మంగళగిరిలో టీడీపీ మెరుపులు.. లోకేష్‌కే క్రెడిట్
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కంటే కూడా.. మంగళగిరిలోనే ఎక్కువగా సభ్యత్వ నమోదు జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
By: Tupaki Desk | 30 Dec 2024 9:30 AM GMTటీడీపీ యువ నాయకుడు, మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ మెరుపులు మెరిపించింది. పార్టీ సభ్యత్వ నమోదులో దూసుకుపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కంటే కూడా.. మంగళగిరిలోనే ఎక్కువగా సభ్యత్వ నమోదు జరిగినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ క్రెడిట్ అంతా మంత్రి నారా లోకేష్‌కే దక్కుతుందని వెల్లడించాయి. నిన్న మొన్నటి వరకు ఈ నియోజకవర్గంలో 30-40 వేల మధ్య ఉన్న సభ్యత్వం ఇప్పుడు ఏకంగా లక్షమార్కు దాటిందన్నా రు.
దీంతో ఏపీలోని టీడీపీ సభ్యత్వ నమోదు వ్యవహారంలో మంగళగిరి టాప్ పొజిషన్‌లో చేరినట్టు టీడీపీ నాయకులు చెప్పారు. నారా లోకేష్‌కు ఇక్కడి యువత జై కొడుతున్నారని, వీధి వ్యాపారులు చేతివృత్తుల వారికి మంత్రిగా నారా లోకేష్ చేస్తున్న సాయం మేలు చేస్తోందని.. అందుకే వారంతా టీడీపీలోకి చేరుతు న్నారని వెల్లడించారు. నారా లోకేష్ పిలుపునకు కూడా భారీ స్పందన లభిస్తోందని సీనియర్ నాయకులు వెల్లడించారు. వ్యాపారుల నుంచి విద్యార్థుల వరకు.. చేతి వృత్తుల వారి నుంచి కార్మికుల వరకు కూడా.. పార్టీ సభ్యత్వం తీసుకుంటున్నట్టు తెలిపారు.
కాగా.. మంగళగిరిలో పార్టీ సభ్యత్వం పుంజుకోవడం పట్ల టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు పార్టీ నాయకు లను అభినందించారు. అదేసమయంలో నారా లోకేష్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇటీవల ఒక్క మంగళగిరిలోనే పార్టీ సభ్యత్వం 75 వేలకు చేరుకున్న సమయంలో కేక్ కట్ చేసి స్థానిక నాయకులు సంబ రాలు చేసుకున్నారు. ఈ విషయంపైనే వారు సీఎంతోనూ భేటీ అయ్యారు. పార్టీ పరంగా చేస్తున్న సేవలు, ప్రజలకు అందుబాటులో ఉంటున్న తీరును కూడా వివరించారు. ఈ సందర్భంగా మంగళగిరిలో టీడీపీ సభ్యత్వాలు లక్ష వరకు చేరడంపై బాబు సంతోషం వ్యక్తం చేశారు.