Begin typing your search above and press return to search.

టీడీపీ వర్సెస్ వైసీపీ : హోం మంత్రి ఎవరంటే ?

అంటే జనసేన నుంచి పవన్ హోం మంత్రి కం డిప్యూటీ సీఎం కాబట్టి వైసీపీ నుంచి వంగా గీతను ఆ పార్టీ వారు చూపిస్తున్నారు అన్న మాట.

By:  Tupaki Desk   |   26 May 2024 4:06 AM GMT
టీడీపీ వర్సెస్ వైసీపీ :  హోం మంత్రి ఎవరంటే ?
X

ఆలూ లేదూ చూలూ లేదు అన్న మాటను మళ్లీ గుర్తు చేసుకోవాల్సిందే. ఎందుకంటే రాజకీయ పార్టీల హడావిడి చూసిన మీదట అదే అనాల్సి వస్తోంది. ఏపీలో పోలింగ్ మాత్రమే ముగిసింది. కౌంటింగ్ కి ఇంకా వారం పైగా టైం ఉంది. జూన్ 4 వరకూ ఎలా గడపను ఒక్క క్షణం అనుకుంటూ అధినేతలు నేతాశ్రీలు గంటలు ఘడియలూ లెక్కబెడుతున్నారు.

పగలూ రాత్రులను అలా నెట్టుకుంటూ వస్తున్నారు. క్యాలెండర్ లో రోజులను అలా భారంగా తిప్పుకుంటూ ఓపలేని నిరీక్షణ ఏంటో స్వయంగా అనుభవిస్తున్నారు. ఆ తంతు అలా సాగుతూంటే క్యాడర్ అసలు ఊరుకోదు కదా మా పార్టీ గెలిస్తే ఫలానా వారు మంత్రి అంటూ సోషల్ మీడియాలో లిస్ట్ ని ప్రకటించేస్తూ స్వయం ప్రకటిత ఉత్సాహాన్ని పొందుతున్నారు.

టీడీపీ కూటమి అధికారంలోకి వస్తే హో మంత్రి ఎవరు అన్న దాని మీద కూడా సోషల్ మీడియాలో ఒక్క లెక్కన చర్చ సాగింది. పవన్ కళ్యాణ్ హోం మంత్రి అని అంటూటే టీడీపీలో సీనియర్లతో మరో లిస్ట్ రిలీజ్ చేసారు ఆ తతంగం అలా సాగుతూండగానే వైసీపీ అధికారంలోకి వస్తే ఎవరు హోం మంత్రి అన్న చర్చ కూడా వాడిగా వేడిగా సాగుతోంది.

వైసీపీ తన తొలి అయిదేళ్ల పాలనలో ఇద్దరు హోం మంత్రులను నియమించింది. వారిద్దరూ మహిళలే కావడం విశేషం. అంతే కాదు ఎస్సీ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక ఈసారి కనుక వైసీపీకి అధికారం దక్కితే హోం మంత్రి మరోసారి మహిళలకే ఇస్తారు అని ప్రచారం చేస్తున్నారు.

అయితే ఆ మహిళా హోం మంత్రి ఎవరూ అంటే ఇంకెవరు పిఠాపురంలో పవన్ మీద వంగా గీత గెలిస్తే ఆమెకు హోం మంత్రితో కూడా డిప్యూటీ సీఎం పదవి ఖాయమని అంటున్నారు. బలమైన కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళకే ఈ హోం మంత్రి దక్కుతుందని అని అంటున్నారు. అంటే జనసేన నుంచి పవన్ హోం మంత్రి కం డిప్యూటీ సీఎం కాబట్టి వైసీపీ నుంచి వంగా గీతను ఆ పార్టీ వారు చూపిస్తున్నారు అన్న మాట.

ఇక మరో ప్రచారం కూడా తెర మీదకు తెస్తున్నారు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్న విడదల రజనీకి హోం మంత్రి పదవి ఇస్తారన్నదే కొత్త ప్రచారం. ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన మహిళ. ఆమెకు జగన్ తన కేబినెట్ లో వైద్య ఆరోగ్య శాఖల మంత్రిత్వ శాఖను ఇచ్చారు. అది కూడా కీలకమైనదే.

ఈసారి బీసీల నుంచి హోం మంత్రిని ఎంచుకుంటారు అని అంటున్నారుట. దాంతో విడదల రజనీకే ఆ చాన్స్ అని చెబుతున్నారు. వైసీపీ ఈసారి చాలా మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది. మరి వీరిలో ఎందరు తిరిగి గెలుస్తారు అన్నది ఒక చర్చగా ఉంది. అయితే కచ్చితంగా గెలిచే బీసీ మహిళా నేత విడదల రజనీ అని అందుకే ఆమెకు చాన్స్ అని ప్రచారం చేస్తున్నారు.

ఇలా సీఎం ల విషయం అయితే కన్ ఫర్మ్ కాబట్టి హోం మంత్రి పదవుల మీద అటు వైసీపీ ఇటు టీడీపీలో వాడి వేడిగా చర్చతో పాటు అంతే స్థాయిలో ప్రచారమూ సాగుతోంది. ఇంతకీ రిజల్ట్ రానీయండిగా బాబూ అని అంటున్న పెద్ద మనుషులూ వీరి వెనకాలే ఉన్నారు మరి.