Begin typing your search above and press return to search.

టీడీపీ పొలిటికల్ యాక్షన్ స్టార్ట్... ఫైర్ బ్రాండ్స్ అంతా అక్కడే...!

చంద్రబాబు రిమాండ్ లో ఉన్న పదిహేను రోజులకు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని ప్రకటించారు.

By:  Tupaki Desk   |   24 Sep 2023 10:18 AM GMT
టీడీపీ పొలిటికల్ యాక్షన్ స్టార్ట్... ఫైర్ బ్రాండ్స్ అంతా అక్కడే...!
X

చంద్రబాబు రిమాండ్ లో ఉన్న పదిహేను రోజులకు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీని ప్రకటించారు. సీనియర్ మోస్ట్ నేత యనమల రామక్రిష్ణుడు, ఏపీ టీడీపీ ప్రెసిడెంత్ అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ఎం ఏ షరీఫ్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలక్రిష్ణ, వంగలపూడి అనిత వంటి వారికి చోటు దక్కింది.

మొత్తం పద్నాలుగు మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు. ఈ కమిటీ ఇపుడు యాక్షన్ లోకి దిగుతుంది అన్న మాట. పొలిటికల్ గా ఏమి చేయాలన్న దాని మీద ఈ కమిటీ చర్చించడమే కాకుండా ఏపీలోని పరిస్థితులను ఎప్పటికపుడు మానిటరింగ్ చేస్తూ బాబు అరెస్ట్ నేపధ్యంలో ప్రజల మద్దతుని కూడగట్టే కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుంది అంటున్నారు.

అంతే కాదు పొత్తులో కలిసిన జనసేనను కూడా కలుపుకుని కార్యక్రమాలు నిర్వహిస్తుందా అన్నది చూడాలి. జనసేన టీడీపీ ఉమ్మడి కార్యాచరణ అని అంటున్నారు. దాంతో ఇవతల వైపున యనమల అవతల వైపు నుంచి నాదెండ్ల మనోహర్ కలసి రెండు పార్టీల పొలిటికల్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేస్తారు అని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీలో ఎక్కువగా ఫైర్ బ్రాండ్స్ కే చోటు ఇచ్చారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, వంగలపూడి అనిత వంటి వారు ఇందులో ఉండడం విశేషం. అలాగే అచ్చెన్నాయుడు ధాటీగా మాట్లాడితే పయ్యావుల కేశవ్ మీడియా ముఖంగా మంచి విశ్లేషణలు ఇస్తూ సూచనలు చేస్తారని తీసుకున్నట్లుగా తెలుస్తోంది.

ఇక చంద్రబాబు తరువాత తానే పార్టీలో అని సారధ్య బాధ్యతల విషయంలో ఉత్సాహం దూకుడు చూపించిన బాలయ్యకు ఆరవ మెంబర్ గా ఈ కమిటీలో చోటు కల్పించారు. అంటే బాలయ్య అందరిలో ఒకడిగానే ఉన్నారు తప్ప నందమూరి వారసుడిగా లీడ్ రోల్ లో లేరా అన్న చర్చ కూడా సాగుతోంది.

ఇంకో వైపు చూసుకుంటే ఈ కమిటీ రానున్న రోజులలో ప్లాన్ ఆఫ్ యకషన్ రూపొందిస్తుందా లేక నేరుగా యాక్షన్ లోకి దిగుతుందా. జనంలో మరింత దూకుడుగా టీడీపీ వెళ్ళేందుకు వ్యూహ రచన చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. మొత్తానికి చంద్రబాబు అరెస్ట్ తరువాత గడచిన పదిహేను రోజులుగా కొంత అయోమయంగా గందరగోళంగా కంపిస్తున్న టీడీపీలో ఇపుడు యాక్షన్ కమిటీ ఏర్పడడం వల్ల ఫోకస్ పెట్టి తమ్ముళ్లను ముందుకు నడిపించే విధంగా కార్యాచరణ ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.