"మరణ తర్వాత ఏమిటి?"... తెలుసుకోవాలని గొంతుకోసుకున్న అమ్మాయి!
ఈ సమయంలో కారణం అదేనా, మరేదైనా ఉందా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. బ్లేడ్ తో చేతులు కట్ చేసుకుని, అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంది.
By: Tupaki Desk | 29 Jan 2025 1:30 AM GMTబుద్దిగా చదువుకుంటూ.. తల్లితండ్రులతోనూ, స్నేహితులతోనూ సరదగా గడుపుతూ.. భవిష్యత్తు గురించి కలలు కనాల్సిన ఓ టీనేజ్ అమ్మాయి.. మరణం తర్వాత ఏమి జరుగుతుంది అనే విషయం గురించి ఆలోచించడం మొదలుపెట్టింది!.. ఈ సమయంలో కారణం అదేనా, మరేదైనా ఉందా అనే సంగతి కాసేపు పక్కనపెడితే.. బ్లేడ్ తో చేతులు కట్ చేసుకుని, అనంతరం గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకుంది.
అవును... ఓ 17 ఏళ్ల బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె ఈ దారుణానికి ఒడిగట్టడానికి ముందు "మరణం తర్వాత ఏమి జరుగుతుంది?" అనే విషయంపై ఆన్ లైన్ లో సెర్చ్ చేసిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో.. ఆ అమ్మాయి ఆన్ లైన్ గేమ్స్ కి కూడా బానిస అయ్యిందనే విషయం దర్యాప్తులో తేలిందని పోలీసులు చెబుతున్నారు. ఇదే సమయంలో.. స్టోన్ బ్లేడ్ కత్తిని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసి తెప్పించుకుందని వెల్లడించారు.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం... మహారాష్ట్ర నాగ్ పూర్ లో ఆర్బీఐ రీజనల్ డైరెక్టర్ గా కుమార్తె (17) ఓ ప్రైవేట్ పాఠశాలలో 12వ తరగతి చదువుతుంది. ఈ క్రమంలో ఆమె విదేశీ సంస్కృతి, మరణం తర్వాత ఏమి జరుగుతుంది వంటి విషయాల గురించి నిత్యం ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తుంటుందంట. ఈ సమయంలో తాజాగా ఆన్ లైన్ లో ఓ స్టోన్ బ్లేడ్ కత్తిని ఆర్డర్ పెట్టుకున్న ఆమె.. ఆ కత్తితో చేతులపై అటు ఇటు కోసేసుకుంది.
ఆ తర్వాత తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఇదంతా ఆదివారం రాత్రి జరిగగా.. సోమవారం ఉదయం ఆమె తల్లి తన ఇంట్లోని మరో బెడ్ రూమ్ లో పడి ఉన్న కుమార్తె మృతదేహాన్ని చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో.. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆ అమ్మాయి మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆ ఫోన్ ను చెక్ చేయగా... ఆమె మరణానికి ముందు "మరణం తర్వాత ఏమి జరుగుతుంది?" అని గూగుల్ లో సెర్చ్ చేసిందని గుర్తించారు. ఇదే సమయంలో.. విదేశీ సంస్కృతుల గురించి తన డైరీలో విస్తృతంగా రాసినట్లు కూడా గుర్తించారంట. ఇదే క్రమంలో ఆమె ఆన్ లైన్ గేమ్స్ కి కూడా ఎక్కువగా అలవాటు పడినట్లు గుర్తించారని అంటున్నారు.
దీంతో.. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈమె మరణంలో ప్రేమకి సంబంధించిన కారణాలు కనిపించలేదని చెప్పినట్లు తెలుస్తోంది. ఈమె మరణం తర్వాత జీవితం గురించిన ఆలోచనల్లో ఉండేదని అంటున్నారు!