టీడీపీలో ఈ త్యాగమూర్తులకు పదవులు రెడీ..!
ఒకటి .. పార్టీ ప్రధాన కార్యదర్శి.. నాగబాబు. ఈయన అనకాపల్లి ఎంపీ స్తానం నుంచిపోటీ చేయాలని అనుకున్నారు
By: Tupaki Desk | 9 Jun 2024 1:30 AM GMTతాజాగా జరిగిన ఎన్నికల్లో వారు పోటీ చేయలేదు. పైగా.. వేరే వారి కోసం.. త్యాగాలు చేశారు. దీంతో ఇలాం టి వారిని బుజ్జగిస్తూ.. కొందరికి మంత్రి పదవులు ఇస్తామని.. పార్టీల నాయకులు హామీలు ఇచ్చినట్టు సమా చారం. దీంతో ఇప్పుడు వీరంతా కూడా.. మంత్రి వర్గంలో రేసులో ఉన్నారని తెలుస్తోంది. జనసేన నుంచి ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. ఒకటి .. పార్టీ ప్రధాన కార్యదర్శి.. నాగబాబు. ఈయన అనకాపల్లి ఎంపీ స్తానం నుంచిపోటీ చేయాలని అనుకున్నారు.
కానీ.. పార్టీ కూటమి ప్రభావంతో నాగబాబు వదులుకున్నారు. ఇక, పవన్ పిఠాపురంలో విజయం దక్కించు కున్నారు. మంత్రి వర్గంలో మెగా కుటుంబం ఉండాలనే డిమాండ్ కాపుల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో ఇటు పవన్.. లేదా.. నాగబాబులకు అవకాశం లభిస్తుంది. అయితే.. పవన్ మంత్రివర్గంలో చేరే అవకాశం లేదు. సినిమాలు, షూటింగులు ఉండడంతో పవన్ మంత్రి వర్గానికి దూరంగా ఉండి.. తన సోదరుడు నాగబాబును ఇటు వైపు పంపించే అవకాశం ఉంది.
గవర్నర్ నామినేట్ డెట్ కోటాలో ఆయనను మండలికి తీసుకుని.. మంత్రి వర్గంలో చోటు ఇచ్చే చాన్స్ ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. ఇక, టీడీపీలో వర్మ, యనమల రామకృష్ణుడులో యనమలకు ఖచ్చితంగా మంత్రి పీఠం రిజర్వ్ అయింది. ఆయన ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. దీంతో పెద్దగా ఇబ్బంది లేకుండానే ఆయనకు మంత్రి వర్గంలో చోట కల్పించే అవకాశం ఉంది. ఇదే క్రమంలో వర్మకు కూడా.. మంత్రి పదవి ఇవ్వాలని ఉన్నా.. తొలి రెండేళ్లు మాత్రం ఆయనకు అవకాశం కనిపించడం లేదు.
ఇదిలావుంటే.. ఉండి సీటును త్యాగం చేసిన.. మంతెన రామరాజుకు.. క్షత్రియ సామాజిక వర్గం కోటలో నామినేటెడ్ పదవి ఎదురు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఆయనకు పౌరసరఫరాల శాఖ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వునున్నట్టు సమాచారం. అదేవిధంగా తన సీటును త్యాగం చేసి.. బీజేపీకి ఇచ్చిన.. విజయవాడ వెస్ట్ మాజీఎమ్మెల్యే జలీల్ ఖాన్‌కు వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. మొత్తానికి త్యాగాలు చేసిన వారికి పదవులు రెడీగా ఉన్నాయని చెబుతున్నారు.