Begin typing your search above and press return to search.

చనిపోయిన గీతాంజలి మీద విషం కక్కుతున్న టీడీపీ!

దీంతో... టీడీపీ, జనసేనలకు చెందిన వారి సోషల్ మీడియా ట్రోలింగ్ దాడివల్లే గీతాంజలి మరణించిందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   13 March 2024 9:15 AM GMT
చనిపోయిన గీతాంజలి మీద  విషం కక్కుతున్న టీడీపీ!
X

ఏపీ సర్కార్ వల్ల లబ్ధి పొంది, ఆ ఆనందాన్ని బహిరంగంగా వెల్లడించడమే ఆమె చేసిన నేరమని భావించాలో... లేక, సమాజంలో విచ్చలవిడి తనం, బరితెగింపుతత్వం వెర్రి తలలు వేసుకుని నెట్టింట తిరుగుతుందన్న విషయం ఆమె గ్రహించలేకపోవడమే తప్పైందో తెలియదు కానీ... గీతాంజలి అనే మహిళ మృతి చెందింది. ఈ విషయం, ఆమె మృతికి కారణమైన వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

దీంతో... టీడీపీ, జనసేనలకు చెందిన వారి సోషల్ మీడియా ట్రోలింగ్ దాడివల్లే గీతాంజలి మరణించిందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసుల ప్రాథమిక విచారణలో ఇదే విషయం తేటతెల్లమైనట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో అక్కడితో ఆగని టీడీపీ సోషల్ మీడియా టీంలు... తమ ట్విట్టర్ అకౌంట్ లో ఫేక్ వీడియోలు సైతం తయారు చేసి, దానికి వాయిస్ మిక్సింగ్ చేసి, ఆమె వ్యక్తిత్వం దెబ్బ తినేలా ప్రచారం చేస్తున్నారు అని అంటున్నారు!

టీడీపీ, జనసేన సోషల్ మీడియా జనాల వేధింపులు భరించలేక గీతాంజలి మరణించిందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నప్పటికీ... ఇంకా వాళ్ళు ఆమెను వదల్లేనట్లున్నారు! ఫేక్ వీడియోలు సైతం తయారుచేసి, దానికి వాయిస్ మిక్సింగ్ చేసి ఆమె వ్యక్తిత్వం మరింత దెబ్బ తినేలా ప్రచారం చేస్తున్నారు! ఇదే సమయంలో... ఆమెను ప్రతీరోజు వైసీపీ సోషల్ మీడియా ఆఫీసుకి తీసుకెళ్లేవారని పోస్టులు పెడుతున్నారు.

గీతాంజలి అనే మహిళ మృతికి టీడీపీ, జనసేనకు చెందిన సోషల్ మీడియా జనాలు చేసిన వల్గర్ ట్రోలింగే కారణం అని ఆరోపణలు వస్తున్న సమయంలో... అది తమ పార్టీకి చెందిన వారి పని కాదని చెప్పాలి.. లేకపోతే, తమ పార్టీకి చెందిన వారని తెలితే కఠిన చర్యలు తీసుకుంటామని అయినా అనాలి. అలా కాకుండా... ఒకపక్క టీడీపీ, జనసేనల వల్లే గీతాంజలి మృతి చెందిందని ఆరోపిస్తున్న నేపథ్యంలో... ఆమెపై బురద జల్లడం అంటే... ఆ ఆరోపణలను అంగీకరించినట్లే కదా!

దీంతో... నాడు ఎన్టీఆర్ ని గద్దె దింపిన సమయంలో సమాజం నుంచి చీత్కారాలు ఎదుర్కోవాల్సి వస్తుందేమోనని గ్రహించిన చంద్రబాబు... ఎన్టీఆర్ పై బురదజల్లే పనికి పూనుకున్నారని గుర్తుచేస్తున్నారు నెటిజన్లు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ కు విలువలు లేవని, ఆయన స్త్రీ లోలుడని, వ్యక్తిత్వంలేని మనిషని కథనాలు రాయించారని.. ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారని అంటున్నారు. ప్రజారాజ్యం సమయంలోనూ చిరంజీవిని సైతం ఇలాగే డ్యామేజ్ చేసి పరువు తీశారని నొక్కి చెబుతున్నారు.

ఈ క్రమంలోనే నేడు గీతాంజలి అనే మహిళ ఘోరంగా ట్రోల్ చేసి హింసించడం వల్ల మృతి చెందిందని ప్రాథమిక విచారణలో తేలినట్లు చెబుతున్నప్పటికీ... ఆమె మరణించిన తర్వాత కూడా ఆమె వ్యక్తిత్వ హనానికి పాల్పడటం చేస్తున్నారు. దీని పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. దీంతో... ఇంతకు మించిన నిస్సిగ్గు చర్య మరొకటి ఉండదని అంటున్నారు ప్రజానికం!