సర్వే బెట్టింగ్ యాప్ తో గేమ్స్ ఆడుతున్న టీడీపీ?
ఇప్పటిదాకా తమకు అనుకూలంగా సర్వేలు విడుదల చేస్తూ వస్తున్న టీడీపీ ఇప్పుడు సర్వే బెట్టింగ్ యాప్ తో కొత్త గేమ్స్ కి రంగం సిద్ధం చేసింది అని అంటున్నారు.
By: Tupaki Desk | 2 Feb 2024 1:34 PM GMTతెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు రకరకాలైన వ్యూహాలతో ముందుకు వస్తోంది. ఇప్పటిదాకా తమకు అనుకూలంగా సర్వేలు విడుదల చేస్తూ వస్తున్న టీడీపీ ఇప్పుడు సర్వే బెట్టింగ్ యాప్ తో కొత్త గేమ్స్ కి రంగం సిద్ధం చేసింది అని అంటున్నారు.
వాస్తవంగా చూస్తే స్పోర్ట్స్ బెట్టింగ్ యాప్స్ ఉంటాయి. కానీ చూస్తే కనుక ఇపుడు అవి మరింతగా మారి కొత్త రూపాంతరం సంతరించుకున్నాయి. ఈ మధ్యకాలంలో పొలిటికల్ బెట్టింగ్ సర్వే యాప్స్ కొన్ని వచ్చాయి అని అంటున్నారు . దీంతో వాటిని చూసి చాలా మంది పెద్ద ఎత్తున వాటిలో బెట్టింగ్ కాస్తున్నారు. ఇక టీడీపీ విషయం చూస్తే టెక్నికల్ గా పవర్ టీం తో ఉన్నది. దాంతో ఆ పార్టీ ఈ పొలిటికల్ యాప్స్ లో కొంత ఇన్వెస్ట్ చేసి సర్వేలను తమకు అనుకూలంగా వదులుతోంది ఆని ఒక ప్రచారం నడుస్తుంది . ఇలా ఈ పొలిటికల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా వైసీపీకి వచ్చే ఎన్నికల్లో 61 నుంచి 64 సీట్లు మాత్రమే వస్తాయని ఒక నంబర్ ని చెబుతూ వస్తోంది అని అంటున్నారు.
దానివల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీ గెలిచే పరిస్థితి లేదన్నది తెలియచేయడమే ఈ బెట్టింగ్ యాప్స్ వెనక ఉద్దేశ్యం అని అంటున్నారు. ఇలాంటి చర్చలు ఎక్కడో పెట్టడం లేదు ఆయన నియోజకవర్గాలలో వైసీపీ కీలక నేతల ఇళ్ళ వద్దనే పెడుతున్నారు. ఎన్ని చేసినా ఈసారి వైసీపీ వచ్చే చాన్స్ అయితే లేదు అంటూ పొలిటికల్ సర్వేలను బెట్టింగ్ యాప్ ద్వారా వదులుతున్నారు.
దీంతో ఈ పొలిటికల్ బెట్టింగ్ యాప్స్ ఇచ్చే ఫిగర్స్ మీద ఆయన వైసీపీ పెద్దల ఇళ్ళ వద్ద బాగా చర్చ సాగుతోంది. అయితే ఇదంతా టీడీపీ చేయిస్తోందని వైసీపీలో వాదించే వారు ఉన్నారు కానీ ఇది ఒక ట్రిక్ గా నిరంతరం వాడుతూ ముందుకు రావడం వల్ల ఒకానొక దశలో అందరూ నమ్మే పరిస్థితి అయితే ఉందని అంటున్నారు.
ఇలా సర్వేలను పొలిటికల్ బెట్టింగ్ యాప్స్ ద్వారా వదలడం వెనక వైసీపీని ట్రాప్ లోకి రావడమే టార్గెట్ గా ఉంది. వీటిని నమ్మితే కనుక వైసీపీ నుంచి కీలక నేతలు వచ్చి టీడీపీలో చేరిపోతారు అని అలా ఎక్కడికక్కడ పార్టీకి సానుకూలత రావడమే కాకుండా వైసీపీ కూడా వీక్ అవుతుందని ఎన్నికలు దగ్గర పడుతున్న నేపధ్యంలో ఒక్కసారి ట్రెండ్ మార్చేందుకు ఇది పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని టీడీపీ మాస్టర్ స్ట్రాటజీస్ భావిస్తున్నాయట.
ఇక ఇంతలా పొలిటికల్ గా బెట్టంగ్స్ వేసుకుంటూ సై అంటే సై అంటే కచ్చితంగా ఆ ప్రభావం కీలక నేతల మీద తప్పనిసరిగా పడుతుందని అంటున్నారు. అలా వైసీపీ నుంచి బిగ్ షాట్స్ బడా నేతలు అంతా టీడీపీలోకి జంప్ అయితే అది ఎన్నికల్లో టీడీపీ ఎంతో రాజకీయ లాభం కలిగిస్తుందని ఒక ఎత్తుగడతోనే ఇదంతా చేస్తున్నారు అని అంటున్నారు.
ఒక విధంగా చెప్పాలంటే ఇది మైండ్ గేమ్. . అయితే ఇది ప్రజలతో కాదు, వైసీపీలో ఉన్న బలగాలతోనే. మందీ మార్బలం దండీగా ఉన్న వారి మీద దీనిని ప్రయోగించడం ద్వారా వైసీపీని ఎక్కడికక్కడ బలహీనం చేసి పారేయడమే ఈ పొలిటికల్ బెట్టింగ్ యాప్స్ వెనక ఉన్న అసలు వ్యూహం అని అంటున్నారు.
మరి దీని విషయంలో ఎంతమంది నమ్మి ట్రాప్ లోకి వెళ్తారు అన్నది చూడాల్సి ఉంది. ఒక్కసారి కనుక వైసీపీ గెలవదు అన్నది భారీ ఎత్తున ప్రచారం సాగితే మాత్రం ఎన్నికల ముంగిట దాన్ని సర్దుకోవడం అధికార పార్టీ వల్ల కానే కాదు అని అంటున్నారు. అలా జరగాలనే టీడీపీ తరఫున ఉన్న వారు కోరుకుంటూ ఇలాంటి ట్రిక్స్ ని ప్రయోగిస్తున్నారు అని అంటున్నారు.