జగన్ అంటే భయంతో కూడిన భక్తినా...అందుకే ఆయన వెళ్లాకనే ?
అయితే వీరు మాత్రం జగన్ ఎక్కే యూకే ఫ్లైట్ వైపే చూస్తున్నారని పొలిటికల్ సెటైర్లు వినిపిస్తున్నాయి.
By: Tupaki Desk | 4 Sep 2024 3:40 AM GMTవైఎస్ జగన్ ఉండగానే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్సీలు పార్టీకి తమ పదవులకు రాజీనామాలు చేశారు. వారి సైకిలెక్కేందుకు సిద్ధంగా ఉన్నారు అని టాక్. ఇక మరింత మంది కూడా అదే రూట్ లోకి వస్తారని అంటున్నారు. అయితే వీరు మాత్రం జగన్ ఎక్కే యూకే ఫ్లైట్ వైపే చూస్తున్నారని పొలిటికల్ సెటైర్లు వినిపిస్తున్నాయి.
జగన్ అలా విమానంలో ఎక్కి లండన్ టూర్ కి వెళ్లగానే వీరంతా ఇలా కండువాలు మార్చే పనిలో బిజీగా ఉంటారు అని అంటున్నారు. ఆ నంబర్ కూడా పెద్దదిగానే ఉంటుంది అని అంటున్నారు. వైసీపీ రాజ్యసభ ఎంపీలను నిలబెట్టుకోగలిగింది కానీ ఎమ్మెల్సీలను మాత్రం ఫిరాయించకుండా కట్టడి చేయలేదు అని అంటున్నారు. ఆ విషయంలో విఫలం చెందడం ఖాయమని అంటున్నారు.
దానికి కారణం వైసీపీ అధినాయకత్వం ఎంపిక చేసిన తీరే అని అంటున్నారు. పార్టీ పట్ల కమిట్మెంట్ తో పాటు నిబద్ధత ఉన్న వారిని పక్కన పెట్టి సామాజిక సమీకరణలు అని పేరు చెప్పి ఎవరెవరికో టికెట్లు ఇచ్చి పెద్దల సభకు పంపారని అంటున్నారు. వారంతా కూడా ఇపుడు గోడ దాటుతున్నారు అని అంటున్నారు.
టీడీపీ కూడా ఇలాంటి వారినే వల వేసి మరీ తన వైపునకు తిప్పుకుంటోంది అని అంటున్నారు. వారు కనుక వస్తే తిరిగి ఆ పదవులు వారికి కట్టబెట్టాల్సింది లేదని వారికి ఏదైనా హామీ ఇచ్చో వేరే నామినేటెడ్ పదవులు ఇచ్చో సర్దుబాటు చేయవచ్చునని ఆలోచిస్తోంది అని అంటున్నారు.
అందుకే నామినేటెడ్ పదవులు పందేరాన్ని కూడా వాయిదా వేసారు అని అంటున్నారు. ఎంత మంది వస్తే అంతమందిని తీసేసుకోవాలని తద్వారా శాసనమండలిలో తమ బలాన్ని పెంచుకుని మెజారిటీ సాధించాలని టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. ఒకసారి శాసన మండలి వైసీపీ నుంచి టీడీపీ పరం అయితే చైర్మన్ డిప్యూటీ చైర్మన్ పదవులతో పాటు విప్ సహా ఇతర కీలక పదవులు అన్నీ కూడా టీడీపీ కూటమికే వస్తాయని దాని వల్ల కూడా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.
అంతే కాదు చాలా సులువుగా శాసనమండలిలో బిల్లులను కూడా ఆమోదించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని కూడా భావిస్తున్నారు. దీంతోనే వైసీపీ ని ఆకట్టుకునేందుకు టీడీపీ కూటమి ప్రయత్నం చేస్తోంది అని అంటున్నారు. ఇక చూస్తే ఈ మేరకు వైసీపీ శిబిరంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్సీల నుంచి కూడా హామీ ఉందని వారు ఫిరాయించేందుకు రెడీ అని కూడా ప్రచారం అయితే సాగుతోంది. కానీ వారు జగన్ ఏపీలో ఉండగా ఈ ఫిరాయింపులకు తెగించరని అంటున్నారు.
జగన్ ఏపీ నుంచి దేశం నుంచి వెళ్లిపోగానే ఫ్యాన్ నీడ నుంచి సైకిలెక్కేందుకు రెడీ అంటారని అంటున్నారు. దీని మీద కూడా పొలిటికల్ గా సెటైర్లు పడుతున్నాయి. జగన్ అంటే భయంతో కూడిన భక్తితో కూడిన గౌరవమా అన్న మాట కూడా వినిపిస్తోంది. మరో వైపు చూస్తే జగన్ లేని సమయంలో ఫిరాయింపులను ఆపేది ఎవరు అన్న ప్రశ్న ఉత్పన్నం అవుతోంది.
శాసనమండలిలో విపక్ష నేతగా ఉన్న బొత్స సత్యనారాయణ ఆ పని చేయగలరా అన్నదే చర్చ. ఏది ఏమైనా వెళ్లాలనుకునే వారు వెళ్తున్నారు. ఉండాలనుకునే వారు ఉంటున్నారు. ఇది పక్కా రాజకీయం ఇక్కడ ఆపరేషన్ ఆకర్ష్ కానీ ఇవతల వైపు బుజ్జగింపులు కానీ అన్నీ నామమాత్రం అని రాజకీయాల్లో మారిన ట్రెండ్ కి ఇది నిదర్శనం అని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.