జగన్ కి అమిత్ షా ఇచ్చేశారు...ఇక మోడీ వంతు...!
ఇక టీడీపీ కూటమికి బీజేపీ సాయం పెద్దగా లేదని బలవంతపు పొత్తు ఇష్టంలేని కాపురం అని కూడా అంటూ వచ్చరు.
By: Tupaki Desk | 5 May 2024 10:30 AM GMTకేంద్ర బీజేపీ నాయకత్వానికి జగన్ అంటే అభిమానం ఉందని కేంద్ర అవసరాలు అవీ ఇవీ అంటూ ప్రచారం ఒక స్థాయిలో సాగింది. రాజ్యసభలో జగన్ పార్టీకి 11 మంది ఎంపీలు ఉన్నాయి, బీజేపీకి అవసరాలు ఉంటాయని కూడా ప్రచారం చేసిన వారు ఉన్నారు.
ఇక టీడీపీ కూటమికి బీజేపీ సాయం పెద్దగా లేదని బలవంతపు పొత్తు ఇష్టంలేని కాపురం అని కూడా అంటూ వచ్చరు. కానీ అదంతా తప్పు బీజేపీ అగ్ర నేత అమిత్ షా ఏపీ పర్యటనలో స్పష్టం అయిపోయింది.అనంతపురం జిల్లా ధర్మవరంలో అమిత్ షా ఏపీ ఎన్నికల ప్రచార సభను నిర్వనించారు. ఈ సందర్భంగా ఆయన జగన్ ప్రభుత్వం మీద డైరెక్ట్ అటాక్ చేశారు.
భ్రష్టాచార్ సర్కార్ అంటూ షాక్ ఇచ్చేశారు. అవినీతి గూండాయిజం తో కూడుకున్న ప్రస్తుత ప్రభుత్వాన్ని అధికారం నుంచి వెళ్ళగొట్టడానికే టీడీపీ జనసేనలతో బీజేపీ పొత్తు పెట్టుకుందని అమిత్ షా క్లారిటీగా చెప్పేశారు. అక్రమాలు అవినీతి అంటూ అచ్చం టీడీపీ గొంతుకతోనే అమిత్ షా మాట్లాడడంతో వైసీపీ మీద బీజేపీకి సాఫ్ట్ కార్నర్ ఏదీ లేదని తేలిపోయినట్లు అయింది.
ఏపీ చంద్రబాబు పాలనలోనే నంబర్ వన్ గా ఉందని భారీ కితాబు కూడా అమిత్ షా ఇచ్చేశారు. కేంద్రంలో మోడీ ఏపీలో చంద్రబాబు అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని అమిత్ షా ప్రజలకు సందేశం పంపించారు. రామాలయం ప్రారంభోత్సవానికి జగన్ కి ఆహ్వానం పంపిస్తే ఆయన పట్టించుకోలేదని అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు రామ భక్తులు ఓటు వేయాలా అని ప్రశ్నించారు.
తిరుమల పవిత్రత మంట కలుస్తోందని, ఏపీలో తెలుగు అంతరించే ప్రమాదం ఉందని కూడా తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే బీజేపీ వాటిని కాపాడుతుందని అభయం ఇచ్చారు. ఏపీలో అమరావతి రాజధానికి బీజేపీ కట్టుబడి ఉందని, పోలవరం ప్రాజెక్ట్ ని రెండేళ్ళలో పూర్తి చేస్తామని కూడా అమిత్ షా మరో కీకల హామీ ఇచ్చారు. జగన్ అయిదేళ్ళ పాలనలో పోలవరం పడకేసింది అని కూడా నిందలు వేశారు.
మొత్తానికి టీడీపీ కూటమిని మరో పది అడుగులు ముందుకు తీసుకుని వెళ్లేలా ప్రజలకు ఏపీలో కొత్త సీఎం చంద్రబాబే అని చాటి చెప్పేలా అమిత్ షా ప్రసంగం అయితే సాగింది. టీడీపీ కూటమికి అసలైన ఇంజన్ బీజేపీ అని కూడా ఆయన మాటల ద్వారా తేటతెల్లమైంది. అమిత్ షా ఒక విధంగా చెప్పాలంటే జగన్ కి ఇచ్చి పడేశారు. ఇక ఈ నెల 6 న ఏపీకి రానున్న నరేంద్ర మోడీ వంతు మిగిలి ఉంది.ఆయన జగన్ మీద ఏమంటారో ఎలాంటి విమర్శలు చేస్తారో చూడాల్సి ఉంది.
నిజానికి బీజేపీ అగ్ర నేతలు ఏపీలో ఎన్నికల ప్రచారానికి పోలింగ్ కి దగ్గర చేసి షెడ్యూల్ చేశారు అని అంటున్నారు. ఏపీలో కూటమి కట్టడం వెనక కూడా మోడీ అమిత్ షాల పాత్ర వారి ఆసక్తి ఉందని అంటున్నారు. ఏపీలో ప్రభుత్వం మార్చాలని తమ భాగస్వామ్యంతో ఉండే ప్రభుత్వం రావాలని బీజేపీ పెద్దల ఆలోచన.
దానికి అనుగుణంగానే ఎన్నికల ప్రచారం చివరలో ఏపీకి మోడీ అమిత్ షాలు వచ్చి జగన్ కి ఆయన ప్రభుత్వానికి గట్టి ఝలక్ నే ఇవ్వనున్నారు అని అంటున్నారు. అమిత్ షా తీవ్ర విమర్శల నేపధ్యంలో రేపటి రోజున నరేంద్ర మోడీ కూడా జగన్ మీద ఇదే తీరున విరుచుకుని పడే పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరి కేంద్ర బీజేపీ ఇప్పటిదాకా వైసీపీ మీద ఎటాక్ చేయలేదని గమ్మున్న ఉంటూ అసలు బీజేపీ ఊసే తీసుకుని రాని వైసీపీ నేతలు ఇపుడు బీజేపీకి రివర్స్ కౌంటర్లు వేయాల్సిన అవసరం అగత్యం అయితే ఏర్పడింది అని అంటున్నారు.