Begin typing your search above and press return to search.

చంద్రబాబు హామీ : ఈ నెలలో 33 వేల ఉద్యోగాలు ఇస్తున్నారా ?

తాజా ఎన్నికల్లో కూటమి విజయం వెనక చంద్రబాబు నాయకత్వం మీద జనాలకు ఉన్న నమ్మకమే పునాదిగా నిలిచింది అని గట్టిగా చెప్పాలి.

By:  Tupaki Desk   |   11 July 2024 12:30 PM GMT
చంద్రబాబు హామీ : ఈ నెలలో 33 వేల ఉద్యోగాలు ఇస్తున్నారా ?
X

చంద్రబాబు అంటే అభివృద్ధి ఉపాధి. బాబును ఈ విషయంలో అంతా బలంగా నమ్ముతారు. తాజా ఎన్నికల్లో కూటమి విజయం వెనక చంద్రబాబు నాయకత్వం మీద జనాలకు ఉన్న నమ్మకమే పునాదిగా నిలిచింది అని గట్టిగా చెప్పాలి. ఇదిలా ఉంటే చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఎన్నో హామీలు ఇచ్చారు.

అందులో నిరుద్యోగ యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని భారీ స్థాయిలో ప్రకటించారు. ఈ లెక్కన చూసుకుంటే అరవై నెలలకు కానీ ఈ పాతిక లక్షలను విభజిస్తే నెలకు 33 వేల ఉద్యోగాలు అవుతాయి. ఇక ఏపీలో చూస్తే చంద్రబాబు నాయకత్వాన టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు అయి అపుడే ఒక నెల గడచింది. అంటే 33 వేల ఉద్యోగాలు ఈపాటికి ఇచ్చి ఉండాలి. లేకపోతే ఇచ్చే విధంగా రంగం సిద్ధం చేసి ఉండాలి.

అందుకే బాబు హామీని నిరుద్యోగ యువత గుర్తు చేసుకుంటున్నారు. ఏడాదికి అయిదు లక్షల ఉద్యోగాలు అని ఒకేసారి రావు కదా. అవి చెట్టుకో పుట్టకో పుట్టవు కదా. అందుకే వాటిని ప్రతీ నెలా ఇన్ని అని లెక్క వేసుకుని యువతకు ఉపాధి మార్గాలు చూపిస్తే ప్రభుత్వానికి భారం తగ్గుతుంది. యువత సైతం ప్రభుత్వం ఏర్పడిన తొలి నాళ్ళ నుంచి హామీ నెరవేరిందని తమకు ఉద్యోగం లభించిందని సంతోషిస్తుంది.

అయితే ఇక్కడ ఒక కన్ ఫ్యూజన్ ఉంది. ఏటా అయిదు లక్షల ఉద్యోగాలు అని టీడీపీ చెప్పింది కానీ అవి ప్రభుత్వ ఉద్యోగాలా లేక ప్రైవేట్ అన్నది చెప్పలేదు. అయితే ప్రభుత్వ రంగంలో అన్ని లక్షల ఉద్యోగాలు ఉండవని ఎవరైనా అర్ధం చేసుకోగలరు. అయితే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు అన్నా కూడా అవి మంచి కంపెనీలలో ఉద్యోగాలని ఆకర్షణీయమైన జీతాలతోనే రావాలని యువత కోరుకుంటుంది.

అంతే తప్ప పది ఇరవై వేల రూపాయల ఉద్యోగాలకు మాత్రం వారు అసలు ఒప్పుకోరు అని అంటున్నారు. ఆవిధంగా చూస్తే ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీలను ఒక వైపు భర్తీ చేస్తూనే ప్రైవేట్ రంగంలో భారీ కంపెనీలను ఆహ్వానించడం అలాగే ఉన్న సంస్థలలో కూడా స్థానిక యువతకు ఉద్యోగాలు వచ్చేలా చూడడం ప్రభుత్వం చేయాల్సిన పని.

ఆ దిశగా కొత్త ప్రభుత్వం అడుగులు వేసినపుడే ఉద్యోగ కల్పన అనేది భారీ స్థాయిలో జరుగుతుంది. అయితే ఉద్యోగాలు లక్షలలో పుట్టుకుని వస్తాయా అంటే అది అంత తొందరగా కుదిరే వ్యవహారం కాదనే అంటున్నారు ఒక భారీ పరిశ్రమ ఏర్పాటు కావాలంటే వేలాది ఎకరాల భూమి ఇవ్వాలి, విద్యుత్, నీరు ఉచితంగా ఇవ్వాలి. పన్నుల రాయితీ ఇవ్వాలి.

ఇన్ని చేసినా ఆ పరిశ్రమ మొత్తంగా ఇచ్చే ఉద్యోగాలు వేలల్లోనే ఉంటాయి తప్ప లక్షలు కానే కాదు. అలా ఎన్ని పరిశ్రమలు తెచ్చినా అయిదేళ్లలో పాతిక లక్షల ఉద్యోగాలు అవుతాయన్నది కూడా ఆలోచించాలి. అయితే టీడీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ చేసి యువతను స్వయం ఉపాధి దిశగా అడుగులు వేయించి ఉపాధి చూపించామని చెబుతుందా అన్న చర్చ ఉంది.

అలా అయితే యువత వైట్ కాలర్ జాబ్స్ తమకు దక్కలేదు అన్న తీవ్రమైన అసంతృప్తితో రగలడం ఖాయం. ఏది ఏమైనా ఉద్యోగ కల్పన అన్నది అతి పెద్ద విషయం. అది ఎప్పటికీ ప్రభుత్వాలు పూర్తిగా అమలు చేయలేని విషయం. ఉపాధి కల్పనకు అవకాశాలు చూపిస్తామని చెప్పాలి తప్ప ఏటా ఇన్నేసి లక్షలు అని నంబర్ చెబితేనే చిక్కులు వస్తాయి. ఇపుడు కూటమి ప్రభుత్వం ఏమి చేస్తౌందో చూడాలి. అపుడే హానీమూన్ లో తొలి నెల గడచింది కాబట్టి మెల్లగా నిరసన గళాలు వినిపించే చాన్స్ కూడా ఉండొచ్చు అని అంటున్నారు. ఎందుకంటే ఈ నాటి జనాలకు అన్నీ తొందరగానే రావాలి కాబట్టి.