సీమలో పుంజుకున్న టీడీపీ... రవి ప్రకాశ్ జోస్యం!
సీమలో వాస్తవానికి వైసీపీకి పట్టు ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే 2022లో మూడు సీట్లు మినహా.. 49 స్థానాలు దక్కించుకుంది.
By: Tupaki Desk | 3 May 2024 4:56 AM GMTరాయల సీమ. మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాల సమాహారంగా ఉన్న సీమలో ఈ దఫా టీడీపీ పుంజుకుం టుందని సీనియర్ జర్నలిస్టు.. ఒకప్పటి టీవీ 9 సీఈవో రవిప్రకాశ్ జోస్యం చెప్పారు. ఆయన వేసుకున్న అంచనాల మేరకు ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయో కూడా వివరించారు. నిజానికి తెలంగాణలో ఆయన సర్వే చేసినట్టు చెప్పుకొచ్చారు. ఇక్కడ బీఆర్ ఎస్‌కు ఈ సారి కూడా మంచి ఊపు వచ్చిందని చెప్పిన ఆయన తర్వాత.. ఏపీ గురించి ముఖ్యంగా రాయలసీమలోని 52 అసెంబ్లీ నియోజవర్గాల జాతకాన్ని వివరించారు.
సీమలో వాస్తవానికి వైసీపీకి పట్టు ఎక్కువగా ఉంది. ఈ క్రమంలోనే 2022లో మూడు సీట్లు మినహా.. 49 స్థానాలు దక్కించుకుంది. ఆ మూడు కూడా.. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్ నాయకుడు బాలకృష్ణ(హిందూపురం), పయ్యావుల కేశవ్(ఉరవకొండ)లు విజయందక్కించుకున్నారు. మిగిలిన అన్నీ కూడా.. వైసీపీ ఖాతాలో పడ్డాయి. అయితే.. ఈసారి మాత్రంటీడీపీ పుంజుకుందనేది రవి ప్రకాశ్ చెబుతున్న మాట. ఆయన అంచనాల మేరకు ఈ దఫా.. టీడీపీ 22 స్థానాల్లో విజయం దక్కించుకుంటుందని అంటున్నారు.
ప్రధానంగా కడపలోనే వైసీపీకి ఎదురు గాలి వీస్తోందని అంటున్నారు. ఇది సీఎం జగన్ సొంత జిల్లా ఇక్కడ మొత్తం 10 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. టీడీపీకి మూడు దక్కుతాయని రవి ప్రకాశ్ అంచనా వేశారు. ఇక, కర్నూలులోనూ టీడీపీ పుంజుకుందని అంటున్నారు. ఇక్కడ కూడా 14 సీట్లు ఉండగా.. నాలుగు చోట్ల సైకిల్ గెలుస్తుందని అంచనా వేశారు. మిగిలిన స్థానాల్లో వైసీపీ గెలుపు గుర్రం ఎక్కుతుందని చెబుతున్నారు.
అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉండగా.. టీడీపీ-వైసీపీలు 7 చొప్పున దక్కించుకుంటాయనేది రవిప్రకాశ్ అంచనా. ఇక, అనంతపురం విషయానికి వస్తే.. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఒక సీటును దక్కించుకుం టుందని సంచలన విషయం చెప్పారు. అసలు పార్టీకి బేస్ పోయిన విషయం తెలిసిందే కానీ.. ఈ దఫా పుంజుకుంటుందని తెలిపారు. ఇక, టీడీపీ ఏడు-వైసీపీ ఐదు స్థానాలు మాత్రమే దక్కించుకుంటుందని తేల్చేశారు.
ఇక, నియోజకవర్గాల వారీగా చూస్తే.. కుప్పంలో చంద్రబాబు మరోసారి విజయందక్కించుకుంటారు. పుంగనూరు పెద్దిరెడ్డికి తిరుగులేదు. నగరిలో మాత్రం మంత్రి రోజా ఈ దఫా ఓడిపోతుందని అంటున్నారు. ఇదిఅందరూ చెబుతున్న మాట కావడం గమనార్హం. అదేవిధంగా పీలేరులో ఈ సారి మాజీ సీఎం తమ్ముడు నల్లారి కిశోర్‌విజయం దక్కించుకుంటారన్నది.. రవిప్రకాశ్ అంచనా.
అనంతపురం జిల్లాకు వస్తే.. మాజీ మంత్రి పరిటాల సునీత మరోసారి రాప్తాడులో పరాజయం పాలవుతా రని రవి ప్రకాశ్ చెబుతున్నారు. అయితే.. మడకశిర(ఎస్సీ)లో మాత్రం కాంగ్రెస్‌విజయం దక్కించుకుం టుందని అంటున్నారు. ఇక, వారసులు పోటీచేస్తున్న చంద్రగిరిలో మోహిత్‌రెడ్డి, తిరుపతిలో భూమన అభినయ్ రెడ్డి విజయం ఖాయమని అంటున్నారు.
తెలంగాణలో పరిస్తితి ఇదీ..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం చవిచూసిన కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ ఎస్.. పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకుంటుందనిరవిప్రకాశ్ వివరించారు. మొత్తం 17 స్తానాల్లో 8 చోట్ల బీఆర్ ఎస్ విజయం దక్కించుకుంటుందని, కాంగ్రెస్, బీజేపీలు నాలుగు చొప్పున గెలుస్తాయని అంచనా వేశారు. ఇక, ఎంఐఎం హైదరాబాద్ స్థానాన్ని నిలబెట్టుకుంటుందన్నారు.
ఇదేసమయంలో ఖమ్మం, నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్‌లలో బీఆర్ ఎస్ గట్టి ప్రయత్నం చేసినా.. ప్రయోజనం లేదన్నారు ఇక్కడ రెండో స్థానానికే ఈ పార్టీ పరిమితం అవుతుందని తేల్చేశారు. అదేసమయంలో సికింద్రాబాద్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల, సికింద్రాబాద్ కంటోన్మెంట్(అసెంబ్లీ), నిజామాబాద్ లలో బీజేపీ గెలుపు గుర్రం ఎక్కుతుందని చెప్పారు.