Begin typing your search above and press return to search.

వైఎస్ భారతిపై అసభ్య వ్యాఖ్యలు.. ఐటీడీపీ సీరియస్.. కార్యకర్తపై వేటు!

సోషల్ మీడియా కాలంలో రాజకీయ పార్టీలు తమ సొంత టీమ్ లను రంగంలోకి దింపి ప్రత్యర్థులను దూషించండం పరిపాటిగా మారింది.

By:  Tupaki Desk   |   10 April 2025 9:39 AM
వైఎస్ భారతిపై అసభ్య వ్యాఖ్యలు.. ఐటీడీపీ సీరియస్.. కార్యకర్తపై వేటు!
X

సోషల్ మీడియా కాలంలో రాజకీయ పార్టీలు తమ సొంత టీమ్ లను రంగంలోకి దింపి ప్రత్యర్థులను దూషించండం పరిపాటిగా మారింది.

ప్రత్యర్థి పార్టీల విధానాలను, ఆ పార్టీల ప్రభుత్వాల పాలనను తప్పుబట్టడంలో తప్పు లేదు కానీ.. నేరుగా దూషించడమే పరిస్థితులను ఉద్రిక్తం చేస్తుంటుంది.

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల సోషల్ మీడియా సైన్యం మరింత దూకుడుగా వ్యవహరిస్తుంటుంది. అధికార టీడీపీ ఐ-టీడీపీ పేరిట అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఉంది. జనసేన, వైసీపీలకూ వాటివాటి సోషల్ మీడియా చానెల్స్ ప్రత్యేకంగా ఉన్నాయి.

తాజాగా ఐ-టీడీపీకి చెందిన కార్యకర్త చేబ్రోలు కిరణ్ వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ సతీమణి భారతి గురించి తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వాస్తవానికి టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి కిరణ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. ప్రత్యేకమైన కార్యక్రమాల ద్వారా వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ టీడీపీ వాయిస్ ను వినిపించేవాడు. అధికారంలోకి వచ్చాక కూడా తన సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నాడు.

అయితే, భారతిని ఉద్దేశించి అతడు చేసిన ఒక్క అసభ్యకర వ్యాఖ్య పరిస్థితిని మార్చేసింది.

ఐటీడీపీ కార్యకర్త అయిన చేబ్రోలు కిరణ్ మీద టీడీపీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలను ఉద్దేశించి ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు కిరణ్ ను సస్పెండ్ చేసింది. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా పార్టీ నేతలను ఆదేశించింది. ఈ మేరకు గుంటూరు పోలీసులు కిరణ్ పై కేసు నమోదు చేశారు.

క్షమాపణలు వేడుకున్నా

తాను చేసిన తప్పును గ్రహించిన కిరణ్ వెంటనే సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేశాడు. భారతి గురించి తాను మాట్లాడినది చాలా ఘోరమైన తప్పిదమేనంటూ ఒప్పుకొన్నాడు. తనను క్షమించాలని కోరాడు. కాళ్లు పట్టుకుంటానని వేడుకున్నాడు.

ఐటీడీపీ రివర్స్ కౌంటర్..

మద్దతు పలకడం అని కాదు కానీ.. చేబ్రోలు కిరణ్ పై చర్యలను ఉదాహరణగా చూపుతూ, మరి వైఎస్సార్సీపీ వారు సోషల్ మీడియాలో తమ కూటమి అగ్ర నాయకులపై పెట్టిన పోస్టుల సంగతి ఏమిటని ఐటీడీపీ వారు నిలదీస్తున్నారు. ఆ పోస్టులతో కూడిన వీడియోలను చూపుతూ వారిని ప్రభుత్వం ఎప్పుడు అరెస్టు చేయిస్తుందని ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి అధికారంలో ఉండగా.. సొంత పార్టీ కార్యకర్తపై తీవ్ర చర్య ద్వారా టీడీపీ అనూహ్య నిర్ణయం తీసుకుందనే చెప్పాలి.