Begin typing your search above and press return to search.

బిగ్ బ్రేకింగ్... టీడీపీ మూడో జాబితా విడుదల!

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులో భాగంగా అభ్యర్థుల ప్రకటనలపై పలురకాల సందేహాలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే

By:  Tupaki Desk   |   22 March 2024 5:55 AM GMT
బిగ్ బ్రేకింగ్... టీడీపీ మూడో జాబితా విడుదల!
X

పొత్తులో భాగంగా 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లో పోటీ చేయనున్న టీడీపీ... ఇప్పటికే తొలివిడతలో భాగంగా 94, రెండో విడతలో భాగంగా 34 మొత్తం 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో తాజాగా మూడో జాబితానూ విడుదల చేసింది. ఇందులో భాగంగా... 11 అసెంబ్లీ స్థానాలతో పాటు 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.

అవును... ఎన్నికలు సమీపిస్తున్న వేళ పొత్తులో భాగంగా అభ్యర్థుల ప్రకటనలపై పలురకాల సందేహాలు తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పోటీ చేసే స్థానాల సంఖ్య ఫిక్స్ అయ్యింది కానీ... స్థానాల పేర్లు మాత్రం ఫైనల్ కాలేదని అంటున్నారు. ఈ సమయంలో టీడీపీ మూడో జాబితా విడుదలైంది. ఇందులో భాగంగా 11 అసెంబ్లీ, 13 లోక్ సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అంటే... మరో 5 అసెంబ్లీ, 4 లోక్ సభ స్థానలకు మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందన్నమాట.

అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల జాబితా:

శ్రీకాకుళం - గొండు శంకర్

పాతపట్నం - మామిడి గోవిందరావు

పలాస - గౌతు శిరీష

ఎస్ కోట - కోళ్ల లలిత కుమారి

కాకినాడ సిటీ - వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)

అమలాపురం - అయితాబత్తుల ఆనందరావు

పెనమలూరు - బోడె ప్రసాద్

మైలవరం - వసంత కృష్ణప్రసాద్

నరసరావుపేట - చదలవాడ అరవింద్ బాబు

చీరాల - ఎం మాలకొండయ్య యాదవ్

సర్వేపల్లి - సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

లోక్‌ సభ స్థానాల అభ్యర్థుల జాబితా:

శ్రీకాకుళం - కింజరాపు రామ్మోహన్‌ నాయుడు

విశాఖపట్నం - మతుకుమిల్లి భరత్

అమలాపురం - గంటి హరీష్ మాధుర్

విజయవాడ - కేశినేని శివనాథ్‌ (చిన్ని)

ఏలూరు - పుట్టా మహేష్ యాదవ్

గుంటూరు - పెమ్మసాని చంద్రశేఖర్

బాపట్ల - టి. కృష్ణ ప్రసాద్

నరసరావుపేట - లావు శ్రీకృష్ణ దేవరాయలు

నెల్లూరు - వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

కర్నూలు - బస్తిపాటి నాగరాజు

చిత్తూరు - దగ్గుమళ్ల ప్రసాదరావు

హిందూపురం - బీకే పార్థసారథి

నంద్యాల - బైరెడ్డి శబరి