తిరుగుబాటు దారులపై టీడీపీ వేటు
కీలకమైన ఎన్నికల సమరంలో పార్టీ వ్యతిరేకకలాపాలకు పాల్పడుతూ రెబెల్స్ గా పోటీ చేస్తున్న వారిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం వేటు వేసింది.
By: Tupaki Desk | 30 April 2024 9:45 AM GMTకీలకమైన ఎన్నికల సమరంలో పార్టీ వ్యతిరేకకలాపాలకు పాల్పడుతూ రెబెల్స్ గా పోటీ చేస్తున్న వారిపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం వేటు వేసింది. ఈ మేరకు వారందరినీ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
అరకు నియోజకవర్గానికి చెందిన సివేరి అబ్రహాం, విజయనగరం నియోజకవర్గానికి చెందిన మీసాల గీత, అమలాపురం నియోజకవర్గానికి చెందిన పరమట శ్యాంకుమార్, పోలవరం నియోజకవర్గానికి చెందిన ముడియం సూర్య చంద్రరావు, ఉండి నియోజకవర్గానికి చెందిన వేటుకూరి వెంకట శివరామరాజు, సత్యవేడు నియోజకవర్గానికి చెందిన జడ్డా రాజశేఖర్ లపై వేటువేసింది.
ఈ ఎన్నికల్లో టీడీపీ ఐదుగురు అసెంబ్లీ అభ్యర్థులను మార్చింది. వెంకటగిరి, ఉండితో పాటు మాడుగుల, పాడేరు, మడకశిర స్థానాల్లో మార్పులు జరిగాయి. మడకశిర నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేసిన మాజీ ఎమ్మెల్యే ఈరన్న, ఆయన కుమారుడు సునీల్ కుమార్ నేడు తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు.