళ్ళకు కొత్త అనుభవంగా మారుతోంది. 2026లో స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. అక్కడ కూడా ఇదే విధమైన పొత్తుల ఎత్తులు సాగితే తమ్ముళ్ల ఆశలే చాలా చోట్ల గల్లంతు అవుతాయని అంటున్నారు. ఈ పొత్త్ల వల్ల కూటముల వల్ల అధికారం చేతిలో ఉండొచ్చు కానీ తమ్ముళ్ల అవకాశాలు మాత్రం బాగా తగ్గిపోతున్నాయని వారు డీమోరలైజ్ అవుతున్నారని అంటున్నారు. దీనిని గ్రహించి సరైన తీరులో చక్కదిద్దకపోతే మాత్రం అసలుకే ఎసరు వస్తుందని అంటున్నారు.