వైసీపీ వర్సెస్ టీడీపీ.. కార్యకర్తలు రెచ్చిపోతోంది ఇందుకేనా?
ఓవర్ కాన్ఫిడెన్స్ లెవిల్స్ పెరిగిపోయాయి. అధికార పార్టీ వైసీపీ లోను, ప్రతిపక్షం టీడీపీ లోనూ.. ఇదే కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.
By: Tupaki Desk | 5 Aug 2023 6:22 AM GMTవచ్చే ఎన్నికల్లో గెలిచేస్తామన్న ధీమా ఉండడం తప్పుకాదు. అసలు ఆ ధీమానే లేకపోతే.. పార్టీలకు ఆక్సిజనే లేకుండా పోతుంది. అయితే.. ఇప్పుడు ఏపీ లో రాజకీయాల ను పరిశీలిస్తే మాత్రం.. ధీమా కన్నా.. ఓవర్ కాన్ఫిడెన్స్ లెవిల్స్ పెరిగిపోయాయి. అధికార పార్టీ వైసీపీ లోను, ప్రతిపక్షం టీడీపీ లోనూ.. ఇదే కనిపిస్తోందని పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమదే అధికారమని వైసీపీ బలంగా నమ్ముతోంది.
ఇక, ఇంకేముంది.. ఇప్పుడు ఎన్నికలు జరిగినా మేమే అధికారంలోకి వచ్చేస్తామని టీడీపీ బలంగా నమ్మేస్తోంది. ఈ అతి విశ్వాసం ఆయా పార్టీలకు నష్టం చేకూర్చుతోందన్నది పరిశీలకుల మాట. ఎందుకంటే.. ప్రజల నాడి ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. 2019 ఎన్నికల కు ముందు పసుపు-కుంకుమ పేరుతో టీడీపీ సర్కారు డబ్బులు పంచినా.. ఓటు బ్యాంకు సొంతం చేసుకోలేక పోయింది.
కాబట్టి వైసీపీ అయినా.. తాము డబ్బులు పంచుతున్నాం కాబట్టి ప్రజలు తమవైపే ఉంటారని అనుకోవడం లో అర్థం ఉండదు. కాబట్టి ఎన్నికల సమయం వచ్చే సరికి ఓటర్ల మూడ్ మారిపోయే అవకాశం ఉంటుంది. ఇక, టీడీపీ విషయానికి వచ్చినా.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా.. మేమే గెలిచేస్తామని చెప్పుకోవడం ద్వారా కార్యకర్తల్లో దూకుడు పెంచేయడంతో పుంగనూరు వంటి ఘటనలు తెరమీదికి వస్తున్నాయి.
సో.. అటు వైసీపీ అయినా, ఇటు టీడీపీ అయినా.. సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎన్నికల సమయానికి ప్రజలను తమవైపు తిప్పుకొనే వ్యూహాలకు పరిమితం కావడంతప్పుకాదని.. కానీ.. ఇప్పటి నుంచి రెచ్చగొట్టేలా చేస్తున్న కార్యక్రమాల వల్ల ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నాయని ఆయా పార్టీలు.. ఆత్మవిమర్శ చేసుకోవాలని పరిశీలకులు చెబుతున్నారు.