Begin typing your search above and press return to search.

ఎన్నికల తర్వాత టెక్కీలకు మంచి రోజులు... పూర్తి వివరాలివే!

ఫలితంగా... లక్షల మంది టెక్కీలు లేఆఫ్స్‌ తో పాటు నిలిచిపోయిన నియామకాలతో సతమవుతున్నారనే విషయం వైరల్ గా మారింది

By:  Tupaki Desk   |   15 April 2024 12:30 PM GMT
ఎన్నికల తర్వాత టెక్కీలకు మంచి రోజులు... పూర్తి వివరాలివే!
X

సుమారు కోవిడ్ మహమ్మారి ఎంటరైనప్పటి నుంచీ టెక్కీలకు గడ్డు రోజులు మొదలయ్యాయని.. ఇటీవల కాలంలో వాటి తీవ్రత పెరిగిందని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. పైగా గత కొన్ని నెలలుగా దేశంలోని పలు టెక్ కంపెనీల్లో అత్యంత గడ్డు పరిస్థితులు కొనసాగుతున్నాయని చెబుతున్నారు. ఫలితంగా... లక్షల మంది టెక్కీలు లేఆఫ్స్‌ తో పాటు నిలిచిపోయిన నియామకాలతో సతమవుతున్నారనే విషయం వైరల్ గా మారింది.

ఈ విషయంలో చిన్నా పెద్దా అనే తారతమ్యాలు ఏమీ లేవని.. ఓ మోస్తరు కంపెనీలతో పాటు గూగుల్, ఆపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, ఎక్స్ వంటి మొదలైన టాప్ టెక్ కంపెనీలు సైతం ఉద్యోగుల సంఖ్యను భారీగా తగ్గించిన పరిస్థితులు తలెత్తాయి! ఈ సమయంలో కొన్ని భారత కంపెనీలు నియామకాలను నిలిపివేశాయని తెలుస్తుంది. దీంతో... ఇటీవల పాస్డ్ అవుట్ బ్యాచ్ కి ఇబ్బందులు తప్పలేదు!!

ఇదే క్రమంలో... టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, విప్రో, టెక్ మహీంద్రాల్లో వేల సంఖ్యలో ఉద్యోగుల సంఖ్య తగ్గినట్లు గణాంకాలు వెల్లడించాయి! అయితే ఈ పరిస్థితులు మారబోతున్నాయని.. ఎన్నికల అనంతరం టెక్కీలకు మంచి రోజులు రాబోతున్నాయని.. తాజాగా టీసీఎస్ క్యూ4 ఫలితాలను గమనిస్తే... కొత్తగా సుమారు 10,000 మంది ఫ్రెషర్స్ ని రిక్రూట్ చేసుకోనున్నట్లు ప్రకటించింది.

ఇదే సమయంలో ఎగ్జిక్యూటివ్ సెర్చ్ అండ్ రిక్రూట్‌మెంట్ సర్వీసెస్ ఫర్మ్స్ వివరాల ప్రకారం.. పలు ఐటీ సంస్థలు కొత్త రోల్స్ కోసం ఉద్యోగుల్ని నియమించుకునే పనిలో పడ్డాయని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో... భారత్ తో పాటు యూఎస్, యూకేలో ఎన్నికల హడావిడి తర్వాత టెక్ ఓపెనింగ్స్ వేగం పుంజుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.