Begin typing your search above and press return to search.

అచ్చి వచ్చిన ఉప ఎన్నికలతో రెచ్చిపోదాం ?

ప్రతీ విషయం మీద సవాల్ చేయడం పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను రప్పించి తొడగొట్టి గెలవడం అన్నది నాటి టీఆర్ఎస్ కి ఒక రాజకీయ వ్యూహంగా ఉంది.

By:  Tupaki Desk   |   26 March 2025 11:30 PM
అచ్చి వచ్చిన ఉప ఎన్నికలతో రెచ్చిపోదాం ?
X

తెలంగాణాలో ఉప ఎన్నికలు చాలా కామన్ గా జరిగిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా చూస్తే కనుక 2021లో గులాబీ పార్టీ ఆవిర్భవించాక ఎన్నో ఉప ఎన్నికలకు తెర తీసి తన బలాన్ని ఎంతో పెంచుకుంది. ప్రతీ విషయం మీద సవాల్ చేయడం పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలను రప్పించి తొడగొట్టి గెలవడం అన్నది నాటి టీఆర్ఎస్ కి ఒక రాజకీయ వ్యూహంగా ఉంది.

ఇక చూస్తే ఉప ఎన్నికలు ఎపుడూ బీఆర్ఎస్ కి అచ్చొచ్చిన సెంటిమెంట్ గా ఉన్నాయి. ఇపుడు చూస్తే మరోసారి అలాంటి వాతావరణమే బీఆర్ఎస్ కోరుకుంటోంది. బీఆర్ ఎస్ ఎన్నడూ లేనంత రాజకీయ క్లిష్టమైన దశలో ఉంది. 2024లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి ఉన్న సీట్లూ పోయాయి. దాంతో తాను బలంగా ఉన్నాను అని నిరూపించుకోవడానికి ఉప ఎన్నికలు అవసరం అని భావిస్తోంది.

దాంతోనే ఇపుడు దేశ అత్యున్నత న్యాయ స్థానం అయిన సుప్రీంకోర్టు వైపు గులాబీ పార్టీ పెద్దలు ఆశగా ఎదురుచూస్తున్నారు. బీఆర్ఎస్ నుంచి పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిపోయారు. వారి మీద బీఆర్ఎస్ మొదట హైకోర్టుకి వెళ్ళింది. ఆ తరువాత సుప్రీంకోర్టుకు వెళ్ళింది. సుప్రీంకోర్టులో ప్రస్తుతం ఈ కేసు ఉంది. అక్కడ తమ వాదనకు అనుకూలంగా తీర్పు వస్తుందని బీఆర్ స్ నేతలు బలంగా నమ్ముతున్నారని అంటున్నారు.

తొందరలోనే సుప్రీం కోర్టులో ఈ కేసు విషయంలో విచారణ ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీం కోర్టు నుంచి తెలంగాణా అసెంబ్లీ సెక్రటరీకి నోటీసులు వచ్చాయని అంటున్నారు. వాటిని బీఆర్ఎస్ లో చేరిన పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు జారీ చేశారు. వాటికి ఇపుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా మారిన ఆ పది మంది సమాధానం ఇవ్వాల్సి ఉంది.

ఇక చూస్తే ఈ కేసు విషయంలో తమకు తప్పకుండా న్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ భావిస్తోంది. సుప్రీంకోర్టులో ఈ కేసు ఉండడంతో ఫిరాయింపుల విషయం అన్నది చిన్నది కాదు కాబట్టి తీర్పు అయితే సంచలనంగానే ఉండొచ్చు అని ఆశిస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ నాయకులకు అపుడే ఆదేశాలు జారీ చేశారు.

తొందరలో పది చోట్ల ఉప ఎన్నికలు వస్తాయని అంతా జాగ్రత్తా ఉండాలని బీఆర్ఎస్ ని గెలిపించాలని ఆయన కోరారు. ఇక ఉప ఎన్నికలు అంటూ జరిగితే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వెళ్ళిన వారే పోటీ చేయాల్సి ఉంటుంది. వారికే టికెట్లు ఇస్తారు

బీఆర్ ఎస్ వారిని ఓడించమంటూ జనంలోకి వెళ్తుంది. కొత్త ముఖాలకు బీఆర్ఎస్ టికెట్లు ఇచ్చే చాన్స్ ఉందని అంటున్నారు. ఫిరాయింపుల అంశంతో పాటు గత ఏడాదిన్నరగా సాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ పాలన మీద ఉప ఎన్నికలు జరుగుతాయని అంటున్నారు. సాధారణంగా ఉప ఎన్నికలు అంటే అధికార పార్టీకే అడ్వాంటేజ్ గా ఉంటాయి. కానీ తెలంగాణాలో రాజకీయ చైతన్యం ఎక్కువ. అందువల్ల వారు ఇచ్చే తీర్పు విలక్షణంగా ఉంటుందని బీఆర్ఎస్ భావిస్తోంది.

దాంతో పదికి పది ఎమ్మెల్యే సీట్లు ఉప ఎన్నికల్లో గెలుచుకోగలమని భావిస్తోంది. అయితే అన్ని సీట్లు కాకపోయినా మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ గెలిచినా అది రాజకీయంగా గులాబీ పార్టీకే పొలిటికల్ గా మైలేజ్ ఇస్తుందని అంటున్నారు. అందుకే ఉప ఎన్నికల కోసం గులాబీ పార్టీ చూస్తోంది. మరి ఆ విధంగా జరుగుతుందా అత్యున్నత న్యాయ స్థానంలో ఏమి జరుగుతుంది అన్నది వేచి చూడాల్సి ఉంది.