Begin typing your search above and press return to search.

ఫ్యార్చున‌ర్ కార్ల‌కు అమ్ముడు పోతున్న ఎమ్మెల్యేలు!?

అంటే.. దీనిని బ‌ట్టి సొంత పార్టీ నాయ‌కులు, ఎమ్మెల్యేలే ఇంత దాహంతో ఉన్నారా? ఇంత క‌క్కుర్తి ప‌డుతున్నారా? అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

By:  Tupaki Desk   |   4 May 2024 12:30 AM GMT
ఫ్యార్చున‌ర్ కార్ల‌కు అమ్ముడు పోతున్న ఎమ్మెల్యేలు!?
X

రాజకీయాల్లో అమ్ముడు పోవడం కొనడం అన్నది అలవాటు అయిన వ్యవహారంగా మారింది. ఇది అవసరాన్ని బట్టి ఉంటోంది. డిమాండ్ అండ్ సప్లై మార్కెట్ ని శాసిస్తుంది. రాజకీయాల్లోనూ ఇదే సూత్రం వర్తిస్తుందని అంటున్నారు. విషయానికి వస్తే తెలంగాణలో ఇపుడు ఎంపీ ఎన్నికలు జరుగుతున్నాయి. లోక్ సభ ఎన్నికల సందడి తో తెలంగాణాలో మరో మారు రాజకీయ హాట్ హాట్ గా మారింది.

ఇదిలా ఉంటే ప్రధాన పార్టీలు గెలుపే ధ్యేయంగా సర్వం పెట్టి పనిచేస్తున్నాయి. అయితే అన్ని పార్టీలలోనూ సణుగుడు గొణుగుడూ ఎపుడూ ఉండేవే. అది అధికార పార్టీ అయినా కాదేదీ అతీతం అన్నట్లుగా సీన్ ఉంటుంది. ఇపుడు అదే పరిస్థితి అధికార కాంగ్రెస్ లో నెలకొని ఉంది అని అంటున్నారు.

తెలంగాణాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు ఇపుడు సొంత పార్టీ ఎంపీ అభ్యర్ధులకు సహకరించడం లేదు అని అంటున్నారు. వారు సరిగ్గా పనిచేయడం లేదు అని అంటున్నారు. ఉత్తర తెలంగాణాలో చూస్తే ఒక కుటుంబం నుంచి వచ్చిన ఒక యూత్ కాంగ్రెస్ అభ్యర్థికి ఎమ్మెల్యేలు పెద్దగా సహకరించడం లేదు అని అంటున్నారు. ఇది ఒక టాక్ లా స్ప్రెడ్ అవడంతో సీన్ లోకి మంత్రి వచ్చారని భోగట్టా.

ఆయన కలుగచేసుకుని మధ్యవర్తిత్వం చేసి ఎమ్మెల్యేలకు కొంచెం ఆర్ధిక సాయం చేయాలని ఎంపీ అభ్యర్ధికి సూచించారు అని టాక్ నడుస్తోంది. దాంతో విషయం అర్ధం చేసుకుందిట ఆ యువ కాంగ్రెస్ అభ్యర్ధి కుటుంబం. ఆ కుటుంబానికి బాగా డబ్బు ఉండడంతో ఈ సలహాలను వారు ఆచరణలో పెట్టేందుకు రెడీ అయిపోయారని అంటున్నారు.

అదెలా అంటే ఆ ఎమ్మెల్యేలకు ఒక ఫార్చునర్ కారుతో పాటు ఒక కోటి క్యాష్ ఇప్పించడంతో ఈ ఎమ్మెల్యేల అసంతృప్తి పూర్తిగా మాయం అయి వ్యవహారం అంతా సెటిల్ అయింది అని అంటున్నారు.

ఇలా ఎందుకు అంటే తిరగడానికి ఒక్కో ఎమ్మెల్యేలు కారు, అలా ఖర్చులకు కోటి రూపాయలు అన్న మాట ఆని అంటున్నారు. ఇలా సెటిల్మెంట్ జరగడం ఏంటి అలా ఎమ్మెల్యేలలో హుషార్ తన్నుకుని వస్తోందిట.వారు యమ జోరుగా సదరు యువ నేత ఎంపీ అభ్యర్ధిత్వం కోసం జనాల్లోకి వెళ్ళి మరీ విపరీతంగా ప్రచారం చేస్తున్నారుట.

దీంతో ఆ అభ్యర్ధి గెలుపు అవకాశాలు కూడా పూర్తిగా మెరుగు అయ్యాయని ఆయన గెలుపు గుర్రం ఎక్కేస్తారు అని కూడా టాక్ నడుస్తోంది. ఈ ఎపిసోడ్ ఈ సెటిల్మెంట్ అలా కధలు కధలుగా ఇపుడు పార్టీలోను బయట చెప్పుకుంటున్నారు మరీ ఇంత చీప్ గా ఉంటారా అని కొందరు ముక్కున వేళ్లేసుకుంటున్నారు.

అయితే దాహం అలాంటిది మరి అని మరికొందరు సమర్ధిస్తున్నారు. అవసరం బట్టే బెట్టు చేయాలని అపుడే క్యాష్ పట్టడం జరుగుతుందని తలపండిన వారు కొందరు చెబుతున్న మాట. రాజకీయాల్లో విలువలు వలువలు గురించి కబుర్లు చెబితే ఎవరూ పట్టించుకోని కాలమిది. ఇలాంటి విషయాలు ప్రచారం అయితే మరింతమంది ఎంపీ అభ్యర్ధులకు దెబ్బ తప్ప దీన్ని చూసి ఏమిటి ఇలాంటివి చేయడం అనుకునే వారు అయితే ఉండరంటే ఉండరనే అంటున్నారు.

ఈ ఆధునిక కాలంలో రాజకీయం అంతా డబ్బు చుట్టూ తిరుగుతోంది. అలా డబ్బు రాజకీయం పదవులు పెనవేసుకుపోయిన చోట నీకింత నాకింత అని లెక్క చూసుకోవడమే నయా రాజకీయ నీతి అని అంటున్నారు. అంతే దీని గురించి ఎవరూ ఎక్కువగా నీతి వాక్యాలు వల్లించడం కూడా దండుగ అనే అంటున్నారు.