టీడీపీ - జనసేన... ఎంపీ సీట్లు ఇవేనా?
ఈ సమయంలో... ముందుగా ఎంపీ స్థానాల విషయంలో వీరిమధ్య ఒక క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది.
By: Tupaki Desk | 1 Feb 2024 4:56 AM GMTఒక పక్క అధికార వైసీపీ మార్పులు చేర్పులు చేపడుతూ ఇప్పటికే సుమారు 62 అసెంబ్లీ 9 లోక్ సభ స్థానాలకు ఇన్ చార్జ్ లను కన్ ఫాం చేసిన సంగతి తెలిసిందే. దీంతో... టీడీపీ - జనసేన సీట్ల సర్దుబాట్లు ఎప్పుడు అవుతాయి.. అభ్యర్థుల ప్రకటన ఎప్పుడు వస్తుంది అంటూ తమ్ముళ్లకు, జనసైనికులకు ఎదురుచూస్తున్నారంటూ కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో... ముందుగా ఎంపీ స్థానాల విషయంలో వీరిమధ్య ఒక క్లారిటీ వచ్చిందని తెలుస్తుంది.
అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాట్లు చేసుకోవడంతో పాటు.. ప్రధానంగా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం.. అసంతృప్తులను బుజ్జగించడం.. రెబల్స్ గా మారకుండా కూల్ చేయడం వంటి బోలేడన్ని సమస్యలు ఉంటాయని అంటుంటారు. ఈ సమయంలో "రా.. కదలిరా" సభలకు చిన్న విరామం ఇచ్చి మరీ చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలపై కసరత్తులు చేస్తున్నారని తెలుస్తుంది.
ఇందులో భాగంగా... తొలుత ఎంపీ స్థానాలపై బాబు గురిపెట్టారని అంటున్నారు. ఇందులో భాగంగా తొలివిడతగా 25 ఎంపీ స్థానాల్లోనూ 13 సీట్లకు అభ్యర్థులను ఖరారు చేశారని తెలుస్తుంది. ఇందులో భాగంగా తొలివిడతగా ఎంపిక చేసిన 13లోనూ 11 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను, 2 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. ఇందులో ముందుగా ప్రచారం జరిగినట్లుగానే... మచిలీపట్నంతో పాటు కాకినాడ లోక్ సభ స్థానాలను జనసేనకు కేటాయించారు.
ఈ క్రమంలో శ్రీకాకుళం నుంచి మరోసారి రామ్మోహన్ నాయుడినే బాబు బరిలోకి దింపుతున్నారని తెలుస్తుంది. కాగా... రామ్మోహన్ ఈసారి అసెంబ్లీకి రావాలని ఆశపడినట్లు కథాలొచ్చిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో... నరసాపురం లోక్ సభ స్థానం నుంచి టీడీపీ తరుపున రఘురామ కృష్ణంరాజు బరిలోకి దిగనున్నారని అంటున్నారు. ఇదే సమయంలో... విజయవాడ నుంచి చిన్ని పేరు వినిపిస్తుంది.
ఇక ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన లావు శ్రీకృష్ణదేవరాయులకు నరసరావు పేట స్థానాన్నే కన్ ఫాం చేశారని అంటున్నారు. అనంతపురం నుంచి సీనియర్ నేత కాల్వ శ్రీనివాసులు బరిలోకి దిగనుండగా... మచిలీపట్నం నుంచి వైసీపీ సిట్టింగ్ ఎంపీ బాలశౌరి జనసేన తరుపున బరిలోకి దిగుతున్నారు. ఈ క్రమంలో అందుతున్న సమాచారం మేరకు టీడీపీ - జనసేన ఎంపీ అభ్యర్థుల జాబితా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం!
శ్రీకాకుళం – రామ్మోహన్ నాయుడు
అనకాపల్లి – దిలీప్ చక్రవర్తి
విశాఖపట్నం - భరత్
నరసాపురం - రఘురామ కృష్ణంరాజు
ఏలూరు - గోపాల్
విజయవాడ - కేశినేని చిన్ని
నరసరావుపేట - శ్రీకృష్ణదేవరాయులు
తిరుపతి - నిహారిక
రాజంపేట - బాలసుబ్రమణ్యం
హిందూపురం - పార్థసారథి
అనంతపురం - కాల్వ శ్రీనివాసులు
కాకినాడ - సాన సతీష్ (జనసేన)
మచిలీపట్నం - బాలశౌరి (జనసేన)