Begin typing your search above and press return to search.

టీడీపీ జనసేన : వారంలో పొత్తు చిత్తు...!?

వారం రోజుల వ్యవధిలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చిత్తు కాక తప్పదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   26 Jan 2024 1:36 PM GMT
టీడీపీ జనసేన : వారంలో పొత్తు చిత్తు...!?
X

ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఎన్నికలు ముంగిట ఉన్న వేళ టీడీపీ జనసేనల మధ్య పొత్తు వ్యవహారం బీటలు వారే సూచనలు కనిపిస్తున్నాయి. వారం రోజుల వ్యవధిలో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు చిత్తు కాక తప్పదని అంటున్నారు. దానికి కారణం బీజేపీ అని తెలుస్తోంది.

ఏపీలో రాజకీయ ఆట బీజేపీ స్టార్ట్ చేసింది. రామమందిరం ప్రారంభోత్సవం విగ్రహ ప్రాణ ప్రతిష్ట వరకూ బీజేపీ మౌనంగా ఉంది. ఇపుడు బీజేపీ దేశంలో రాజకీయాలను మలుపు తిప్పేందుకు రెడీ అయింది. అందులో భాగంగా ఏపీలో తన గేమ్ మొదలెట్టింది.

బీజేపీ అఫీషియల్ గా జనసేనతో పొత్తులో ఉంది. అదే విధంగా చూస్తే టీడీపీతో పొత్తులు కమలనాధులు ససేమిరా అంటున్నారు. ఏపీలో ఈసారి కూడా టీడీపీ ఓడిపోతేనే బీజేపీకి అక్కడ ప్రాణ ప్రతిష్ట జరుగుతుందని కాషాయదళం ఆలోచన. ఇక జనసేన అధినేత పవన్ అయితే బీజేపీని కూడా టీడీపీ కూటమిలోకి తీసుకుని రావాలని అనుకుంటున్నారు.

కానీ ఇపుడు బీజేపీయే పవన్ని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది. త్వరలో పవన్ ఢిల్లీ టూర్ ఉంది. ఈ టూర్ లో బీజేపీ అగ్రనేతలు పవన్ తో కీలక అంశాలే చర్చిస్తారు అని అంటున్నారు. పవన్ బీజేపీతో ఉంటారా లేక టీడీపీతో కొనసాగుతారా అన్నది ఆయన తేల్చుకోమని కోరుతారని అంటున్నారు.

ఇక ఏపీలో చూస్తే జనసేన గ్రాఫ్ బాగా పెరిగింది. అదే సమయంలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరో సారి వచ్చే అవకాశం ఉంది. రామమందిరం నిర్మాణంతో బీజేపీకి పాజిటివ్ వేవ్స్ కూడా ఉన్నాయి. దాంతో పాటు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మొత్తం ఎలక్షనీరింగ్ తో పాటు ఖర్చు అంతా ఆ పార్టీ భరించేందుకు కూడా సిద్ధంగా ఉందని అంటున్నారు.

అదే విధంగా పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్ధిగా ఈ కూటమికి ముందుకు సాగుతుంది అని అంటున్నారు. బీజేపీకి పాతిక సీట్లు తీసుకున్నా 150 సీట్ల దాకా జనసేన పోటీ చేసేందుకే అనుమతిస్తుందని అంటున్నారు. అలాగే ఎంపీ సీట్లలో తొంబై శాతం బీజేపీ పోటీ చేస్తుందని అంటున్నారు. ఆ విధంగా మోడీ పవన్ జోడీతో 2024 ఎన్నికలను ఢీ కొడితే కచ్చితంగా మంచి నంబర్ లో సీట్లు వస్తాయని ఆ ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ఏపీలో 2029 నాటికి ఈ కూటమి అధికారంలోకి వచ్చేందుకు వీలు ఉంటుందని అంటున్నారు.

మరో వైపు చూస్తే పవన్ కూడా తమ పార్టీని చిన్న చూపు చూడవద్దని టీడీపీకి ఇండైరెక్ట్ గా అల్టిమేటం ఇవ్వడమూ జరిగింది. పవన్ ఎట్టి పరిస్థితుల్లోనూ మోడీని వీడి రారు అని అంటున్నారు. దేశానికి మోడీ నాయకత్వం కావాలని పవన్ బలంగా కోరుకుంటున్నారు. దాంతో పాటు ఏపీలో ఓట్ల చీలిక వద్దు అన్న పవన్ టీడీపీ కలసి రాకపోతే తన దారి తాను చూసుకుంటారు అని అంటున్నారు.

అందుకే ఆయన ధైర్యంగా రెండు సీట్లకు అభ్యర్ధులను ప్రకటించారు అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఇపుడు పొత్తు పెటాకులు అవడం వల్ల పవన్ కి పోయేది పెద్దగా లేదని అలాగే బీజేపీకి కూడా ఇది లాభకరమే అంటున్నారు. టీడీపీయే ఈ విషయంలో ఆలోచించుకుని ముందుకు వస్తేనే కచ్చితంగా పొత్తు కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.