పవన్ అతి ఉత్సాహానికి టీడీపీ బ్రేకులు
టీడీపీ ఈ విషయంలో పక్కా క్లారిటీ ఇచ్చినట్లు అయింది. అదే సమయంలో జనసేన కామెంట్స్ కి పవన్ వ్యాఖ్యలకు భిన్నంగానే టీడీపీ స్పందించింది అని అంటున్నారు.
By: Tupaki Desk | 15 July 2023 1:36 PM GMTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ విషయంలో అతి ఉత్సాహం ఎక్కువ అని విమర్శలు వస్తూంటాయి. తన వద్దకు వచ్చే స్థానిక సమస్యలను ఆయన తన మీటింగులలో రాష్ట్రవ్యాప్తంగా ఇష్యూ చేస్తారని ఇప్పటికే పేరు పడ్డారు. అలా పవన్ చేసిన అతి పెద్ద విమర్శ ఏపీ రాజకీయాలలో హీటెక్కించింది. వాలంటీర్ల ద్వారా ఏపీలో సంఘ విద్రోహక శక్తులు డేటా సేకరించి వుమెన్ ట్రాఫికింగ్ కి పాల్పడుతున్నారని పవన్ ఆరోపించారు.
అది కాస్తా చివరికి అతి పెద్ద వివాదానికి దారితీసింది. వాలంటీర్లు అంతా రోడ్ల మీదకు వచ్చారు. పవన్ని పట్టుకుని నానా మాటలు అన్నారు. మరో వైపు చూస్తే వైసీపీ కూడా పవన్ని టార్గెట్ చేసింది. ఆయన మీద మంత్రుల నుంచి అంతా కలసి విరుచుకుపడ్డారు. ఒక విధంగా ఈ ఆరోపణలు జనసేనకు బూమరాంగ్ గా మారాయని అంటున్నారు.
అదే సమయంలో సచివాలయాలు రద్దు చేస్తామని కూడా పవన్ స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. దీంతో అతి పెద్ద సెక్షన్ మీదనే పవన్ బాంబులాంటి మాటలు వేసి వారిని దూరం చేసుకున్నారన్న విమర్శలు వచ్చాయి. ఈ నేపధ్యంలో వైసీపీ సచివాలయ వ్యవస్థకు వాలంటీర్ల వ్యవస్థకు జనసేన, టీడీపీ వ్యతిరేకం అయితే వాటిని తాము అధికారంలోకి వచ్చాక రద్దు చేయమని చెప్పగలరా అని సవాల్ చేశారు.
దీనికి జనసేన నుంచి రెస్పాన్స్ రాలేదు కానీ టీడీపీ రియాక్ట్ అయింది. చంద్రబాబు అయితే తాము అధికారంలోకి వస్తే వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పారు. అంతే కాదు, వరిని పౌర సేవలకు పూర్తి స్థాయిలో ఉపయోగించుకుంటామని చెప్పుకొచ్చారు. అంతే కాదు ఈ వ్యవస్థలో ఉన్న లోటు పాటులను కూడా సవరిస్తామని ఆయన చెప్పడం ద్వారా టీడీపీ ఈ విషయంలో పక్కా క్లారిటీ ఇచ్చినట్లు అయింది. అదే సమయంలో జనసేన కామెంట్స్ కి పవన్ వ్యాఖ్యలకు భిన్నంగానే టీడీపీ స్పందించింది అని అంటున్నారు.
వాలంటీర్ల వ్యవస్థ ఎందుకు అని పవన్ ప్రశ్నిస్తే దాన్ని కొనసాగిస్తామని చంద్రబాబు చెప్పడం ద్వారా పవన్ అతి ఉత్సాహనికి బ్రేకులు వేశారని అంటున్నారు అదే సమయంలో వాలంటీర్ల వ్యవస్థను మరింత సమర్ధంగా కొనసాగిస్తామని చెప్పడం ద్వారా గుడ్ అడ్మినిస్ట్రేటర్ అన్న తన ఇమేజ్ ని ఆయన మరోమారు గుర్తుకు తెచ్చారని అంటున్నారు. మంచి పాలకుడు వ్యవస్థలో లోపాలని సరి చేస్తారు కానీ వాటిని నాశనం చేయరు అన్నది తెలిసిందే.
మొత్తం మీద వాలంటీర్ల వ్యవస్థ మీద ఏపీలో అగ్గి రాజుకుంటే టీడీపీ మాత్రం చాలా తెలివిగానే ఈ వ్యవహారంలో తమ స్టాండ్ చెప్పి వాలంటీర్లను దూరం చేసుకోలేదు అని అంటున్నారు. అదే టైం లో జనసేన మాత్రం వాలంటీర్ల మీద పెద్ద విమర్శలు చేసి పలుచన అయింది అని అంటున్నారు. మరి వాలంటీర్ల వ్యవస్థ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్న జనసేన టీడీపీ కూటమిగా ఏర్పడితే మాత్రం మళ్లీ డౌట్లు వస్తాయి. అపుడు కచ్చితంగా పవన్ టీడీపీ స్టాండ్ నే అనుసరించాల్సి ఉంటుందని అంటున్నారు.