Begin typing your search above and press return to search.

టీడీపీలో డిపాజిట్ల గోల!?

ఏమిటీ డిపాజిట్ల గోల ఎందుకీ డిపాజిట్లు అంటే పసుపు పార్టీలో చాలా కధ ఉందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   23 Aug 2023 11:30 PM GMT
టీడీపీలో డిపాజిట్ల గోల!?
X

తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం డిపాజిట్ల గోల సాగుతోంది అని ప్రచారంలో ఉన్న మాట. ఏమిటీ డిపాజిట్ల గోల ఎందుకీ డిపాజిట్లు అంటే పసుపు పార్టీలో చాలా కధ ఉందని అంటున్నారు. నిజానికి చూస్తే భారత రాజకీయాల్లో ఎక్కడ లేని కండిషన్లు చాలా పార్టీలు చేస్తూ వస్తున్నాయి. ఎన్నిక ఎన్నికకూ రాజకీయం కూడా బాగా మారుతోంది.

ఈ నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ తీరు మరోలా ఉందని అంటున్నారు. అదేంటి అంటే తెలుగుదేశం పార్టీ టికెట్ కావాలీ అంటే డిపాజిట్లను ఇప్పటి నుంచే చేయాలంట. ఈ డిపాజిట్ల కధా కమామీషూ అంతా దేనికి ఎందుకు అంటే అభ్యర్ధుల అర్ధ బలం గురించి తెలుసుకోవడం కోసం అంటున్నారు.

అంటే వచ్చే ఎన్నికల్లో హోరా హోరీ పోరు సాగనున్న వేళ బాగా సౌండ్ పార్టీలే బరిలోకి దిగాలని చెప్పేందుకే అని అంటున్నారు. బాగా డబ్బున్న వారికే టికెట్ అని బయటకు చెప్పకుండానే ఈ డిపాజిట్ల వ్యవహారాన్ని తెర ముందుకు తీసుకుని వచ్చారు అని అంటున్నారు.

బాగా డబ్బు ఉంటే సీటునే సీటు అన్నది చెప్పకనే చెబుతున్న రూల్ గా అంటున్నారు. దీన్ని బట్టి అర్ధం చేసుకోవాల్సిది ఏంటి అంటే పార్టీ కోసం గత నాలుగేళ్ళుగా విపక్ష పాత్ర చురుకుగా పోషించి అధికార పార్టీ తో ఢీ కొట్టి కేసులు పెట్టించుకుని నానా అవస్థలు పడినా కూడా అవేమీ క్రెడిట్స్ కిందకు రావు అని అంటున్నారు. కేవలం డబ్బు ఉంటే చాలు వారికే టికెట్ అని చెప్పేందుకే ఈ డిపాజిట్లను ముందుకు తెచ్చారు అని అంటున్నారు.

అయితే పార్టీలో మొదటి నుంచి ఉన్న వారూ ఎన్టీయార్ టైం నుంచి పైసా ఖర్చు పెట్టకుండా సీటూ పదవులూ పొందిన వారు ఇదేమి విధానం అని వ్యతిరేకిస్తున్నారుట. ఇలాగైతే పార్టీలో పనిమంతులు విధేయులు, కష్టించి పనిచేవారికి టికెట్లు ఎలా వస్తాయని వారు అంటున్నారుట.

అయితే ఈ విధానాన్ని తీసుకుని వచ్చింది చంద్రబాబు కాదు లోకేష్ అని అంటున్నారుట. దానికి పార్టీలోని జూనియర్లు అంతా ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారుట. తమకు లోకేష్ మాటే వేదమని వారు బల్ల బుద్ది మరీ చెబుతున్నారుట.

ఈ పరిణామాలను చూస్తున్న వారు టీడీపీలో చంద్రబాబు మాటకు చెల్లుబాటు అయ్యే దానికి చెల్లు చీటి ఇచ్చేశారా అన్న డౌట్లు కూడా వ్యక్తం చేస్తున్నారుట. ఒక పద్ధతి ప్రకారం పార్టీఎని చంద్రబాబు నడుపుకుని వచ్చారు. ఆయన ఇలాంటి రూల్స్ ఎపుడూ పెట్టలేదని సీనియర్లు అంటున్నారుట.

ఇదిలా ఉంటే డిపాజిట్లు అంటూ పార్టీలో డబ్బున్న వారు సౌండ్ చేసే వారూ డిపాజిట్లు చేస్తారు. మరి ఒకవేళ ఏ కారణ చేతనైనా పార్టీ టికెట్ ఇవ్వకపోతే అపుడు తమ సంగతేంటి అని అంటున్న వారూ ఉన్నారుట. ఇపుడు టికెట్ కావాలన్న ఆశతో డిపాజిట్లు తీసుకున్నా రేపటి రోజున ఇవ్వకపోతే ఏదో మరో పదవి ఇస్తామని చెప్పి డిపాజిట్లు ఇవ్వకపోతే అన్న డౌట్లూ కొంతమంది వ్యక్తం చేస్తున్నారుట.

ఏది ఏమైనా రాజకీయ పార్టీలలో ఇది ఒక కొత్త సంప్రదాయం అని అంటున్నారు. పార్టీ ఇప్పటిదాక ఆభ్యర్ధుల విషయంలో అర్ధబలం మాత్రమే చూసేది, వివరాలు తెలుసుకునేది. కానీ డిపాజిట్లు కట్టమని అడగడం మాత్రం వింత ప్రక్రియ అని అంటున్నారు. ఈ రకమైన ప్రచారం టీడీపీలో జరుగుతున్నది నిజమైతే మాత్రం ఇది ఇబ్బందికరమే అంటున్నారు.

ఎందుకంటే ఇప్పటికే మన ర్పజస్వామ్యం ధనస్వామ్యమని ఒక విమర్శ ఉంది. అంతే కాదు రాజకీయ పార్టీలు కూడా డబ్బున్న వారికే టికెట్లు ఇస్తారని కూడా ఘాటు కామెంట్స్ ఉన్నాయి. ఈ నేపధ్యంలో ఇలాంటివి కూడా తోడు అయితే రేపటి రోజున ఇదొక ట్రెండ్ గా మారి అందరూ అనుసరిస్తే అపుడు పార్టీకి పని చేసిన వారు జెండా కర్రను భుజాన మోసిన వారు పార్టీకి జీవకర్రగా మారిన వారి సంగతేంటి అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది.

ఇవన్నీ చూస్తూంటే చంద్రబాబు మాట ఇపుడు టీడీపీలో చెల్లుబాటు కావడం లేదా అన్నదే అందరికీ దొలిచేస్తున్న ప్రశ్నగా ఉంది మరి. దీనికి రానున్న కాలమే జవాబు కచ్చితంగా చెబుతుంది అని అంటున్నారు.