టీడీపీలోనూ ఈ సిట్టింగ్‌కు సీట్లు గల్లంతేనా...
ప్రస్తుతం 151 మందిలో 11 మందిని మార్చేస్తున్నారన్న చర్చ దరిమిలా రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఔట్ అవుతారనేది.. ఆసక్తిగా ఉంది.
By: Tupaki Desk | 14 Dec 2023 11:30 AM GMTవైసీపీలో ఎంత మంది సిట్టింగులకు సీట్లు ఇస్తారు? ఎంతమందిని తిరిగి అసెంబ్లీకి పంపిస్తారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది. ప్రస్తుతం 151 మందిలో 11 మందిని మార్చేస్తున్నారన్న చర్చ దరిమిలా రాబోయే రోజుల్లో ఇంకెంతమంది ఔట్ అవుతారనేది.. ఆసక్తిగా ఉంది. ఈ టెన్షన్ ఇలా ఉంటే.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో కూడా ఈ చర్చ జరుగుతోంది.
ప్రస్తుతం టీడీపీకి 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో నలుగురు(వాసుపల్లి గణేష్, కరణం బలరాం, మద్దాలి గిరిదర్, వల్లభనేని వంశీ) పార్టీ నుంచి బయటకు వచ్చారు. మిగిలిన వారు 19 మంది.. వీరిలో ఒకరు చంద్రబాబు, మరొకరు బాలయ్య. ఈ రెండు సీట్లు ఖాయమే. మిగిలిన 17 స్థానాల్లో ఎంత మందికి టికెట్లు ఇస్తారు? అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం 12 నుంచి 15 మందికి సీట్లు కేటాయించనున్నట్టు తెలుస్తోంది.
అయితే.. మిగిలిన ఆ ఇద్దరినీ కూడా.. టికెట్లు కాదనే పరిస్థితి కనిపించడం లేదు. ఈ క్రమంలో ప్రత్యామ్నా యంగా మరో రూపంలో పదవులు ఇవ్వాలనేది పార్టీ నిర్ణయంగా ఉంది. వారిలో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే భవానీ భర్త ఈ దఫా పోటీకి రెడీ అవుతున్నారు. ఇక, రూరల్ నియోకవర్గం ఎమ్మెల్యే బుచ్చయ్యను ఈ సారి మండలికి పంపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిపై ఒక క్లారిటీ వచ్చాక.. ఈ సీటును జనసేనకు కేటాయించే అవకాశం ఉంది.
అంటే.. మొత్తంగా సిట్టింగుల్లో అందరికీ టికెట్లు దక్కే చాన్స్ ఉంది. ఇక, ఇదేసమయంలో ఈ సారి స్థాన చలనాలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెబుతున్నారు. విశాఖ ఉత్తరం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరా వును భీమిలి పంపించనున్నట్టు చర్చ సాగుతోంది. మరోవైపు.. ఉండి ఎమ్మెల్యేను వేరే స్తానానికి పంపిస్తారని, లేదా.. ఈ సారి ఆయనను పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదని అంటున్నారు. మొత్తానికి మార్పులు ఉన్నప్పటికీ. దాదాపు అందరికీ టికెట్లు దక్కడం ఖాయమనే వాదన వినిపిస్తోంది.