Begin typing your search above and press return to search.

టీడీపీ ఎమ్మెల్యేలను ఆ కళ్ళు కనిపెడుతూంటాయ్ !

ఈసారి టీడీపీ భారీ మెజారిటీతో గెలిచింది. పైగా ప్రతీ నియోజకవర్గంలో టీడీపీలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు నలుగురైదుగురు ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 Oct 2024 5:36 PM GMT
టీడీపీ ఎమ్మెల్యేలను ఆ కళ్ళు కనిపెడుతూంటాయ్ !
X

తెలుగుదేశం పార్టీ ఈసారి బంపర్ విక్టరీ కొట్టింది. 135 మంది ఎమ్మెల్యేలు టీడీపీకి సొంతంగా ఉన్నారు. ప్రతీ జిల్లాలో నూటికి తొంబై అయిదు శాతం మంది టీడీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఇక అయిదేళ్ల తరువాత దక్కిన అధికారం కాబట్టి ఎమ్మెల్యేలు కొంత చొరవ తీసుకుంటున్నారు. అంతే కాదు ఇసుక లిక్కర్ వంటి వాటి ఇషయంలో వారు తమదైన వాటం చూపిస్తున్నారు అన్న ఆరోపణలు ఉన్నాయి.

ఈ విషయంలో అధినాయకత్వం పలు మార్లు హెచ్చరించినా కొందరి తీరు అయితే మారడం లేదు అని అంటున్నారు. గ్రౌండ్ లెవెల్ లో ప్రజలతో నేరుగా కనెక్షన్ ఉండే ఎమ్మెల్యేలతో కనుక ఇబ్బంది వస్తే అది పార్టీకి ప్రభుత్వానికి కూడా చివరికి చెడ్డ పేరు తెస్తుందని కూడా భయపడుతున్నారు.

అందుకే అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సార్లు ఇదే విషయం చెప్పుకొచ్చారు. పార్టీ పరంగా తగిన జాగ్రత్తలు తీసుకోండి ప్రభుత్వ పధకాలను ప్రజలకు చేరవేయండి, ఆరోపణలకు విమర్శలకు దూరంగా ఉండండి అని కూడా ఆయన పేర్కొంటూ వచ్చారు.

అయితే ఎంత చెప్పినా ఎన్నిసార్లు మీటింగులు పెట్టినా క్లోజ్ గా మోనిటరింగ్ చేయడం అన్నది కుదరదు కాబట్టి చంద్రబాబు ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అదేంటి అంటే ఎమ్మెల్యేల పనితీరు తో పాటు వారి వ్యవహార శైలిని కూడా మరింత దగ్గరగా గమనించడానికి అయిదుగురు సభ్యులతో ఒక కమిటీని నియమిస్తున్నారు

లోకల్ గా దందాలు చేస్తే కనుక ఈ కమిటీ అసలు ఊరుకోదు ఉపేక్షించదని అంటున్నారు. ఈ కమిటీ మొదట ఆరోపణలు వచ్చిన ఎమ్మెల్యేలను పిలిచి మాట్లాడుతుందని అప్పటికి వారు తీరు మార్చుకోకపోతే అపుడు నేరుగా ముఖ్యమంత్రి పార్టీ అధినేత అయిన చంద్రబాబుకే చెబుతూ ఆయన ముందుకే విషయాన్ని చేరవేస్తుందని అంటున్నారు.

అంటే మ్యాటర్ వెరీ సీరియస్ అన్న సందర్భాలలో చంద్రబాబు ముందుకు సదరు నేతల వివరాల చిట్టా టేబిల్ మీద ఉంటుంది అన్న మాట. ఇక చంద్రబాబు దగ్గరకు ఆ వ్యవహారం కనుక చేరితే ఆయా ఆరోపణలు తీరుని బట్టి సీఐడీ, విజిలెన్స్ ఇతర ఎన్ ఫోర్స్ మెంట్ విభాగాలకు దానిని రిఫర్ చేసి యాక్షన్ దిశగానే అడుగులు వేస్తారు అని అంటున్నారు.

ఇది నిజంగా ఏపీలోనే కాదు రాజకీయాల్లోనే కొత్త ప్రయోగం అని అంటున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద కనుక ఎన్ ఫోర్స్ మెంట్ ఏజెన్సీలకు రిఫర్ చేస్తే కనుక ప్రభుత్వం పారదర్శకత రుజువు అవుతుందని అంటున్నారు. ఒక విధంగా అవినీతి అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు.

దాని వల్ల కచ్చితంగా భారీ మార్పు అయితే వస్తుందని అంటున్నారు. మరి అంతవరకూ ఏ ఎమ్మెల్యే అయినా తెచ్చుకోరు కదా అని అంటున్నారు. అందుకే ఫైవ్ మెన్ కమిటీ తోనే వారికి సీరియస్ రిమార్కులతో ఏ రకమైన ఆరోపణలు వచ్చినా ఇక వెనక్కి తగ్గాల్సిందే అని అంటున్నారు.

ఈసారి టీడీపీ భారీ మెజారిటీతో గెలిచింది. పైగా ప్రతీ నియోజకవర్గంలో టీడీపీలో ఎమ్మెల్యే స్థాయి నాయకులు నలుగురైదుగురు ఉన్నారు. సో ఎవరినీ ఉపేక్షించేది లేదని తప్పు చేసిన వారికి శిక్షలు ఉంటాయని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఎమ్మెల్యేల మీద సీరియస్ గా ఆరోపణలు వస్తే వారి ప్లేస్ లో కొత్త వారిని ఇంచార్జిగా నియమించేందుకు కూడా చంద్రబాబు వెనకాడబోరని పార్టీ వర్గాలు అంటున్నారు. బాబు కనుక ఈ విషయంలో చండశాసనుడిగా వ్యవహరిస్తే మాత్రం టీడీపీకి అది మంచి పేరు తెచ్చిపెడుతుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.