Begin typing your search above and press return to search.

జనసేన.లిస్ట్... ..తమ్ముళ్ళ ఆక్రోశం

నెల్లిమర్లకు చెందిన జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవి అయితే ఏకంగా ఒక లిస్ట్ నే అధికారులకు పంపించారు అని అంటున్నారు.

By:  Tupaki Desk   |   14 July 2024 3:30 PM GMT
జనసేన.లిస్ట్... ..తమ్ముళ్ళ ఆక్రోశం
X

కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక సీనియర్ నేత మంత్రి అచ్చెన్నాయుడు శ్రీకాకుళం లో జరిగిన పార్టీ సమావేశంలో మాట్లాడుతూ పసుపు బిళ్ళ తగిలించుకుని ఆఫీసులకు వెళ్ళండి ఎవరు పనిచేయరో చూస్తామని ఒక హెచ్చరిక లాంటి ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. దాని మీద పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

అయితే అచ్చెన్నాయుడు మాటలకే అది పరిమితం అయిందా లేక ఆచరణకు వచ్చిందా అన్నది తెలియదు కానీ విజయనగరం జిల్లాలో మాత్రం జనసేన ఎమ్మెల్యే చేతలలో అది చేసి చూపిస్తున్నారు అని అంటున్నారు. నెల్లిమర్లకు చెందిన జనసేన మహిళా ఎమ్మెల్యే లోకం మాధవి అయితే ఏకంగా ఒక లిస్ట్ నే అధికారులకు పంపించారు అని అంటున్నారు.

వివిధ రకాలైన పనుల మీద మీ దగ్గరకు మా వాళ్లొస్తారు అలా వచ్చిన వారి పనిని తప్పనిసరిగా చేసి పెట్టండి అని ఎమ్మెల్యే లోకం నాగమాధవి మండల స్థాయి అధికారుల చేతికి జనసేన నాయకుల పేర్లతో కూడిన జాబితాను ఇచ్చి ఆదేశించినట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

అంతే కాదు తన నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఒక జనసేన నాయకుడుని ఎంపిక చేసి ఆయన పేరును తహశీల్దార్‌, ఎంపిడిఒ, ఎస్‌ఐ ఇతర అధికారులకు జాబితా రూపంలో పంపించారని అంటున్నారు అలా ఆ జాబితాలో ఉన్న వారు వస్తేనే అనుకూలంగా పనిచేయాలని వారు కాకుండా మిగిలిన వారొస్తే అసలు ఏ మాత్రం పట్టించుకోవద్దని ఎమ్మెల్యే చాలా స్పష్టంగా చెప్పినట్లుగా ప్రచారం సాగుతోంది.

దీంతో తెలుగుదేశం నాయకులు మండిపడుతున్నారని అంటున్నారు. తాము నెల్లిమర్ల ఎమ్మెల్యే గెలుపు కోసం పనిచేసామని కూటమి తరఫున అభ్యర్ధిగానే చూసి గెలిపించామని అంటున్నారు. తీరా గెలిచిన తరువాత తన సొంత పార్టీ వారికే తప్ప ఎవరికీ ప్రాధాన్యత ఇవ్వకుండా చేయడమేంటి అని ఫైర్ అవుతున్నారని అంటున్నారు.

అంతే కాదు ఎమ్మెల్యే గెలిచిన తరువాత జనసేన నేతలకే ప్రయారిటీ ఇస్తున్నారని టీడీపీ వారిని ఏ సమావేశాలకూ పిలవడం లేదని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ముందు తమ్ముళ్లు చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారు అని అంటున్నారు. నెల్లిమర్లలో టీడీపీకి గట్టి పట్టు ఉన్నా జన్సేన విజయం కోసం కృషి చేశామని అయినా తమను చిన్న చూపు చూడడం తగునా అని వాపోతున్నారుట. .

మరో వైపు చూస్తే జనసేనలోనూ ఈ జాబితా కలకలం రేపుతోంది అని అంటున్నారు. అందులో తమ పేర్లు లేవని మిగిలిన నాయకులు అంతా ఆందోళన చెందుతున్నారని అంటున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి తగిన న్యాయం చేయాలని ఆ పార్టీలోనూ అంటున్నారుట. మొత్తానికి ఈ జాబితా ఏంటో కానీ నెల్లిమర్లలో అత్యధిక మెజారిటీతో గెలిచిన కూటమిలో ఆదిలోనే విభేదాలు మొదలవుతున్నాయని అంటున్నారు.