Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్: రాష్ట్రపతితో నారా లోకేష్ భేటీ!

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   26 Sep 2023 11:42 AM GMT
బిగ్ బ్రేకింగ్: రాష్ట్రపతితో నారా లోకేష్ భేటీ!
X

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఆ సమయంలో బాబు ఆహారం, మెడిసిన్స్ వంటివి క్యార్ వేన్ నుంచి పంపించే ఏర్పాట్లు పర్యవేక్షించారు నారా లోకేష్. అనంతరం హస్తినకు బయలుదేరి వెళ్లిపోయారు. గత కొన్ని రోజులుగా ఆయన అక్కడే ఉంటున్నారు. ఈ సమయంలో తాజాగా రాష్ట్రపతితో భేటీ అయ్యారు.

అవును... ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసుకు సంబంధించి చంద్రబాబు న్యాయవాదులు సుప్రీం కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం హస్తినలో ఉన్న లోకేష్... అక్కడ సీనియర్ న్యాయవాదులతో సమాలోచనలు చేస్తున్నారని అంటున్నారు. ఆ పిటిషన్ రేపు విచారణకు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. మరోపక్క రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నారా లోకేష్ భేటీ అయ్యారు.

ఇందులో భాగంగా... మంగళవారం టీడీపీ ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్ర కుమార్‌ లతో కలిసి లోకేష్, రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు అరెస్టు విషయాన్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారని తెలుస్తుంది. ఈ క్రమంలో ఆధారాలు లేకున్నా అవినీతి బురదజల్లే లక్ష్యంతో అరెస్టు చేశారని చెబుతున్న టీడీపీ నేతలు... ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరారు.

ఇదే సమయంలో... రాష్ట్రంలో ప్రతిపక్షాలను ప్రభుత్వం అణిచివేస్తుందని, ఆందోళనలు చేసే కనీస స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తోందని లోకేష్ తెలిపారట. ఈ మేరకు రాష్ట్రంలో పరిస్థితులను జోక్యం చేసుకోవాలని కోరిన లోకేష్... ఇదే సమయంలో తమను రోడ్డుమీదకు రాకుండా వైసీపీ ప్రభుత్వం అడ్డుకుంటుంటుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఫిర్యాదు చేశారని తెలిపారు.

కాగా... అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో అక్రమాలు జరిగాయంటూ నమోదైన కేసుల్లో తాజాగా టీడీపీ నేత నారా లోకేష్ నిందితుడిగా సీఐడీ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనను ఏ-14 నిందితుడిగా చేరుస్తూ సీఐడీ అధికారులు ఇవాళ విజయవాడ ఏసీబీ కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ విషయంపైనా ట్విట్టర్ వేదికగా లోకేష్ స్పందించారు.

యువగళం పేరు చెబితే జగన్ గజగజలాడిపోతున్నారని.. అందుకే యువ‌గ‌ళం తిరిగి ఆరంభిస్తామ‌నే స‌రికి.. తన శాఖ‌కి సంబంధంలేని, అస‌లు వేయ‌ని రింగ్ రోడ్డు కేసులో తనను ఏ-14గా చేర్పించారని అన్నారు.

మరోవైపు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో చంద్రబాబు వేసిన బెయిల్ పిటిషన్ తాజాగా వాయిదా పడింది. ఈ పిటిషన్ పై విచారణను రేపటికి వాయిదా వేసింది ఏపీ హైకోర్టు. దీంతో రేపు మధ్యాహ్నం ఈ పిటిషన్ బెంచ్ ముందుకు వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు!