Begin typing your search above and press return to search.

ఎంత సింపులో.. పెళ్లితోనే సింప్లిసిటీ చాటిన ఆ బీజేపీ యువ ఎంపీ

తమ వివాహ సమయంలో అతిథులు భారీగా పూల బొకేలు తీసుకురావడంతో, పెళ్లి జరిగిన 24 గంటల్లోనే వాటిలో 85% పూలను పారవేయాల్సి వచ్చిందని తేజస్వి తెలిపారు.

By:  Tupaki Desk   |   10 March 2025 6:17 PM IST
ఎంత సింపులో.. పెళ్లితోనే సింప్లిసిటీ చాటిన ఆ బీజేపీ యువ ఎంపీ
X

పెళ్లంటే ఇప్పుడు పెద్ద ఆర్భాటం.. ఆకాశమంత పందిరి.. భూదేవి అంత విస్తరి వేసి అంగరంగ వైభవంగా చేస్తారు. అంబానీ ఇంటా అయితే ముందస్తు వేడుకల నుంచి పెళ్లి వేడుకల వరకూ కోట్లలో ఖర్చు. చార్టెడ్ ఫ్లైట్ లు.. భారీ భోజనాల, డెకరేషన్లు, విందులు వినోదాలు.. అబ్బో ఆ పెళ్లిళ్లు నభూతో నభవిష్యతి అన్నట్టుగా చేసుకుంటారు. కానీ ఓ యువ ఎంపీ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచాడు. తన పెళ్లిని సాదాసీదాగా చేసుకున్నాడు. అంతే కాదు.. అనవసరంగా ఖర్చు పెట్టుకోవద్దని తన పెళ్లికి వచ్చేవారికి ఓ పిలుపునిచ్చాడు.

భారతీయ జనతా పార్టీ యువ ఎంపీ తేజస్వి సూర్య ఇటీవల చెన్నైకు చెందిన ప్రముఖ గాయని, శాస్త్రీయ సంగీత, భరతనాట్య కళాకారిణి శివశ్రీ స్కంద ప్రసాద్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరి రిసెప్షన్ ఆదివారం బెంగళూరులో ఘనంగా నిర్వహించారు. ఈ ప్రత్యేక వేడుకకు ముందుగా తేజస్వి సూర్య ఒక కీలక విజ్ఞప్తి చేశారు. అదే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

తమ వివాహ సమయంలో అతిథులు భారీగా పూల బొకేలు తీసుకురావడంతో, పెళ్లి జరిగిన 24 గంటల్లోనే వాటిలో 85% పూలను పారవేయాల్సి వచ్చిందని తేజస్వి తెలిపారు. అంతేకాదు, ప్రతి ఏడాది వివాహాల సందర్భంగా సుమారు 3 లక్షల కిలోల డ్రై ఫ్రూట్స్ మిగిలిపోతున్నాయని, వాటిపై రూ. 315 కోట్లు ఖర్చు అవుతున్నట్లు ఓ సర్వే వెల్లడించినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వృథా ఖర్చును తగ్గించేందుకు తమ రిసెప్షన్‌కు వచ్చే అతిథులు పూల బొకేలు, డ్రై ఫ్రూట్స్‌ తీసుకురావొద్దని తేజస్వి సూర్య అభ్యర్థించారు.

అలాగే, రిసెప్షన్‌కు హాజరయ్యే వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

తేజస్వి సూర్య, శివశ్రీ స్కంద ప్రసాద్ వివాహం గురువారం బెంగళూరులో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో కేంద్ర మంత్రులు అర్జున్ రామ్ మేఘవాల్, వి. సోమన్న, భాజపా నేతలు అన్నామలై, అమిత్ మాలవీయ, బీవై విజయేంద్ర తదితరులు పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించారు.