కేటీఆర్ మీద ఏసీబీ...రూట్ అటేనా ?
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. దాంతో ఒక సంచలన రాజకీయ పరిణామానికి తెర లేవనుంది అన్న చర్చ సాగుతోంది.
By: Tupaki Desk | 17 Dec 2024 3:46 AM GMTబీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీద ఏసీబీ కేసు నమోదు చేసింది. దాంతో ఒక సంచలన రాజకీయ పరిణామానికి తెర లేవనుంది అన్న చర్చ సాగుతోంది. నిజానికి చూస్తే గత కొంతకాలంగా కేటీఆర్ దర్యాప్తు సంస్థల నిఘాలోనే ఉన్నారని ప్రచారంలో ఉంది.
ఇపుడు దానికి ఆధారం అన్నట్లుగా కేటీఆర్‌పై వచ్చిన ఫార్ములా ఇ కుంభకోణంపై ఏసీబీ తాజాగా కేసు నమోదు చేసింది. ఏసీబీ ఈ కేసులో అనేక విషయాలు పేర్కొంది. ఏసీబీ నివేదికలో ఉన్న సమాచారం ప్రకారం చూస్తె కనుక 55 కోట్ల ప్రభుత్వ సొమ్మును విదేశీ సంస్థలకు అప్పనంగా ఇచ్చేందుకు గానూ కేటీఆర్ తెలిపిన మౌఖిక అంగీకారం పైన దాని మీద వచ్చిన ఆరోపణలపైన కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసిందని అంటునారు.
ఇక ఇదే కేసులో ప్రధాన నిందితుడుగా మాజీ ఎంఏయూడీ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్ కి కేటీఆర్ మౌఖిక ఆదేశాలు జారీ చేశారు అని అంటున్నారు. అందువల్లనే సదరు విదేశీ ఈవెంట్ నిర్వాహకులకు 55 కోట్ల రూపాయల నిధులను బదిలీ చేసినట్లు అధికారికంగానే ఆయన అంగీకరించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది.
కేటీఆర్‌పై అభియోగాలు మోపేందుకు ఏసీబీని ముందుకు తెచ్చారని ఆ విధంగా చేసేందుకు తెలంగాణ కేబినెట్ చీఫ్ సెక్రటరీని ప్రేరేపించడం తోనే ఇదంతా జరిగింది అని అంటున్నారు. ఇలా ఈ ఈ ఫార్ములా విషయంలో ఏసీబీ కేసు పెట్టడమేంటి అందులో కేటీఆర్ పేరు కూడా ఉండడం సంచలనం రేపుతోంది.
ఇక ఈ కేసు వివరాల్లోకి వెళ్తే 2023 ఫిబ్రవరిలో హైదరాబాద్ లో జరిగిన ఫార్ములా ఇ రేసుల్లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయడానికి రెండు రోజుల క్రితం గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఎసిబికి అనుమతి మంజూరు చేసినట్లు సమాచారంగా ఉంది.
దీంతో ఇపుడు కేటీఆర్ ఏసీబీ కేసులోకి వచ్చారు. మరి ఆయనను ఇదే కేసులో అరెస్ట్ చేస్తారా అన్నది కూడా చర్చనీయాంశంగా ఉంది. మా నేతను అరెస్ట్ అయితే తెలంగాణా అగ్ని గుండం అవుతుందని బీఆర్ఎస్ నేతలు ఒక వైపు హెచ్చరికలు చేస్తూంటే అలా ఎందుకు అవుతుంది, అవినీతి చేసిన వారికి శిక్షలు తప్పవని కాంగ్రెస్ మంత్రులు అంటున్నారు. మొత్తానికి ఈ వారంలో ఏదో పెద్ద వ్యవహారమే జరిగేట్టుగా ఉందని సంకేతాలు అయితే ఉన్నాయి.