Begin typing your search above and press return to search.

బొత్సను ఫుల్లుగా కెలికిన టీడీపీ తమ్ముడు

బొత్స ఎందుకు అసహనానికి గురి అవుతున్నారు అంటే ఆయన స్థాయికి ప్రాంతీయ పార్టీ సరిపోదని, ఇంకా పదవులు పెద్దవి కావాలని ఉందని అని అర్ధం చెబుతున్నారు.

By:  Tupaki Desk   |   27 Oct 2023 4:16 AM GMT
బొత్సను ఫుల్లుగా కెలికిన టీడీపీ తమ్ముడు
X

విజయనగరం జిల్లాలో సీనియర్ మంత్రిగా నేతగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఆయన తన రాజకీయ జీవితాన్ని మరింత కాలం కొనసాగించాలని చూస్తున్నారు. ఏడు పదుల వయసు దాటిన విజయనగరం జిల్లా టీడీపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు ఉన్నారు. ఇక బొత్స మీద 2019 ఎన్నికలలో పోటీ చేసి ఓడిన యువకుడు, రాజకీయ వారసుడు అయిన కిమిడి నాగార్జున గత నాలుగున్నరేళ్ళుగా జిలా టీడీపీని నడిపిస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో చీపురుపల్లి నుంచి పోటీ చేసి మరోమారు ఢీ కొట్టి గెలవాలని చూస్తున్న నాగార్జున బొత్స మీద సీరియస్ కామెంట్స్ చేశారు. అవి ఏ రేంజిలో ఉన్నాయంటే బొత్స వల్లనే ఏపీ రెండు ముక్కలుగా విడిపోయిందని విభజన గాయాలని కెలికేటంతగా. ఏపీ విడిపోతూంటే బొత్స ఉమ్మడి ఏపీకి చివరి సీఎం కావాలని విపరీతంగా ప్రయత్నం చేసారని విమర్శించారు.

ఆయనకు పదవుల మీద యావ తప్ప ప్రజలకు మేలు చేసే తపన లేదని నిందించారు. పీసీసీ చీఫ్ గా జాతీయ పార్టీలో కొనసాగిన బొత్స ప్రాంతీయ పార్టీలో జగన్ దగ్గర పనిచేయడానికి కారణం అధికార దాహం తప్ప మరేంటి అని హాట్ కామెంట్స్ చేశారు బొత్స అవినీతి మీద తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని అన్నారు.

ఉమ్మడి ఏపీ నుంచి ఓక్స్ వ్యాగన్ వెనక్కి పోవడానికి బొత్స కారణం కాదా అని ఆయన ప్రశ్నించారు. బొత్స ఏ శాఖ నిర్వహిస్తే ఆ శాఖలో అవినీతిని చేశారని, ఆయన అవినీతికి అంతు లేదని విమర్శలు గుప్పించారు. అటువంటి బొత్స చంద్రబాబు ఫ్యామిలీ గురించి అవినీతి గురించి మాట్లాడడం ఏంటి అని నాగార్జున అంటున్నారు.

వైసీపీలో బొత్స అసహనంతో ఉన్నారని కూడా మరో మాట వదిలారు. బొత్స ఎందుకు అసహనానికి గురి అవుతున్నారు అంటే ఆయన స్థాయికి ప్రాంతీయ పార్టీ సరిపోదని, ఇంకా పదవులు పెద్దవి కావాలని ఉందని అని అర్ధం చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ ఇప్పటిదాకా పనిచేసిన మంత్రిత్వ శాఖల ద్వారా విజయనగరం జిల్లాకు ఏ విధంగా అభివృద్ధి తెచ్చారో చెప్పాలని సవాల్ చేశారు.

బొత్స వియనగరంలో మద్యాన్ని ఏరులై పారించారని, ఇందిరమ్మ ఇళ్ళలో అవినీతి బొత్స పుణ్యమేనని అన్నారు. ఇలా నాగార్జున సడెన్ గా బొత్స మీద గట్టిగా విమర్శలు చేయడం వెనక ఉద్దేశ్యం ఏంటి అంటే వైసీపీ సామాజిక బస్సు యాత్ర ఉత్తరాంధ్రాలో నిర్వహిస్తోంది. దానికి బొత్స నాయకత్వం వహిస్తున్నారు.

ఈ బీసీ మంత్రి మీద బీసీ నేతను అదే జిల్లాకు చెందిన నాగార్జునను సమయానుకూలంగా టీడీపీ ప్రయోగించింది అని అంటున్నారు. పైగా విజయనగరంలో టీడీపీ సౌండ్ తక్కువగా ఉందని, దాంతో సైకిల్ ని జోరు చేయడానికి నాగార్జునను గేరు మార్చమని హై కమాండ్ సూచించింది అని అంటున్నారు. మరి దీని మీద బొత్స ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉంది.