Begin typing your search above and press return to search.

మద్యంపై ఖర్చు చేయడంలో తెలంగాణ నెం.1.. ఆంధ్రప్రదేశ్ నెం.2!

ఈ మేరకు ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్.ఐ.పీ.ఎఫ్.పీ) వెల్లడించింది.

By:  Tupaki Desk   |   30 Oct 2024 12:57 PM GMT
మద్యంపై ఖర్చు చేయడంలో తెలంగాణ నెం.1.. ఆంధ్రప్రదేశ్  నెం.2!
X

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మందుబాబులు తమదైన దూకుడు ప్రదర్శిస్తున్నారంట! ఇందులో భాగంగా... దేశంలోనే మద్యం అధికంగా సేవించే రాష్ట్రాల జాబితాలో మొదటి రెండు స్థానాలనూ ఆక్రమించుకున్నారట. ఈ మేరకు ఢిల్లీలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (ఎన్.ఐ.పీ.ఎఫ్.పీ) వెల్లడించింది.

అవును... మద్యం కోసం ఖర్చు చేసే విషయంలో రెండు తెలుగు రాష్ట్రల వారూ పోటీ పడుతున్నారనే విషయం తాజాగా తెరపైకి వచ్చింది. దేశంలో సగటున ఓ వక్తి మద్యం పై సగటున ఎంత ఖర్చు చేస్తున్నాడనే వివరాలతో కూడిన జాబితాను ఎన్.ఐ.పీ.ఎఫ్.పీ వెల్లడించిన నేపథ్యంలో... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల దూకుడు తెరపైకి వచ్చింది.

ఇందులో భాగంగా... మద్యం కోసం సగటున ఓ వ్యక్తి చేసిన ఖర్చులో తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో నిలవగా.. మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలించింది. 2022-23 సంవత్సరంలో తెలంగాణ సగటున ఓ వ్యక్తి మద్యంపై చేసిన ఖర్చు రూ.1623 కాగా.. రూ.1306 ఖర్చుతో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది.

ఇక ఈ జాబితాలో మద్యం కోసం అత్యంత తక్కువ ఖర్చు చేసిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, త్రిపుర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. మద్యపాన నిషేధం అమలులో ఉన్న రాష్ట్రాలు మినహా మిగతా రాష్ట్రాలకు సంబంధించిన 2022-23 ఏడాదికి సంబంధించిన వివరాలను ఎన్.ఐ.పీ.ఎఫ్.పీ. విడుదల చేసింది.

2022-23లో సగటున ఓ వ్యక్తి మద్యంపై అత్యధికంగా ఖర్చు చేసిన టాప్-5 రాష్ట్రాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

తెలంగాణ - రూ.1,623

ఆంధ్రప్రదేశ్ - రూ.1,306

పంజాబ్ - రూ.1,245

ఛత్తిస్ గడ్ - రూ.1,227

ఒడిస్సా - రూ.1,156

2022-23లో సగటున ఓ వ్యక్తి మద్యంపై అత్యల్పంగా ఖర్చు చేసిన 5 రాష్ట్రాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

ఉత్తరప్రదేశ్ - రూ.49

రాజస్థాన్ - రూ.140

త్రిపుర - రూ.148

మధ్యప్రదేశ్ - రూ.197

మహారాష్ట్ర - రూ.346