Begin typing your search above and press return to search.

తెలంగాణా పోటీ నుంచి టీడీపీ దూరం...?

తెలుగుదేశం పార్టీ తెలంగాణా ఎన్నికల పోటీ నుంచి దూరం అవుతుందా అన్న చర్చ అయితే హాట్ హాట్ గా సాగుతోంది.

By:  Tupaki Desk   |   20 Oct 2023 1:30 AM GMT
తెలంగాణా పోటీ నుంచి టీడీపీ దూరం...?
X

తెలుగుదేశం పార్టీ తెలంగాణా ఎన్నికల పోటీ నుంచి దూరం అవుతుందా అన్న చర్చ అయితే హాట్ హాట్ గా సాగుతోంది. అన్ని పార్టీలు అభ్యర్దుల ఎంపికను పూర్తి చేసి జాబితాలను విడుదల చేస్తూంటే టీడీపీ ఇంకా పోటీ చేయాలా వద్ద అన్న దగ్గరే ఆగిపోయింది అని అంటున్నారు. టీడీపీ ఈసారి ఎన్నికల్లో కచ్చితంగా పోటీ చేస్తుంది అని టీ టీడీపీ ప్రెసిడెంట్ కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించారు.

ఆ మీదట ఆయన చంద్రబాబు ఉన్న రాజమండ్రి జైలుకు వెళ్ళి ములాఖత్ అయ్యారు. ఆ మీదట ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ తాము పోటీ చేస్తామని కూడా స్పష్టం చేశారు. మరో వైపు తెలంగాణా టీడీపీ ఎన్నికల విషయంలో నారా భువనేశ్వరి కీలకంగా మారుతారని, ఆమె పర్యవేక్షణలో ఎన్నికలు వెళ్తారని, బాలయ్య ప్రచార బాధ్యతలను చూస్తారని వార్తలు వచ్చాయి.

అదే విధంగా జనసేనతో పొత్తు పెట్టుకుంటారని కూడా ప్రచారం సాగింది. ఇక తాను స్వయంగా పోటీ చేస్తాను అని కాసాని జ్ఞానేశ్వర్ అంటున్నారు. అయితే ఆయన చెప్పిన తరువాత అడుగులు ఒక్కటి కూడా ముందుకు పడలేదు. ఈ లోగా బాబుతో మరో ములాఖత్ కుటుంబం జరిపింది. నారా లోకేష్ నారా భువనేశ్వరికి ఈ ములాఖత్ తరువాత బాబు ఇచ్చిన డైరెక్షన్ అంతా చూస్తే వారు ఏపీలోనే పర్యటించేలా ఉంది. ముఖ్యంగా తెలంగాణా ఎన్నికల వేళ అక్కడ వ్యవహారాలు భువనేశ్వరి చూస్తారని వార్తలు వచ్చినా ఆమె ఇపుడు ఏపీలోనే జిల్లాల టూర్లు చేయనున్నారు. దసరా తరువాత అది స్టార్ట్ అవుతుంది అని అంటున్నారు.

అలా కనుక చూసుకుంటే తెలంగాణాలో పార్టీని ఆమె లీడ్ చేయరని స్పష్టం అయిపోతోంది అంటున్నారు. అంటే తల్లీ కొడుకులు ఇద్దరూ ఏపీకే పరిమితం అయితే మరి తెలంగాణా ఎన్నికలు పార్టీ వ్యవహారాలు ఎక్కడ అన్న ప్రశ్నలు వస్తున్నాయి. మరో వైపు చూస్తే జనసేన మద్దతుని బీజేపీ కోరుతోంది. ఆ పార్టీ మాకు జనసేన ఎన్డీఏ మిత్రపక్షం అని చెప్పుకుంటోంది.

దాంతో జనసేనతో ఏపీ మిత్రబంధం టీడీపీ తెలంగాణాలో కంటిన్యూ చేయడానికి ఇబ్బందులు ఉన్నాయని అంటున్నారు. ఒకవేళ బీజేపీ జనసేన పొత్తులు పెట్టుకున్నా లేక ఏమీ కాకుండా పోటీ నుంచి తప్పుకుని మద్దతు ఇచ్చినా టీడీపీది సోలో ఫైటే అవుతుంది. మరో వైపు చూస్తే తెలంగాణాలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కి టీడీపీ పోటీ చిల్లు పెడుతుంది అని కూడా టీడీపీ అనుకూల మీడియా కొద్ది రోజులుగా రాస్తూ వస్తోంది.

దాని మీద టీడీపీ ఇపుడు ఆలోచించుకుందా అన్న చర్చ వస్తోంది. తెలంగాణాలో ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో పోటీ చేసి అటు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ ని దెబ్బ తీసి ఇటు బీజేపీకి చెడ్డ అయి మరో వైపు చూస్తే జనసేనకు ఏపీలో మిత్రుడిగా తెలంగాణాలో ఏమీ కాకుండా చేసుకోవడం ఎందుకు అన్న దూరాలోచనతో టీడీపీ ఉందా అన్న డౌట్లు వస్తున్నాయి.

మొత్తానికి ఈ రోజుకు అయితే టీడీపీ తెలంగాణాలో పోటీ చేస్తుందా అంటే ఇంకా తేలలేదు అనే అంటున్నారు. మరి రానున్న రోజులలో ఏమైనా కదలిక ఉంటుందా అన్నది కూడా డౌటే. ఎందుకంటే నామినేషన్లకు గడువు దగ్గర పడుతోంది. ఎన్నికలకు గట్టిగా నలభై రోజులే టైం ఉంది. సో టీడీపీ డెసిషన్ ఏంటి అన్నది చూడాల్సి ఉంది.