టీచర్ తో మైనర్ బాలుడి క్రూర ప్రేమ.. నో చెబితే ఇలా పగ తీర్చుకున్నాడు
మనసు పడిన అమ్మాయి ఎవరైనా సరే.. తనకు ఓకే చెప్పేయాలన్నట్లుగా వ్యవహరించే మగాళ్లు కొందరు ఉంటారు.
By: Tupaki Desk | 25 July 2024 4:36 AM GMTమనసు పడిన అమ్మాయి ఎవరైనా సరే.. తనకు ఓకే చెప్పేయాలన్నట్లుగా వ్యవహరించే మగాళ్లు కొందరు ఉంటారు. తాము ప్రేమించిన వారికి మనసు ఉంటుందని.. వారికి నచ్చినట్లుగా నిర్ణయాలు తీసుకుంటారే తప్పించి.. తమకు తోచినట్లుగా వారు ఓకే చెప్పలేరన్న విచక్షణను మర్చిపోతుంటారు. తాజాగా అలాంటి తీరునే ప్రదర్శించిన ఒక మైనర్ చేసిన చేష్టలు షాకింగ్ గా మారాయి.
చెన్నై శివారులోని పెరియామెట్ కు చెందిన 22 ఏళ్ల టీచర్ ను 17 ఏళ్ల మైనర్ ప్రేమలో పడ్డాడు. ట్యూషన్ టీచర్ గా పని చేస్తున్న ఆమె తనను ప్రేమించాలని ఆశ పడ్డాడు. అతడి తీరుతో విసిగిపోయిన టీచర్.. మైనర్ ను దూరం పెట్టేసింది. దీంతో.. ఆమెపై రివెంజ్ తీర్చుకోవాలని వినూత్నంగా ప్లాన్ చేశాడు. సదరు యువతి పేరు మీద ఆమె ఇంటికి అదే పనిగా క్యాష్ ఆన్ డెలివరీ ఆన్ లైన్ ఆర్డర్లను పెట్టసాగాడు.
ఇలా పదిసార్లు.. ఇరవై సార్లు కాదు.. ఏకంగా వందల సార్లు ఆన్ లైన్ ఆర్డర్లు రావటంతో వారి కుటుంబం ఉక్కిరిబిక్కిరి అయ్యిది అంతేకాదు.. 77 సార్లు ఓలా.. ఊబర్ రైడ్స్ కోసం బుక్ చేసి వేధింపులకు దిగేవాడు. డెలివరీ కోసం వచ్చే బాయ్స్ కు సమాధానం చెప్పలేక సదరు కుటుంబం తీవ్ర అవస్థలకు గురైంది. చివరకు ఎవరో తమ అమ్మాయిని వేధింపులకు గురి చేస్తున్న విషయాన్ని గుర్తించారు.
గుర్తు తెలియని వ్యక్తి తమ కుమార్తెను వేధింపులకు గురి చేస్తున్నాడన్న ఫిర్యాదును పోలీసులు అందజేశారు. పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత.. క్షుణ్ణంగా విచారణ జరిపారు. దీంతో.. ఫోన్ నెంబరు ఆధారంగా ఈ తరహా ఆన్ లైన్ వేధింపులకు పాల్పడుతున్న కుర్రాడ్ని గుర్తించారు. చివరకు అతడ్ని అరెస్టు చేయగా.. తమ వద్దకు ట్యూషన్ కోసం వచ్చే మైనర్ బాలుడన్న విషయాన్ని గుర్తించి అవాక్కు అయ్యారు. కోర్టు సైతం అతడి మానసిక ఆరోగ్యాన్ని చెక్చేసి.. కౌన్సెలింగ్ ఇవ్వాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి.