Begin typing your search above and press return to search.

వైరల్ వీడియో... విషపూరితంగా టెక్కీల పని సంస్కృతి!

అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో మరమనిషిగా మారబోతోన్న దశకు అత్యంత సమీపంలో మనిషి ఉన్నాడనే చర్చకు తెరలేపిందని అంటున్నారు.

By:  Tupaki Desk   |   19 Oct 2024 10:30 PM GMT
వైరల్ వీడియో... విషపూరితంగా టెక్కీల పని సంస్కృతి!
X

ఒక రాజ్యానికి రాజైనా.. బంట్రోతు అయినా.. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిపరమైన జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకు కదలాలని.. అలాకానిపక్షంలో మనిషికీ, మర మనిషికీ పెద్ద వ్యత్యాసం ఉండదని చెబుతుంటారు. అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియో మరమనిషిగా మారబోతోన్న దశకు అత్యంత సమీపంలో మనిషి ఉన్నాడనే చర్చకు తెరలేపిందని అంటున్నారు.

అవును... తాజాగా బెంగళూరులో ఓ వ్యక్తి వర్చువల్ క్లయింట్ మీటింగ్ కి హాజరవుతూనే దుర్గాపూజ కార్యక్రమంలో పాల్గొన్నాడు! ఆ సమయంలో అతని చేతిలో ఓపెన్ చేసి ఉన్న ల్యాప్ టాప్ ఉండగా.. మరో చేతిలో మొబైల్ ఫోన్ పట్టుకుని.. అమ్మవారికి మనసార రెండు చేతులతోనూ దణ్ణం పెట్టుకోలేని పరిస్థితిలో కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

ఈ వీడియో నేటి కాలంలో విషపూరితమైన కార్పొరేట్ పని సంస్కృతికి అద్దం పడుతుందని అంటున్నారు పరిశీలకులు. ప్రధానంగా బెంగళూరు వంటి నగరాల్లో ఉద్యోగులు.. ప్రధానంగా టెక్కీలు పండగ రోజులు, వారాంతాలు అనే తారతమ్యాలు లేకుండా పని చేయాల్సి వస్తోందని అంటున్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత జీవితాలను వదులుకోవడమే అని అంటున్నారు.

ఇక ఈ వీడియోలో కనిపించిన వ్యక్తి దయనీయ పరిస్థితిపై నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు. ఇందులో భాగంగా... "ఈ పనికిమాలిన పనిని ఆపండి.. కంపెనీ తొలగించే ముందు రెండేసి సార్లు ఆలోచించదు.. అందువల్ల వ్యక్తిగత, వృత్తిపరమైన సమయాలను వేరుగా ఉంచండి" అని స్పందించారు. మరొకరు... "మనిషి లాంటి మనిషి.. కాదు కాదు.. మరమనిషి లాంటి మనిషి!" అని స్పందించారు.