Begin typing your search above and press return to search.

నేటి నుంచే కుల గ‌ణ‌న... ఈ చిక్కులు తీర‌తాయా?

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కుల గ‌ణన ప్ర‌క్రియ ప్రారంభమైంది.

By:  Tupaki Desk   |   6 Nov 2024 9:32 AM GMT
నేటి నుంచే కుల గ‌ణ‌న... ఈ చిక్కులు తీర‌తాయా?
X

తెలంగాణలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న కుల గ‌ణన ప్ర‌క్రియ ప్రారంభమైంది. బుధ‌వారం నుంచి నిర‌వ‌ధికంగా ఈ గ‌ణ‌న చేప‌ట్ట‌నున్నారు. రాష్ట్రంలో ఏయే సామాజిక వ‌ర్గాలు ఉన్నాయి? వారి ఆర్థిక పరిస్థితి ఏంటి? వారి జీవ‌నోపాధులు, విద్య‌, వైద్య సదుపాయం వంటి అన్ని కీల‌క అంశాల‌పై నా స‌ర్కారు ఈ గ‌ణ‌న‌ను చేప‌డుతోంది. ప్ర‌తి కుటుంబం నుంచి ఈ వివ‌రాలు సేక‌రించేందుకు రెడీ అయింది.

ఈ స‌ర్వేను రాష్ట్రంలోని ప్ర‌భుత్వ టీచ‌ర్ల‌తోనే చేయించ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా 1,979 మంది టీచ‌ర్లు బుధ‌వారం నుంచి కేటాయించిన ఇళ్ల‌కు వెళ్లి స‌ర్వే చేప‌డ‌తారు. వీరిని ప‌ర్య‌వేక్షించేందుకు 180 మంది సూపర్‌వైజర్లను నియమించారు. ఒక్కొక్క టీచ‌ర్ కూడా 150 నుంచి 175 ఇళ్లకు వెళ్లి గ‌ణ‌న చేయాల్సి ఉంటుంది. ఈ వివ‌రాలు స‌రిగా ఉన్నాయో లేదో.. సూప‌ర్ వైజ‌ర్లు ప‌రిశీలిస్తారు. అవ‌స‌రమైతే మార్పులు కూడా చేస్తారు. టీచ‌ర్లు సాయంత్రం స్కూల్ ప‌నివేళ‌లు ముగిసిన త‌ర్వాత మాత్ర‌మే ఈ స‌ర్వేలో పాల్గొనేలా అధికారులు ఉత్త‌ర్వులు జారీ చేశారు.

ఏయే అంశాల‌పై స‌ర్వే..?

+ కుటుంబ యజమాని, స‌భ్యుల వివ‌రాలు సేక‌రిస్తారు.

+ యజమానితో వారికున్న సంబంధం

+ కుటుంబ స‌భ్యులు విద్యార్హతలు

+ చేస్తున్న వృత్తులు, ఉద్యోగం, ఉపాధి వివ‌రాలు

+ మాతృభాష, ప్రభుత్వం నుంచి అందిన ప‌థ‌కాలు.

+ ఇంటి వివ‌రాలు.. అంటే.. అద్దె ఇల్లా..సొంతిల్లా.. వంటివి.

+ పూర్వీకుల ఆస్తిపాస్తులు.. వివాదాలు.

+ ద్విచక్ర వాహనాల వివ‌రాలు.

+ కంప్యూటర్లు వాడుతుంటే ఆ వివరాలను సేకరిస్తారు.

+ కులం, మ‌తం, ప్రాంతం వివ‌రాలు తీసుకుంటారు.