Begin typing your search above and press return to search.

బీజేపీతో పొత్తు.. ఉన్న‌ట్టా... లేనట్టా... టీడీపీ నేత‌ల్లో వ‌ణుకు స్టార్ట్‌...!

దీంతో అస‌లు పొత్తులు ఉన్నాయా? లేవా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రో వైపు.. ఎన్నిక ల షెడ్యూల్ కు ప్ర‌క‌ట‌నే త‌రువాయి అన్న‌ట్టుగా ఉంది.

By:  Tupaki Desk   |   16 Feb 2024 4:30 PM GMT
బీజేపీతో పొత్తు.. ఉన్న‌ట్టా... లేనట్టా... టీడీపీ నేత‌ల్లో వ‌ణుకు స్టార్ట్‌...!
X

టీడీపీ నాయ‌కులు ఏ ఇద్ద‌రు క‌లుసుకున్నా.. దాదాపు ఇదే చ‌ర్చ సాగుతోంది. బీజేపీతో పొత్తు ప్ర‌య‌త్నా లు ఎక్క‌డి వ‌ర‌కు వ‌చ్చాయ‌ని ప‌ర‌స్ప‌రం ప్ర‌శ్నించుకోవ‌డం గ‌మ‌నార్హం. అంతేకాదు, అస‌లు పొత్తు ఉన్న ట్టా..? లేన‌ట్టా? అన్న ప్ర‌శ్న‌లు కూడా ఉద‌యిస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్ర‌బాబు డిల్లీ వెళ్లి.. బీజేపీతో చ‌ర్చ‌లు జ‌రిపి.. దాదాపు వారం అయిపోయింది. ఈ నెల 7న ఆయ‌న ఢిల్లీకి వెళ్లారు. బీజేపీ అగ్ర‌నేత‌, కేంద్ర మంత్రి అమిత్‌షాతో అర్ధ‌రాత్రి వ‌ర‌కు చ‌ర్చలు జ‌రిపారు.

దీనిపై అనేక క‌థ‌నాలు వ‌చ్చాయి. బీజేపీ చేతులు క‌లిపేందుకు రెడీగానే ఉంద‌ని.. అయితే.. ప్ర‌స్తుతం పార్ల‌మెంటు స‌మావేశాలు జ‌రుగుతున్నందున‌.. త‌ర్వాత చ‌ర్చిద్దామ‌ని వాయిదా వేశార‌ని.. కొంద‌రు చెప్పుకొచ్చారు. మ‌రికొంద‌రు మాత్రం.. టికెట్ల పంప‌కాల వ‌ర‌కు వ్య‌వ‌హారం సాగుతోంద‌ని అంటున్నారు. ఇంత‌లోనే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా ఢిల్లీ వెళ్లిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది తెలియ‌దు.

దీంతో అస‌లు పొత్తులు ఉన్నాయా? లేవా? అనే సందేహాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. మ‌రో వైపు.. ఎన్నిక ల షెడ్యూల్ కు ప్ర‌క‌ట‌నే త‌రువాయి అన్న‌ట్టుగా ఉంది. దీంతో అభ్య‌ర్థులు కూడా త‌మ త‌మ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. సాధ్య‌మైనంత త్వ‌ర‌గా.. త‌మ‌కు టికెట్లు ప్ర‌క‌టించాల‌ని కోరుతున్నారు. కానీ, టీడీపీ ప్ర‌క‌టిం చేందుకు ముహూర్తాలు చూసుకుంటోంది. దీనికి కూడా పొత్తులే కార‌ణ‌మ‌ని అంటున్నారు. అయితే.. తాజాగా జాతీయ స్థాయిలో ఒక చర్చ సాగుతోంది. బీజేపీలో ఒక అగ్ర‌నాయ‌కుడు.. టీడీపీతో పొత్తుకు ఇష్టం ప‌డ‌డం లేద‌ని అంటున్నారు.

దీనికి వేరే వేరే కార‌ణాలు చెబుతున్నార‌నేది జాతీయ‌స్థాయి విశ్లేష‌కుల మాట‌. ఇక‌, అమిత్ షాతో జ‌రిగిన చంద్ర‌బాబు చ‌ర్చ‌ల సారాంశం.. కూడా ఒక్కొక్క‌టిగా లీకులు వ‌స్తున్నాయి. త‌మ‌కు డిప్యూటీ సీఎం ప‌ద విని ఇవ్వాల‌ని.. అమిత్‌షా ప‌ట్టుబ‌ట్టార‌నేది ప్ర‌స్తుతం బ‌య‌ట‌కు వ‌చ్చిన ఒక లీకు వార్త‌. దీనికి చంద్రబా బు ఆలోచించుకుని చెబుతామ‌ని అన్న‌ట్టుగా ఈ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇక‌, టికెట్ల విష‌యంలోనూ తేడా వ‌చ్చింద‌ని ఇంకొంద‌రు చెబుతున్నారు. దీంతో అటు బీజేపీ, ఇటు టీడీపీ కూడా ఏమీ మాట్లాడ‌లేద‌ని అంటున్నారు. ఏదేమైనా ఈపొత్తుల వ్య‌వ‌హారం ఎటూ తేల‌క‌పోవ‌డం.. టీడీపీలో చ‌ర్చ‌కు.. నాయ‌కుల టెన్ష‌న్‌కు కార‌ణ‌మైంది.