Begin typing your search above and press return to search.

15 మంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ టార్గెట్ ?

ఏపీ శాసన మండలిలో విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ వైసీపీకి మెజారిటీ ఉంది. పైగా మండలి చైర్మన్ మోషెన్ రాజు వైసీపీకి చెందిన వారు

By:  Tupaki Desk   |   13 July 2024 3:48 AM GMT
15 మంది వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ టార్గెట్ ?
X

ఏపీ శాసన మండలిలో విచిత్రమైన పరిస్థితి ఉంది. అక్కడ వైసీపీకి మెజారిటీ ఉంది. పైగా మండలి చైర్మన్ మోషెన్ రాజు వైసీపీకి చెందిన వారు. దాంతో మండలిలో అధికారం పూర్తిగా వైసీపీదే అవుతుంది. అక్కడ టీడీపీ విపక్షంలో ఉంది. తాజాగా గెలిచిన ఒక సీటుతో కలుపుకుంటే తొమ్మిది మంది ఎమ్మెల్సీలు అవుతారు. మిత్రపక్షం జనసేనతో కూడిత ఆ సంఖ్య పది అవుతుంది. ఇక పీడీఎఫ్ నుంచి ఇద్దరు, మరో నలుగురు ఇండిపెండెంట్లు అలాగే ఎనిమిది మంది దాకా నామినేటెడ్ ఎమ్మెల్సీలు ఉన్నారు. మరో నాలుగు ఖాళీలు ఉన్నాయి. ఇదీ మండలిలో రాజకీయ పార్టీల బలాబలాలు.

మొత్తం 58 మంది సభ్యులు ఉన్న మండలిలో మెజారిటీ సాధించాలి అంటే మ్యాజిక్ ఫిగర్ 30గా ఉండాలి. ప్రస్తుతం నాలుగు ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఆ సంఖ్య ఇంకా తగ్గుతుంది. 28 మంది ఉంటే సరిపోతుంది. ఇపుడు టీడీపీ ప్లస్ జనసేనకు కలిపి పది మంది ఉన్నారు కాబట్టి వైసీపీ నుంచి 15 మంది దాకా ఎమ్మెల్సీలను లాగేయాలని చూస్తున్నారు అని ప్రచారం సాగుతోంది.

ఇప్పటికి అయితే అయిదుగురు టచ్ లోకి వచ్చారని అంటున్నారు. వీరంతా రాయలసీమకు చెందిన వారే కావడం విశేషం. ఇందులో మైనారిటీకి చెందిన వారే ముగ్గురు ఉన్నారు. సో వైసీపీ పునాదులే కదిలించేలా ఈ అయిదుగురు వెళ్ళిపోయేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు అని అంటున్నారు.

అయితే ఈ అయిదుగురితో టీడీపీ కూటమి బలం ఏ మాత్రం పెరగదు. జస్ట్ 15కి చేరుకుంటుంది. అందుకే మరో పది మందిని వీరితో పాటుగా ఆకర్షించి ఒకేసారి చేర్చుకుంటే అపుడు మండలి చైర్మన్ మీద అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తొలగించాలని కూడా ప్లాన్ చేస్తున్నారు అని అంటున్నారు.

ఎందుకంటే మండలి చైర్మన్ వైసీపీకి చెందిన వారు. ఆ పార్టీ నుంచి జంపింగ్స్ ఉంటే కనుక ఆయన అనర్హత వేటు వేస్తారు. దాంతో ఇబ్బంది అవుతుందని భావిస్తున్నారు. ఆయా ఖాళీలలో తిరిగి కూటమి వారే గెలిచినా ఈ లోగా మండలిలో బిల్లులకు అవరోధం ఏర్పడుతుందని అంటున్నారు.

పైగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో పాటు అమరావతి రాజధాని సహా అనేక కీలకమైన అంశాలలో బిల్లులు మండలిలో ఆమోదం పొందాల్సి ఉంది. వాటిని కచ్చితంగా వైసీపీ అడ్డుకుంటుంది. అందుకే మండలిలో ఆకర్ష్ మంత్రను ప్రయోగించడం ద్వారా వైసీపీని వీక్ చేయాలని మొత్తం శాసన మండలిని తమ గుప్పిటలోకి తెచ్చుకోవాలని టీడీపీ కూటమి పావులు కదుపుతోంది అని అంటున్నారు.

ఈ నెల 22 నుంచి శాసన సభ శాసన మండలి సమావేశాలు మొదలు కాబోతున్నాయి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక మండలి సమావేశాలు మొదలు కావడం బడ్జెట్ సెషన్ నుంచే ఆరంభం. దాంతో మండలిలో తన బలాన్ని ఈ లోగానే పెంచుకునేందుకు టీడీపీ చూస్తోంది అని అంటున్నారు. వైసీపీ దీనిని ఎలా అడ్డుకుంటుంది. అధినాయకత్వం తమ వారు చేజారకుండా ఏ విధమైన హామీని ఇస్తారు అన్నది చూడాలని అంటున్నారు.