Begin typing your search above and press return to search.

ఎయిర్ పోర్ట్ లో బాలిక హల్ చల్... పాక్ కి టిక్కెట్ ప్లీజ్!

పాక్‌ లో ఉ‍న్న తమ ప్రియున్ని కలవడానికి వెళ్తున్నట్లు బాలిక చెప్పుకొచ్చింది.

By:  Tupaki Desk   |   29 July 2023 12:32 PM GMT
ఎయిర్  పోర్ట్  లో  బాలిక హల్  చల్... పాక్  కి టిక్కెట్  ప్లీజ్!
X

గతకొన్ని రోజులు గా సరిహద్దులు దాటుతోన్న ప్రేమ వ్యవహారాలు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోన్నాయి. ఇండియా - పాకిస్థాన్... పాకిస్థాన్ - ఇండియా... చైనా - పాకిస్థాన్... బంగ్లాదేశ్ - ఇండియా... ఇలా సరిహద్దు దాటుతోన్న ప్రేమ వ్యవహారాలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ సమయం లో ఎయిర్ పోర్ట్ లో హల్ చల్ చేసింది ఒక మైనర్ బాలిక!

అవును... జైపూర్‌ ఎయిర్‌ పోర్టుకి వచ్చిన ఒక మైనర్ బాలిక పాకిస్థాన్‌ కి పంపించండి అంటూ అధికారుల ను షాక్‌ కు గురిచేసింది. పాక్‌ లో ఉ‍న్న తమ ప్రియున్ని కలవడానికి వెళ్తున్నట్లు బాలిక చెప్పుకొచ్చింది. అయితే ఎయిర్ పోర్ట్ కి వచ్చిన ఆ బాలిక దగ్గర ఎలాంటి పాస్‌ పోర్టు గానీ, వీసాగానీ లేవు. దీంతో బాలిక ను పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు. అనంతరం విచారణ లో అసలు విషయం వెలుగు లోకి వచ్చింది.

జైపూర్‌ ఎయిర్‌ పోర్టులో టిక్కెట్ కౌంటర్ వద్ద ఒక మైనర్ బాలిక క్యూలో నిలబడి ఉంది. అనంతరం కౌంటర్ దగ్గర కు వెళ్లి తన కు పాకిస్థాన్ వెళ్లడానికి ఒక టిక్కెట్ ఇవ్వమని అడిగింది. దీంతో మైనర్ బాలిక, ఒంటరిగా కనిపిస్తోంది.. పైగా పాకిస్థాన్ కి టిక్కెట్ అడుగుతోంది.. అని అనుమానించిన అధికారులు ఆమెను ప్రశ్నించారు.

దీంతో స్పందించిన బాలిక... మూడేళ్ల క్రితమే ఇస్లామాబాద్‌ నుంచి తన ఆంటీతో కలిసి భారత్‌ కు వచ్చినట్లు చెప్పింది. అయితే ప్రస్తుతం ఆ ఆంటీతో తనకు సఖ్యత లేదని.. దీంతో మళ్లీ పాకిస్థాన్‌ కు వెళ్లాల ని నిర్ణయించుకున్నట్లు అధికారుల కు తెలిపింది. అయితే... దర్యాప్తులో మరో విషయం తెలిసింది. ఇప్పటివరకూ ఈ బాలిక చెప్పిందంతా కట్టుకథ అని తేలింది.

అనంతరం... కాస్త సీరియస్ టోన్ లో అడిగారో ఏమో కానీ... ఆఖరికి వాస్తవాలు రాబట్టారంట అధికారులు. పాకిస్థాన్‌ లో ఉన్న బాలుడు కొన్ని విషయాలు తెలిపినట్లు బాలిక దర్యాప్తులో అధికారుల కు చెప్పిందట. ఇందులో భాగంగా... అధికారులతో మాట్లాడేటప్పుడు తడబడకూడదని ఆ బాలుడే చెప్పాడని ఆ బాలిక అధికారుల కు చెప్పిందంట. అందుకు భాగంగానే ఆ కట్టుకథ ను అధికారుల కు చెప్పినట్లు పేర్కొందట.

అయితే ఫైనల్ దర్యాప్తులో బాలిక స్థానికంగా రాజస్థాన్‌ లోని సికార్‌ జిల్లా లోని రత్నపుర గ్రామానికి చెందినదని అధికారులు గుర్తించారు. చివరికి తల్లిదండ్రులను పిలిచి వారి ముందే మళ్లీ ప్రశ్నించగా.. ఫేమస్ అవ్వడం కోసం ఇలా చేసినట్లు బాలిక చెప్పుకొచ్చింది. దీంతో అసలు విషయం గ్రహించిన అధికారులు... తల్లిదండ్రుల ను పిలిపించి వారితోపాటే బాలిక ను ఇంటికి పంపించారు.